అంగన్వాడీ ఉద్యోగుల న్యాయమైన సమస్యలను పరిష్కరించాలి

ఆమనగల్లు, ప్రజాతంత్ర సెప్టెంబర్ 13 : శ్రమకు తగ్గ కనీస వేతనం పెంచాలని, అంగన్వాడి ఉద్యోగులను పర్మి నెంట్ చేయాలని తదితర న్యాయ మైన డిమాండ్ల సాధన కోసం అంగన్వాడి ఉద్యోగులు చేస్తున్న సమ్మె కడ్తాల మండలంలో మూడో రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా బిజెపి జిల్లా ప్రచార కమిటీ సభ్యులు రెడ్డినాయక్, జిల్లా ప్రధాన కార్యదర్శి సాయి లాల్, మండల ప్రధాన కార్యదర్శి జంగం వెంకటయ్య గౌడ్, జిల్లా ఎస్టి మోర్చా అధికార ప్రతినిధి లక్ష్మణ్, సీనియర్ నాయకులు లింగం గౌడ్ సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా కడ్తాల్ మండల కేంద్రములో అంగన్ వాడి ఉద్యోగులు చేస్తున్న నిరవధిక సమ్మె కు బిజెపి పూర్తి మద్దతు ప్రకటిస్తుందని ప్రభుత్వం వెంటనే వారి సమస్యలను పరిష్కరించాలని కోరారు. వారు మాట్లాడుతూ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page