అదుపుతప్పుతున్న- అందమైన బాల్యం

‘‘‘‌నేటి బాలలే రేపటి పౌరులు’ అన్నారు. కానీ, నేడు బాల్యం అదుపుతప్పుతోంది. వయసుకు మించిన ఆలోచనలతో పరుగులు పెడుతూ, జీవితానికి అర్థం ఏమిటో తెలియక, నిరాశ నిస్పృహల్లోకి వెళ్ళిపోతూ, ఏమి సాధించలేక నిస్సహాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నది. ఏ పని చెప్పినా, చేయాలన్నా పెద్దల మాటకు ఎదురు చెప్పడమే. పిల్లలందరికీ నేడు ఆనవాయితీగా మారిపోయింది. పిల్లలు నేడు మానసికంగా, శారీరకంగా ఎదుగుదలలోను పెరుగుదలలోను సరైన స్థితిలో లేరు. అందుకు కుటుంబ నేపథ్యం కావచ్చు. తల్లిదండ్రుల ప్రవర్తన తీరు కావచ్చు. వారి ఆర్థిక పరిస్థితులు కావచ్చు. సమవయస్కుల ప్రభావము ఉండొచ్చు, ఏదేమైనాప్పటికీ బాల్యం అదుపుతప్పుతోంది.’’
‘నేటి బాలలే రేపటి పౌరులు’ అన్నారు. కానీ, నేడు బాల్యం అదుపుతప్పుతోంది. వయసుకు మించిన ఆలోచనలతో పరుగులు పెడుతూ, జీవితానికి అర్థం ఏమిటో తెలియక, నిరాశ నిస్పృహల్లోకి వెళ్ళిపోతూ, ఏమి సాధించలేక నిస్సహాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నది. ఏ పని చెప్పినా, చేయాలన్నా పెద్దల మాటకు ఎదురు చెప్పడమే. పిల్లలందరికీ నేడు ఆనవాయితీగా మారిపోయింది. పిల్లలు నేడు మానసికంగా, శారీరకంగా ఎదుగుదలలోను పెరుగుదలలోను సరైన స్థితిలో లేరు. అందుకు కుటుంబ నేపథ్యం కావచ్చు. తల్లిదండ్రుల ప్రవర్తన తీరు కావచ్చు. వారి ఆర్థిక పరిస్థితులు కావచ్చు. సమవయస్కుల ప్రభావము ఉండొచ్చు, ఏదేమైనాప్పటికీ బాల్యం అదుపుతప్పుతోంది. దీనికి కారణం నేడున్న సాంకేతిక పరిజ్ఞానం కూడా వారిలోని బలహీనతకు కారణం కావచ్చు.  చూస్తుంటే వారిని అదుపులో ఉంచడం కూడా కష్టంగానే ఉంది. ఎందుకంటే నేడు పిల్లల్ని ఒక్క మాటంటే చాలు దాన్ని వాళ్ళు మానసికంగా సరిగా అర్థం చేసుకోక, వారు అర్ధాంతరంగా ఆత్మహత్యలకు పాల్పడుతూ, వారి జీవితాలనే ముగిస్తున్నరు.
ఇంతటి సున్నితత్వం నేడున్న విద్యార్థుల్లోనూ, యువతలోనూ ఎక్కువగా కనిపిస్తుంది. ఇలాంటి దుస్థితికి కారణం నేటి విద్యా విధానమా? నేడు సాగుతున్నటువంటి బోధనాతీరా? రాజకీయ విధానాలా తెలియడం లేదు.
ఏదేమైనాప్పటికీ పిల్లలను మానసికంగా దృఢంగా మలచాల్సిన తరుణం ఆసన్నమైంది. లేకుంటే చాలామంది జీవితం అంటే ఏమిటో తెలియకుండా, జల్సాగా బతికీడుస్తున్నారు. మరి పిల్లల్లో ఇప్పుడు మానసిక ధైర్యాన్ని నింపాలి. ముందు అందుకు ముందుగా కుటుంబంలోనే సరైన ప్రవర్తనను అలవాటు చేయాలి. వాళ్లతో కుటుంబ సభ్యుల అనుబంధం చాలా గట్టిగా ఉండేలా చూసుకోవాలి. ఏం జరిగినా, ఏం చేసినా,  ధైర్యంగా
ఆ విషయాన్ని తల్లిదండ్రులతో, కుటుంబ సభ్యులతో పంచుకునేలా, మాట్లాడేలాగా  దానికి సమాధానం వెతుక్కునేలా, ఇంట్లో వాతావరణం ఉండాలి. లేకుంటే వాళ్ళందరూ బయట ప్రవర్తనతో ఆకర్షితులవుతారు. ఎంతైనా అది ఆకర్షణ వికర్షణై, చివరకు సంఘర్షణకు దారితీస్తుంది.
