అన్నిటికీ తెలంగాణ ఆదర్శమన్న బిఆర్‌ఎస్‌…

రెండు ప్రధాన ఎన్నికల్లో ప్రతిష్ట కోల్పోవడంతో పార్టీకి వెన్నుదన్నుగా నిలువాల్సిన నాయకులంతా పలాయనం చిత్తగించారు. ఒకరు ఇద్దరు అంటూ ఇప్పటి వరకు పది మంది ఎంఎల్‌ఏలు, ఆరుగురు ఎంఎల్‌సీలు పార్టీ వీడిన వారిలో ఉన్నారు. వీరిలో చాలా మంది పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మంత్రి పదవులు, ఇతర ఉన్నత పదవులను అనుభవించిన వారు కావడం విశేషం. ఉద్యమంతో అనుబంధమున్నవారే ఇంకా పార్టీలో కొనసాగుతున్నారు. ఇంతకాలం కేవలం బిఆర్‌ఎస్‌కే ఉద్యమ పార్టీగా పేరుండేది, కాని ఇప్పుడు అన్ని పార్టీల్లోకి ఉద్యమకారులు వెళ్ళడంతో ఏపార్టీని పక్కకు పెట్టే పరిస్థితి లేదు. మొదటి నుండీ ఉద్యమ పార్టీగా బిఆర్‌ఎస్‌కు ప్రత్యేక గుర్తుంపు ఉంది. గడచిన 24 ఏళ్ళుగా ఆ పార్టీ ప్రస్థానం కొనసాగుతూ వొస్తున్నది. కాని, ఇప్పుడు ఆపార్టీ ఉనికి ప్రశ్నార్థకంగా మారింది. దీంతో పార్టీని బలోపేతం చేసే ఆలోచనలో అధినాయకత్వం పడింది. పక్కనున్న తమిళనాడులోని ద్రవిడ మున్నెట్ర ఖజగం(డిఎంకె) అక్కడి రాజకీయాల్లో ఎంతటి తుఫాన్‌ ‌వొచ్చినా తట్టుకుని నిలబడుతూ వొస్తున్నదంటే గ్రామీణ ప్రాంతం నుండి ఆ పార్టీ పునాదులను పటిష్టం చేసుకున్న తీరే కారణం. అందుకే ఆపార్టీని ఆదర్శంగా తీసుకోవాలని బిఆర్‌ఎస్‌ అధినాయత్వం ఆలోచిస్తున్నట్లు తెలుస్తున్నది.

డిఎంకెను ఆదర్శంగా తీసుకోనుందా ..!
ఓటమి తర్వాత అధినాయకుల లోపాలను ఎత్తిచేసుతున్న ద్వితీయ శ్రేణి నాయకులు
24 ఏళ్ల తర్వాత మళ్లీ పునర్‌ ‌నిర్మాణంపై ఆ
లో చించాల్సిన పరిస్థితి

(మండువ రవీందర్‌ ‌రావు, ప్రజాతం ప్రత్యేక ప్రతినిధి)
హైదరాబాద్‌, ఆగస్ట్ 19 : ‌ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత దాదాపు తొమ్మిదిన్నర ఏండ్లపాటు పాలన సాగించిన భారత రాష్ట్ర సమితి(బిఆర్‌ఎస్‌) అనేక విషయాల్లో దేశంలోని ఇతర రాష్ట్రాలు తెలంగాణను ఆదర్శంగా తీసుకుంటున్నాయని చెప్పుకుంటూ వొచ్చింది. కాని, ఇప్పుడు స్వీయ పార్టీ సంస్థాగత నిర్మాణంలో పక్క రాష్ట్రమైన చెన్నైలోని డిఎంకె పార్టీని ఆదర్శంగా తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. 2023 శాసనసభ ఎన్నికలు మొదలు ఆ పార్టీకి ఎదురు దెబ్బలు తాకుతూనే ఉన్నాయి. రాష్ట్రంలో ఏర్పడ్డ రాజకీయ పరిణామాలు ఇప్పుడు ఆ పార్టీకి ఏమాత్రం అనుకూలంగా లేవు. పైగా పార్టీ మనుగడనే ప్రశ్నార్థకంగా మారింది. దేశంలోని రెండు జాతీయ పార్టీలైన కాంగ్రెస్‌, ‌బిజెపిలు బిఆర్‌ఎస్‌ ఎదుటి పార్టీలో కలిసిపోతుందంటూ బంతాట అడుకుంటున్నాయి.

