హైదరాబాద్ లో బుధవారం తెల్లవారు ఝామున ఘోర విషాదం చోటు చేసుకుంది. బోయిగూడలోని ప్లాస్టిక్ గోడౌన్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించడంతో 11 మంది సజీవదహనం అయ్యారు.మృతులు వివిధ రాష్ట్రాలకు చెందిన వారు బీహార్ కి చెందిన కార్మికులు ఎక్కువగా ఉన్నట్లు సమాచారం.
1.సికిందర్.40
2.బిట్టూ.23
3.సతేంధర్ 35
4.గొల్లు,28
5.దామోదర్,27
6.చింటూ,29
7.రాజేష్,25
8.దీపక్,26
9.పంకజ్,26
10.దినేష్,35
11.రాజేష్,25
విషయం తెలిసిన వెంటనే మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రమాద స్థలి వద్దకు చేరుకున్నారు. ప్రమాదానికి దారి తీసిన కారణాలపై మంత్రి ఆరా తీశారు. మరోవైపు ఈ ప్రమాదంలో మృతి చెందిన వారంతా బీహార్ వాసులుగా గుర్తించారు. మృతులు బిట్టు, సికిందర్, దినేష్, దామోదర్, చింటు, సికిందర్, రాజేష్, రాజు, దీపక్, పంకజ్‌గా గుర్తించారు.
షార్ట్‌సర్క్యూటే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. మొత్తం 11 మృతదేహాలను వెలికితీసిన రెస్క్యూ సిబ్బంది. మృతదేహాల పోస్ట్ మార్టం నిమిత్తం పోలీసులు గాంధీ మార్చురీకి తరలించారు. మృతులకు పోస్టుమార్టం పంచనామ… పొగతో ఊపిరి ఆడక మృతి చెందినట్లు తెలుస్తుంది. కొందరు మృతదేహాలు గుర్తు పట్టక పోవడం తో డీఎన్ఏ పరీక్షలు చేసేందుకు ఏర్పాట్లు చేసారు.