వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

‌సంక్షోభంలో వ్యవసాయం..!

March 30, 2019

యాదాద్రిలో స్వామిని దర్శించుకుని పూజలు చేస్తున్న తెలంగాణ జనసమితి అధినేత కోదండరామ్‌( ‌టిజెఎస్‌ ‌కార్యాలయాన్ని ప్రారంభిస్తున్న దృశ్యం.)

నివారణ ప్రయత్నం జరగాలి
యాదగిరిగుట్టలో తెలంగాణ జన సమితి జిల్లా కార్యాలయాన్ని టీజేయస్‌ అధ్యక్షుడు ప్రో’కోదండరాం ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన డియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఖమ్మం, మహబూబాబాద్‌లలో తమ ఎంపీ అభ్యర్థులను ప్రచారం చేసి గెలిపించుకుంటామని అన్నారు. జాతీయస్థాయిలో వ్యవసాయం సంక్షోభానికి తీవ్రమైన ప్రయత్నం జరగాలని అలాగే విద్య, వైద్యం అందరికీ ఉచితంగా అందాలని నిరుద్యోగ పరిష్కారానికి ఏకాభిప్రాయానికి వచ్చి ప్రతి పేద కుటుంబానికి విధిగా నెలకు 6000 ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టిన కాంగ్రెస్‌ ‌పార్టీకి మద్దతు ఇస్తున్నామన్నారు. అలాగే భువనగిరి పార్లమెంట్‌ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి మద్దతు తెలుపుతున్నాం కావున టీజేయస్‌ ‌కార్యకర్తలు అందరూ కోమటిరెడ్డికి వోట్లు వేసి అధిక మెజార్టీతో గెలిపించాలన్నారు. ఇవాళ పనిచేసే వారికి పట్టణాలు ప్లలెల్లో గాని యువతీ యువకులకు ఏదో ఒక చోట ప్రతి ఒక్కరికి పని కల్పించాలన్నదే మా సంకల్పం అన్నారు. ఇది అమలు కావడానికి మేము ఖచ్చితంగా కష్టపడి పని చేస్తాం. మేము గెలిచిన చోట మా ప్రయత్నం ఉంటుందన్నారు. ఇప్పుడు చేసిన పనులు అమలు కావాలంటే జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌ ‌పార్టీ నేతృత్వంలోని 21 పార్టీలతో కలిసి మేనిఫెస్టోలోని రుణమాఫీ జాతీయ స్థాయిలో అమలు కావడానికి మా ప్రయత్నం కొనసాగుతుందన్నారు. ఇవాళ జరిగే ఎన్నికలు రాష్ట్ర ప్రభుత్వాల కొరకు జరిగే ఎన్నికలు కావు కేంద్రంలో కాంగ్రెస్‌ ‌కూటమి ప్రభుత్వం ఏర్పాటు కావాలన్నారు. ఎమ్మెల్యేలు ఏ పార్టీలో గెలుస్తున్నారు ఏ పార్టీలోకి వెళ్తున్నారో చెప్పలేని పరిస్థితులు ఉన్నాయి.. ఎమ్మెల్యేలను అధికార పార్టీ డబ్బులను ఆశ జూపి కొనుగోలు చేస్తున్నదని ఆరోపించారు. అనంతరం ఆయన యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.