సీసీ రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించిన కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్

శేరిలింగంపల్లి, ప్రజాతంత్ర, ఆగస్టు 5: శేరిలింగంపల్లి నియోజకవర్గం 124 డివిజన్ ఎల్లమ్మబండ పరిధిలోని రాజీవ్ గాంధీ నగర్ లో ఏడు లక్షల రూపాయల నిధులతో నూతనంగా నిర్మిస్తున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను డివిజన్ కార్పొరేటర్  దొడ్ల వెంకటేష్ గౌడ్   ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా కార్పొరేటర్  మాట్లాడుతూ  నాణ్యత ప్రమాణాల విషయంలో రాజీ పడకుండా సిసి రోడ్ నిర్మాణ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అన్నారు. వర్షపు నీరు నిలిచిపోవడం వంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికలతో నిర్మాణ పనులను పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. అల్విన్ కాలనీ డివిజన్లో అభివృద్ధి పనులు శరవేగంగాజరుగుతున్నాయని,  మిగిలిపోయిన పనులన్నీ పూర్తి చేసి డివిజన్ ను  ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామని తెలియచేసారు. కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు సమ్మారెడ్డి, ఉపాధ్యక్షులు కాశినాథ్ యాదవ్, ప్రధానకార్యదర్శి గుడ్ల శ్రీనివాస్, జాన్, వాసుదేవరావు, ఇంతియాజ్, వెంకటేష్, మహేష్, అరవింద్, మురళి, రవి, ఏఈ శ్రావణి, వర్క్ ఇస్పెక్టర్ రవి కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page