బాల్యం తీర్చిదిద్దబడాలంటే తల్లిదండ్రులువారికి కావాల్సిన సౌకర్యాలు సమకూర్చడమే కాదు,  తెలిసి తెలియని తనంతో ఎక్కడెక్కడో తిరుగుతుంటారు. ఒక్కసారి అనుకోకుండా సమస్యల్లో పడి, అయోమయానికి గురైతూ, గమ్యాన్ని నిర్దేశిం చుకునే క్రమంలో సైతం తప్పటడుగులేస్తుంటారు. కాబట్టి ముఖ్యంగా ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, స్నేహితులే కాకుండా మొత్తం సమాజం సైతం ప్రభావాన్ని చూపిస్తాయి. ఇక్కడ మార్గ నిర్దేశకులు  తల్లిదండ్రులు, ఉపాద్యాయులే మరి. ముఖ్యంగా కుటుంబం యొక్క ప్రభావం, స్నేహితుల ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి తల్లిదండ్రులు పిల్లలతో స్నేహభావంతో ఉండాలి. వారిలో సరైన ప్రవర్తన అలవడే వరకు వారికి మంచి ప్రేరణాత్మకమైనటువంటి మాటలతో దారి తప్పకుండా చూడాలి.
మరోవైపు పేదరికంతో అల్లాడుతున్న పిల్లలైతే, సరైనటువంటి ఆహారం లేక, సరైనటువంటి వసతులు లేక, కనీస సౌకర్యాలకు కూడా నోచుకోకుండా కాలం గడుపుతుంటారు. ఇలాంటి పిల్లలు భవిష్యత్తులో అనేక రకాల ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటారు. అందుకే ప్రభుత్వం చదువుకునే పిల్లలందరికీ సరైనటువంటి పోషకాహారాన్ని, సరైనటువంటి విద్యనందించి, బలమైన భవిష్యత్తు భారతపౌరుల ఎదుగుదలకు పాటుపడాలి.
ప్రభుత్వం పాఠశాలలో విద్యార్థులకు సరైనటువంటి సౌకర్యాలు కల్పించాలి.మంచి వాతావరణంతో కూడిన పాఠశాలలు నిర్మించాలి. సరైన తరగతి గదులుండాలి. ఆడపిల్లలందరికి సరైన మరుగుదొడ్లు నిర్మాణం జరగాలి. కాని ఇప్పటికీ పెచ్చులూడుతున్న బడిగోడలే.  ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థులకు వారికి కావలసినటువంటి అవకాశాలను కూడా కల్పించాల్సిన బాధ్యత వహించాలి. బడుగు బలహీన వర్గాలకు చెందిన పిల్లలు విద్యకు దూరం కాకుండా చూడాలి. విధిగా ఉచిత నిర్బంధ విద్యను అమలుచేయాలి.
ముఖ్యంగా ఆడపిల్లల చదువు ముందుకు సాగాలంటే గ్రామాల్లో ఎన్నో ఆటంకాలు, అవస్థలు ఎదుర్కోవలసి వస్తుంది. తల్లిదండ్రులు, సమాజం ఇంకా ఆడపిల్లల చదువు విషయంలో సరైన ఆలోచన లేదు. వారికి సరైన అవకాశాలు ఎన్నో నేడున్నాయనే అవగాహన కల్పించాల్సిన అవసరం ఇంకా ఉంది. ఆడపిల్లల చదువు వృధా కాదనేది తెలియజెప్పాలి.
పిల్లలు మానసికంగా కృంగిపోకుండా వారికి మానసికంగా, శారీరకంగా ఎదిగి ముందుకు సాగే విద్య అందించాలి. నేడైతే విద్య పెద్ద వ్యాపారమైంది. బాల్యం నేడు బడిలో వికసించాలి కానీ ఇంకా బడిబయటే బతుకెల్లదీస్తుంది. చెత్తకుప్పలో, చెరసాలలో, బాలకార్మికులుగా, మరెన్నో పనుల్లో నలిగిపోతుంది. బాల్యదశలో భవిష్యత్తు దిద్దుకోవాల్సిన ఎందరో బడిబయటే కాలమెల్లదీస్తున్నరు. ఏదేమైనా బాల్యదశలో పిల్లలందరికీ సరైన అలవాట్లు నేర్పుతూ, క్రమశిక్షణతో ముందుకు నడపాలి. శరీరానికి కావాల్సిన వ్యాయామం, మంచి నడవడికకు నీతికథలు, శతకపద్యాలు నేర్పాలి. మానసికంగా దృఢంగా తయారచేయడానికి ప్రతి పాఠశాలలో ఒక సైకాలజీ ఉపాద్యాయున్ని నియమించి, ఏదైనా జరిగినప్పుడు వారిచేత కౌన్సెలింగ్‌ ఇప్పించాలి. తల్లిదండ్రులు ముఖ్యంగా ఉపాధ్యాయులతో మాట్లాడుతూ, వారికి కావలసినవి, వారి చదువువిషయంలో ఎదుర్కొంటున్న ఇబ్బందులు తెలుసుకుని, అందుకు అవసరమైన సౌకర్యాలు కల్పిస్తే విద్యార్థులు దారితప్పకుండా ఉంటారు. ప్రభుత్వ పరంగా వారి తరుపునుండి సౌకర్యాలు కల్పిస్తే భవిష్యత్తు భారతం భద్రంగా ఉంటుంది.
image.png
సి. శేఖర్‌(‌సియస్సార్‌),
‌పాలమూరు, 9010480557.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page