తాండూరు, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 27: శాంతియుతంగా సమ్మె కొనసాగిస్తున్న అంగన్వాడీల పోలీసులు అరెస్టు చేయడం అప్రజా స్వామికం అని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు కే శ్రీనివాస్ అన్నారు. బుధవారం రాష్ట్ర మంత్రులు వికారాబాద్ జిల్లా పట్టణంలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించేందుకు పర్యటిస్తున్న నేపథ్యంలో గత 17 రోజులుగా తమ డిమాండ్ల సాధనకై సమ్మె చేస్తున్న అంగన్వాడీలను మంత్రుల పర్యటనను అడ్డుకుంటారనే నిఘా వర్గాల సమాచారం మేరకు స్థానిక పట్టణ పోలీసులు సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు కే శ్రీనివాస్ అంగన్వాడీలను ముందస్తుగా అరెస్టు చేసి తాండూర్ నుండి యాలాల పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ మాట్లాడుతూ అంగన్వాడీలను అక్రమంగా అరెస్టు చేయడమే తీవ్రంగా తప్పుపట్టారు అరెస్టు చేసిన అంగన్వాడీలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని అంగన్వాడి వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో యాలాల మండల కేంద్రంలోని అంబేడ్కర్ విగ్రహం ముందు అంగన్వాడీలు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. 17 రోజులుగా సమ్మె చేస్తున్న తమ సమస్యలు పరిష్కరించకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం సరైంది కాదన్నారు. 45 సంవత్సరాలుగా ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉంటూ పనిచేస్తున్న తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించకపోవడం, పెరిగిన ధరలకు అనుగుణంగా కనీస వేతనం 26000 ఇవ్వాలని, తన సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు బుగ్గప్ప సుజాత,కవిత, సౌభాగ్య లక్ష్మి, నిర్మల,శిరీష, తదితరులు అంగన్వాడీలు పాల్గొన్నారు.