హిందూధర్మ ప్రచారానికి టిటిడి విశేష కృషి

  • తిరుమల పవిత్రత కోసం నిరంతరం కృషి
  • తిరుమల పవిత్రతపై విమర్శలు తగవు: ఇవో

తిరుపతి, జూన్‌ 28 : ‌సనాతన హిందూ ధర్మ ప్రచారం, వేద పరిరక్షణకు టీటీడీ విశేష కృషి చేస్తున్నదని టీటీడీ ఈఓ ఏవీ ధర్మారెడ్డి చెప్పారు. శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులకు వసతుల కల్పన, శీఘ్ర దర్శనం కోసం నిరంతరం చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. హిందువుల ఆధ్యాత్మిక రాజధాని అయిన తిరుమల పట్ల, టీటీడీ పట్ల భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా చూడాల్సిన బాధ్యత డియా ద కూడా ఉన్నదని చెప్పారు. తిరుపతిలోని శ్వేత భవనంలో టీటీడీ కార్యక్రమాలపై డియా ప్రతినిధులకు నిర్వహిస్తున్న రెండు రోజుల వర్క్ ‌షాప్‌ ‌సోమవారం ప్రారంభమైంది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఈఓ ధర్మారెడ్డి హాజరై డియా ప్రతినిధులనుద్దేశించి మాట్లాడారు. కొందరు వ్యక్తులు తమ ప్రచారం కోసం టీటీడీ ద చేసే విమర్శలు సద్విమర్శలా? కాదా? అని ఆలోచించాకే టీటీడీ వివరణతో ప్రచురించాలని డియాను ధర్మారెడ్డి కోరారు. టీటీడీ వంటి వ్యవస్థను అత్యున్నతంగా తీర్చిదిద్ది, భవిష్యత్‌ ‌తరాలవారికి మరింత ఉన్నతంగా అందించాల్సిన అవసరం ఉన్నదని చెప్పారు.

టీటీడీ భక్తుల విశ్వాసం దే నడుస్తున్నదని, దీన్ని కాపాడాల్సిన బాధ్యత టీటీడీ అధికారులు, ఉద్యోగులతో పాటు డియా ద కూడా ఉన్నదన్నారు. ఈ సందర్భంగా టీటీడీ నిర్వహిస్తున్న పాఠశాలలు, ఆసుపత్రులు, ఇతర సామాజిక సేవా కార్యక్రమాల గురించి వివరించారు. టీటీడీ భగవంతుడు నడిపిస్తున్న సంస్థ అని జేఈఓ వీర బ్రహ్మం చెప్పారు. ఇక్కడ ఎవరు తప్పు చేసినా శిక్ష అనుభవించే తీరుతారన్నారు. తిరుమల లో తప్పిపోయిన పిల్లలను వెదికి తల్లిదండ్రులు, వారి కుటుంబీకులకు అప్పగించడంలో కమాండ్‌ ‌కంట్రోల్‌ ‌సెంటర్‌ ఎం‌తో చక్కగా పని చేస్తున్నదని సీవీఎస్‌ఓ ‌నరసింహ కిషోర్‌ ‌సంతృప్తి వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో తిరుమల ఔటర్‌ ‌కారిడార్‌తో పాటు ఘాట్‌రోడ్లలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

శ్రీవారి ఆలయ నిర్వహణ, దిన, వార, పక్ష, మాస, వార్షిక ఉత్సవాలు, సేవల గురించి తెలిపారు. ప్రసాదాల తయారీ, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ‌లు, ఆలయంలో రద్దీ నిర్వహణ అంశాలను, స్వామికి చేసే అలకంరణల గురించి డిప్యూటీ ఈఓ హరీంద్రనాథ్‌ ‌వివరించారు. ఈ కార్యక్రమంలో ఇంకా జేఈఓ శ్రీమతి సదా భార్గవి, చీఫ్‌ ఇం‌జినీర్‌ ‌నాగేశ్వరరావు, ఎస్వీబీసీ సీఈఓ సురేష్‌ ‌కుమార్‌, ‌ధార్మిక ప్రాజెక్టుల ప్రోగ్రామ్స్ ఆఫీసర్‌ ‌విజయ సారధి, ప్రజా సంబంధాల అధికారి డాక్టర్‌ ‌రవితో పాటు ఆలయ అధికారులు, పలువురు డియా ప్రతినిధులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page