అకాలవర్షం..అపారనష్టం…


నీట మునిగిన పంటలు….మార్కెట్‌ ‌యార్డుల్లో తడిసిన ధాన్యం
రైతన్నను నిండా ముంచిన వాన…దిక్కుతోచని స్థితిలో అన్నదాత
రాష్ట్ర వ్యాప్తంగా రెండురోజులుగా విస్తారంగా వర్షాలు పడే అవకాశం

 

 రాష్ట్ర వ్యాప్తంగా రెండురోజుల నుంచి ద్రోణి ప్రభావంతో జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో అకాల వర్షాలలు పడుతుండడంతో రైతన్నల్లు లబోదిబోమంటున్నారు. వానల కారణంగా పంటలు తడిసి ముద్దవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్‌ ‌యార్డుల్లో అమ్మకానికి తెచ్చిన వేరుశనగ, కల్లాల్లో మిర్చి పంటల అకాల వర్షాలకు తడిసి తీవ్ర నష్టం వాటిల్లిందని రైతులు వాపోతున్నారు. ఇలా పంటలు తడవడం వల్ల వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్‌ ‌యార్డుల్లో పంటలు తడిస్తే ఎవరు కొనుగోలు చేస్తారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంకా రెండు రోజుల పాటు వానలు పడనున్నాయని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో రైతులు తీవ్ర ఆందోళనలో వున్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో కొత్త బస్టాండ్‌ ‌చౌరస్తా, ధరూర్‌ ‌క్యాంప్‌, ‌విద్యానగర్‌ , ఉస్మాన్‌ ‌పుర,ప్రాంతాల్లో వర్షం కురిసింది. రాయికల్‌ , ‌సారంగాపూర్‌ , ‌బీర్పూర్‌ ‌పలు మండలాల్లో ఉరుములు మెరుపులతో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తున్నాయి. అలాగే కొడిమ్యల మండల కేంద్రంలో భారీ వర్షం కురిసింది. సంగారెడ్డి జిల్లాలో ఈదురు గాలులు బలంగా వీస్తున్నాయి. మునిపల్లిలో మామిడి రాలిపోయింది. న్యాల్‌ ‌కల్‌లో వడగండ్లకి పుచ్చకాయ పంట ధ్వంసం అయ్యింది. వర్షం మళ్ళీ మళ్లీ వొస్తుండటంతో అన్నదాతలు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఈదురు గాలులు బలంగా వీస్తున్నాయి. పలు చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన మోస్తరు వర్షం కురిసింది. వానలకు పలు గ్రామాల్లో విద్యుత్‌ ‌కి అంతరాయం ఏర్పడింది. దీంతో ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. మహబూబ్‌ ‌నగర్‌ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉరుములతో కూడిన భారీ వర్షం కురిసింది. వేర్వేరు చోట్ల పిడుగుపాటుకు ముగ్గురు మృతి చెందారు. ఐజ, మానవపాడు మండలాల్లో కల్లాల లోని మిర్చి తడిసి ముద్దైంది. దీంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక గద్వాల మార్కెట్‌ ‌యార్డ్‌లో వర్షపు నీటికి అమ్మకానికి తెచ్చిన వేరుశనగ కొట్టుకుపోవడంతో రైతన్నలు లబోదిబో మంటున్నారు. ఉమ్మడి మెదక్‌ ‌జిల్లాలో వాన ముసురుకుంది. చాలా చోట్ల ఉదయం నుంచి చిరుజల్లులు కురుస్తున్నాయి. నిన్నటి వడగళ్ల వానతో చాలా చోట్ల పంటలు పాడై పోయాయి. దీంతో అన్నదాతలు కన్నీరు పెట్టుకున్నారు. అప్పులు చేసి పంటలు వేశామని ఇప్పుడు ఆకాల వర్షాలకు పంటలు దబ్బుతిని, నీట మునిగాయంటూ.. వాపోతున్నారు. నిజామాబాద్‌ ‌జిల్లాలో అకాల వర్షాలతో వ్యవసాయ మార్కెట్‌ ‌యార్డులో పసుపు బస్తాలు తడిసి ముద్దయ్యాయి. దీంతో.. నేడు మార్కెట్‌ ‌యార్డుకు సెలవు ప్రకటించింది. జిల్లాలోని ఆర్ముర్‌, ‌బాల్కొండ మెండోరా, వేల్పూర్‌ ‌ముప్కాల్‌, ‌మండలాల్లో మొక్క జొన్న తడిసి పోయింది. వర్ష సూచనతో పసుపు కొనుగోళ్లు నిలిపి వేశారు అధికారులు. దీంతో.. వరుస సెలవులతో రైతుల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కరీంనగర్‌ ‌జిల్లా గన్నేరువరం మండలంలో అకాల వర్షాలకు వరి, మొక్కజొన్న పంటలు అక్కడక్కడ దెబ్బతిన్నాయి. ఈదురుగాలులతో ట్రాక్టర్ల పై విరిగిపడ్డ చెట్లు రెండు ట్రాక్టర్ల ఇంజన్లు ద్వంసమయ్యాయి. మండలంలోని మాదాపూర్‌ ‌గ్రామంలో అకాల వర్షానికి మొక్కజొన్న పంట నెలకొరిగింది దీంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page