అత్యున్న‌త ప్ర‌మాణాల‌తో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్‌

వొచ్చే అకాడ‌మిక్ ఇయ‌ర్ లోనే ప్రారంభం
పోలీసులు చేసేది ఉద్యోగం కాదు.. భావోద్వేగం..
వారి సేవ‌ల‌తోనే ప్ర‌జ‌ల్లో ధైర్యం..

నిరుద్యోగులు ప్రతిపక్షాల  ఉచ్చులో ప‌డొద్దు..
పోలీస్ డ్యూటీ మీట్-2024 ముగింపు కార్యక్రమంలో
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిఅత్యున్నత ప్ర‌మాణాల‌తో  50 ఎకరాల్లో పోలీస్ సిబ్బంది పిల్లల కోసం యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ను ప్రారంభించాలని నిర్ణయించిన‌ట్లు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ప్ర‌క‌టించారు. వొచ్చే అకడమిక్ ఇయర్ లోనే స్కూల్ ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నామ‌ని తెలిపారు. భవిష్యత్ లో పోలీస్ స్కూల్ లో చదివామని గర్వంగా చెప్పుకునేలా తీర్చిదిద్దుతామ‌ని,  మొదటి విడతగా 5 నుంచి 8 వతరగతి వరకు మొదలు పెడతామ‌న్నారు.  ఆ తరువాత ఒక్కో తరగతిని పెంచుకుంటూ వెళతాం. తెలంగాణ పోలీస్ దేశంలోని మిగతా రాష్ట్రాల పోలీస్ కు ఆదర్శంగా నిలవాల‌ని రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు.  సీఐడీ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో పోలీస్ అకాడమీ గ్రౌండ్స్లో తెలంగాణ పోలీస్ ఫస్ట్ డ్యూటీ మీట్-2024 క్లోజింగ్ సెర్మనీ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు.

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ..
తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థకు స్ఫూర్తిని ఇచ్చేలా కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమ‌ని  సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్ర ఏర్పాటులో పోలీసు సోదరులది కీలకపాత్ర అని,  తెలంగాణ రాష్ట్ర సాధనలో పోలీస్ కిష్టయ్య త్యాగం ఎప్పటికీ మరిచిపోలేమ‌ని గుర్తుచేశారు.  పోలీస్ ఉద్యోగం ఒక ఉద్యోగం మాత్రమే కాదు.. అది ఒక భావోద్వేగమ‌ని అన్నారు.  పోలీస్ శాఖ గౌరవం పెరిగితే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ట పెరుగుతుంది. చిన్న పొరపాటు జరిగినా అది ప్రభుత్వానికి చెడ్డపెరు తెస్తుంది. పోలీస్ సేవలు, త్యాగం వల్లే ప్రజలు నిర్భయంగా ఉండగలుగుతున్నారు. శాంతి భద్రతలు బాగుంటేనే ఆ రాష్ట్రంలో పెట్టుబడులు వస్తాయి. అంతర్జాతీయ నగరంగా హైదరాబాద్ అభివృద్ధికి పోలీస్ సేవలు అభినందనీయం పోలీసుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.
రాష్ట్రంలో డ్రగ్స్, గంజాయి సరఫరాకు అడ్డుకట్ట వేయాల‌ని, అలాంటి వారిపట్ల కఠినంగా వ్యవహరించాల‌ని చెప్పారు. సైబర్ క్రైమ్ ను నియంత్రించి, ప్రజలకు అవగాహన కల్పించాల‌ని,  డ్రగ్స్, సైబర్ క్రైమ్ విషయంలో దోషులు ఎంతటి వారైనా విడిచిపెట్టొద్దని ఆదేశించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page