అంగన్వాడీ ఉద్యోగుల న్యాయమైన సమస్యలను పరిష్కరించాలి

 ఆమనగల్లు, ప్రజాతంత్ర సెప్టెంబర్ 12 : శ్రమకు తగ్గ కనీస వేతనం పెంచాలని, అంగన్వాడి ఉద్యోగులను పర్మి నెంట్ చేయాలని తదితర న్యాయ మైన డిమాండ్ల సాధన కోసం సమ్మె చేస్తున్న అంగన్వాడి ఉద్యోగులకు తెలంగాణ యువజన సంఘాల ఐక్యవేదిక అధ్యక్షుడు ఎర్రోళ్ల రాఘవేందర్ సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా కడ్తాల్ మండల కేంద్రములో అంగన్ వాడి ఉద్యోగులు చేస్తున్న నిరవధిక సమ్మె కు మద్దతు ప్రకటించిన ఆయన మాట్లాడుతూ వారి న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మైసిగండి వివేకానంద యువజన సంఘం అధ్యక్షుడు సభావత్ రామ్ నాయక్, మూడ రవి, అంగన్వాడి ఉద్యోగులు జ్ఞానేశ్వరి, భాగ్య, మంగమ్మ, అలివేలు, యాదమ్మ, సంగీత, సుగుణ,  సుజాత, జయా రెడ్డి,  లీలా వతి,  నీల వేణి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page