మొన్న …
బాల్యంలో
అమ్మ ఒడిలో పడుకొని
చుక్కలు చూస్తూ అనుకుంటారు
ఏ అమ్మ ఆకాశంలో చుక్కలు పెట్టి ముగ్గు వేయడం మరిచిందో అని

నిన్న …
యవ్వనంలో
పిల్ల గాలిని ఆస్వాదిస్తూ
చుక్కలు చూస్తూ అనుకుంటారు
ఈ చుక్కలాంటి అమ్మాయి తన పక్కనుండాలని .

నేడు ….
వృద్ధాప్యంలో
ఒంటరి నిశీధిలో
చుక్కలు చూస్తూ అనుకుంటారు
రాలిపోయే ఈ చుక్కకి ఇంత తళుకులు ఎందుకో అని

మొన్న , నిన్న , నేడు
చుక్కల్లో మార్పు లేదు
అనుభవంలో మార్పు.

డా.రమాదేవి ఇడికూడ
తెలుగు అధ్యాపకులు.
భువనగిరి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page