-సిఐటియు రాష్ట్ర కమిటీ సభ్యులు కే. రాజయ్య
– సెంటర్ తాళాలు పగలగొట్టిన వారి పై కేసు నమోదు చేయాలి
– కేసు నమోదు చెయ్యని ఎడల పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనలు.
పటాన్ చెరు,ప్రజాతంత్ర, సెప్టెంబర్ 13: అంగన్ వాడి ఉద్యోగుల న్యాయమైన సమస్యలను పరిష్కరించకపోతే సమ్మెను మరింత ఉధృతం చేస్తామని సిఐటియు రాష్ట్ర కమిటీ సభ్యులు కే రాజయ్య పేర్కొన్నారు. బుధవారం పట్టణంలోని అంగన్వాడి సమ్మె శిబిరాన్ని సిఐటియు రాష్ట్ర కమిటీ సభ్యులు కే రాజయ్య సందర్శించి సంఘీభావం తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకపోతే సమ్మెను మరింత ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదన్నారు, నిర్బంధం విధిస్తే పోరాటం మరింత ఎగిసిపడుతుందని ఆయన అన్నారు, అంగన్వాడి ఉద్యోగులకు సమస్యలు అనేకం ఉన్నాయని అన్నారు, తెలంగాణ రాష్ట్రంలో అంగన్వాడి ఉద్యోగుల సమస్యలు పరిష్కారం కావడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు, అనేకసార్లు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయిన, నిరసన వ్యక్తం చేసిన, వినతి పత్రాలు అందజేసినప్పటికీ ఒక్క సమస్య పరిష్కారం కాలేదని అన్నారు, అందుకే సమ్మెలోకు పోవాల్సి వచ్చిందని అన్నారు. కనీస వేతనం 26000 ఇవ్వాలని, ఈఎస్ఐ,పిఎఫ్ అమలు చేయాలని, గ్రాటిట్యూట్ ఇవ్వాలని, రిటైర్మెంట్ బెనిఫిట్ టీచర్లకు పది లక్షలు, ఆయల కు ఐదు లక్షలు ఇవ్వాలని, ప్రమాద బీమా 20 లక్షలు ఇవ్వాలని, పని భారం తగ్గించాలని, ప్రతి సెంటర్ కు రెండు లక్ష రూపాయలు కేటాయించాలని తదితర సమస్యల పరిష్కారం కోసం సమ్మె జరుగుతుందని ఆయన అన్నారు. అంగన్వాడి సెంటర్ల తాళాలు పగలగొట్టి తెరిపించడం దారుణమని అన్నారు, స్వతంత్ర దేశంలోనే ఉన్నామని ఆయన ప్రశ్నించారు, అంగన్వాడీలు సమ్మేలో ఉంటే ప్రభుత్వం తాళాలు పగలగొట్టడం ఏమిటని ప్రశ్నించారు. పోలీస్ కేసులు పెడతామని ఆయన హెచ్చరించారు, కేసులు నమోదు చేయకపోతే పోలీస్ స్టేషన్ వద్ద పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ఆయన అన్నారు, ఉద్యోగ సంఘాలు ఇతరులు ఎవరు కూడా ప్రభుత్వం చెప్పే మాయమాటలో పడొద్దన్నారు, అలాగే మంత్రి కొన్ని ప్రకటనలు చేశారని అవి చిన్న చిన్నవి మాత్రమే ,అసలు సమస్యల గురించి ప్రస్తావన చేయలేదని అన్నారు. ప్రభుత్వము వెంటనే చర్చలకు పిలిచి సమస్యలు పరిష్కరించాలని, లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని అన్నారు.ఈ కార్యక్రమంలో నాగేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.