హైదరాబాద్‌లో అతిపెద్ద ఫార్మా సిటీ

  • లైఫ్‌ ‌సైన్సెస్‌ ‌క్యాపిటల్‌గా మార్పు
  • దావోస్‌ ‌వేదికగా మంత్రి కెటిఆర్‌ ‌వెల్లడి

హైదరాబాద్‌,‌మే23: ప్రపంచంలోనే అతిపెద్ద ఫార్మా క్లస్టర్‌ ‌హైదరాబా•లో ఏర్పాటు చేయబోతున్నట్లు తెలంగాణ ఐటీ, పరిశ్రమల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు తెలిపారు. ప్రపంచ స్థాయిలో హైదరాబాద్‌ ‌ఫార్మా సిటీని ఏర్పాటు చేస్తున్నామని, అంతర్జాతీయ ప్రాధాన్యత ఉన్న ప్రాజెక్టుకు కేంద్రం మద్దతు లేదన్నారు. లైఫ్‌ ‌సైన్సెస్‌.. ‌డిజిటల్‌ ‌డ్రగ్‌ ‌డిస్కవరీ వైపు వెళ్తోందని, ఐటీ, ఫార్మారంగం కలిసి పని చేయాల్సి ఉంటుందన్నారు. లైఫ్‌ ‌సెన్సెస్‌ ‌క్యాపిటల్‌గా హైదరాబాద్‌ ‌నిలిచిందని అన్నారు. స్విట్జర్లాండ్‌ ‌దావోస్‌ ‌వరల్డ్ ఎననామిక్స్ ‌ఫోరం సదస్సులో కేటీఆర్‌ ‌పాల్గొన్నారు. తెలంగాణలో జరిగిన లైఫ్‌ ‌సెన్సెస్‌ అభివృద్ధిపై సదస్సులో చర్చ జరిగింది. కేటీఆర్‌తో పాటు డాక్టర్‌ ‌రెడ్డీస్‌ ‌ప్రతినిధి జీవీ ప్రసాద్‌రెడ్డి, పీడబ్ల్యూసీకి చెందిన మహ్మద్‌ అథర్‌ ‌పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ ‌మాట్లాడుతూ కరోనా వల్ల లైఫ్‌ ‌సైన్సెస్‌, ‌మెడికల్‌కు ప్రాధాన్యం పెరిగిందన్నారు. మెడికల్‌ ‌రంగానికి ఊతమిచ్చేలా తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ప్రపంచపోటీ తట్టుకోవాలంటే విప్లవాత్మకమైన సంస్కరణలు అవసరమని అభిప్రాయపడ్డారు. లైఫ్‌ ‌సైన్సెస్‌లో ఇతర నగరాల కంటే హైదరాబాద్‌ ‌ముందుందని కేటీఆర్‌ ‌పేర్కొన్నారు.

తెలంగాణలో మరో సంస్థ పెట్టుబడులు
హైదరాబాద్‌లో పెట్టుబడికి స్విస్‌రే అంగీకారం
ట్విట్టర్‌ ‌వేదికగా వెల్లడించిన మంత్రి కెటిఆర్‌

‌హైదరాబాద్‌,‌మే23: తెలంగాణలో మరో సంస్థ  భారీ పెట్టుబడులు పెట్టేందుకు ముందు కొచ్చింది. హైదరాబాద్‌లో కంపెనీ ఏర్పాటుకు స్విట్జర్లాండ్‌ ‌బీమా సేవల కంపెనీ స్విస్‌రే ప్రకటించింది. ఈ మేరకు కేటీఆర్‌
‌ట్విటర్‌ ‌వేదికగా తెలిపారు.  రాష్ట్రంలో ఈ కంపనీ అంతర్జాతీయ కంపెనీ పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించింది. హైదరాబాద్‌లో తమ కార్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నట్లు స్విట్జర్లాండ్‌కు చెందిన బీమా సేవల కంపెనీ స్విస్‌రే ప్రకటించింది. దావోస్‌ ‌పెవిలియన్‌లో మంత్రి కేటీఆర్‌తో సమావేశమైన స్విస్‌రే కంపెనీ ఎండీ వెరోనికా, ప్రతినిధులు ఈ మేరకు నిర్ణయించారు. ఈ విషయాన్ని ట్విటర్‌ ‌ద్వారా మంత్రి కేటీఆర్‌ ‌వెల్లడించారు. హైదరాబాద్‌ ‌బ్యాంకింగ్‌, ‌ఫైనాన్షియల్‌, ‌సర్వీసెస్‌, ఇన్సూరెన్స్ ‌రంగంలోకి స్విస్‌రేకు స్వాగతమని కేటీఆర్‌ ‌ట్వీట్‌ ‌చేశారు. 250 మంది ఉద్యోగులతో ప్రారంభమయ్యే హైదరాబాద్‌ ‌యూనిట్‌లో డేటా, డిజిటల్‌ ‌కేబులిటీస్‌, ‌ప్రొడక్ట్ ‌మోడలింగ్‌, ‌రిస్క్ ‌మేనేజ్‌మెంట్‌పై దృష్టి సారిస్తుందని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page