దాన్ని కొట్టిపారేస్తున్న బిఆర్‌ఎస్‌ ‌త్వరలో రానున్న స్థానికసంస్థల ఎన్నికలు సిద్ధమవుతున్నది. ఈ పరిస్థితిలో పార్టీని బలోపేతం చేసుకోడం పైన ఆ పార్టీ దృష్టిపెట్టింది. మొదటి నుండీ గ్రామీణ స్థాయి నుండి ఆ పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని పటిష్టంగా చేసుకోలేకపోయిందన్న నింద ఉంది. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన పార్టీగా బిఆర్‌ఎస్‌కు నేటికీ ప్రత్యేక గుర్తింపు ఉంది. అయితే రాష్ట్ర సాధనలో ఆపార్టీ కార్యక్రమాలకన్నా స్థానిక ప్రజల భాగస్వామ్యమే ఎక్కువన్న విషయం తెలియంది కాదు. రాష్ట్రం ఏర్పాడ్డాక జరిగిన మొదటి ఎన్నిక నాటికి గ్రామీణ స్థాయిలో ఆపార్టీ కమిటీలు లేకపోయినా ప్రజలు దాన్ని అధికారంలోకి తీసుకువచ్చారు. కాని సంస్థాగత నిర్మాణం లేని లోటు ఆనాడు ఖమ్మం లాంటి ప్రాంతాల్లో కనిపించింది.

 

ఆ తర్వాత 2018లో(ముందస్తు) జరిగిన ఎన్నికల్లో కూడా బిఆర్‌ఎస్‌ అధికారంలోకి వొచ్చింది. అయితే తర్వాత క్రమంలో ప్రజల ఆశయాలకు భిన్నమైన పాలన తెలంగాణలో సాగుతున్నదన్న ప్రచారం విస్తృతమైంది. ఫలితంగా 2023 జరిగిన ఎన్నికల్లో బిఆర్‌ఎస్‌ ‌హ్యాట్రిక్‌ ‌సాధించలేకపోయింది. దానికి అనేక కారణాలు వెలుగులోకి వొచ్చాయి. పార్టీ అధినేత, నాటి రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్‌ ‌సామాన్య ప్రజలకే కాకుండా, మంత్రులకు కూడా అందుబాటులో ఉండటం లేదన్న ప్రచారం జరిగింది. ఆ పార్టీలో మేటి నాయకులనుకునే వారు కూడా ముఖ్యనేత అపాయింట్‌ ‌మెంట్‌కోసం సంవత్సర కాలం ఎదురుచూసి, విసిగిపోయినట్లు పార్టీ మారుతున్న క్రమంలో చెప్పడమన్నది ప్రజల్లోకి చేరిపోయింది. దానికితోడు ఎన్నికల నాటికి పలువురు ఎంఎల్‌ఏలు, మంత్రులపైన అవినీతి, భూ సంబంధ అరోపణలొచ్చాయి. అయినా ఒకరిద్దరికి తప్ప సిట్టింగ్‌లకే పార్టీ టికట్‌ ఇవ్వడాన్ని స్థానిక కార్యకర్తలు, ప్రజలు జీర్ణించుకోలేకపోయారు. తమకు ఈ నాయకుడు వద్దు అంటూ స్థానికులు ధర్నాలు చేసినా అధినాయకత్వం పెద్దగా పట్టించుకోలేదన్న అపవాదు ఉంది.

 

దాని ఫలితమే 2023లో అధికారానికి దూరమవడానికి కారణమైంది. ఆలస్యంగానైనా తమ ఓటమిపైన పెట్టుకున్న సమీక్షా సమావేశాల్లో అంతవరకు ఏనాడు నోరుమెదపని ద్వితీయ శ్రేణి నాయకులు అధినాయకత్వం తప్పిదాలను ఎత్తిచూపారు. క్రింది స్థాయి నాయకుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకపోవడం, వారి సమస్యలను పట్టించుకోలేదన్న నిందారోపణ చేశారు. ఈ పరిణామాలే ముఖ్యనేతలు పలువురు పార్టీ వదిలివెళ్ళడానికి కారణంగా మారింది. పార్టీ మారిన వారంతా ఇవే విషయాలను మీడియా ముఖంగా చెప్పడం గమనార్హం. పార్లమెంటు ఎన్నికల్లో సున్నా స్థానాలు రావడానికి కూడా పార్టీ నిర్మాణంలో లోపమే కారణంగా చెబుతున్నారు. ఇవ్వాల్టికీ కాంగ్రెస్‌ ‌పార్టీ చేస్తున్న విమర్శలు, ఆరోపణలను తిప్పికొట్టే విషయంలో కెటిఆర్‌, ‌హరీష్‌ ‌రావుతో పాటు ఒకరిద్దరు నాయకులు తప్ప సమర్థవంతంగా ఇతర నాయకులను పార్టీ  తీర్చిదిద్దలేకపోయిందన్న అపవాదు ఉంది. దీనికితోడు ఎన్నికలకు ముందు కాళేశ్వరం ప్రాజెక్టు కుంగుబాటు, ఇతర ప్రాజెక్టుల పరిస్థితి, వాటిలో అవినీతి జరిగిందంటూ కాంగ్రెస్‌, ‌బిజెపితో పాటు వైఎస్‌ఆర్‌టిపి లాంటి మరికొన్ని ఇతర చిన్నపార్టీలు కూడా ఎలుగెత్తి చాటాయి.

 

అలాగే విద్యుత్‌ ‌కొనుగోలు, ఫోన్‌ ‌ట్యాపింగ్‌ అం‌శం, సామాన్యుల కల అయిన డబుల్‌ ‌బెడ్‌ ‌రూమ్‌ల విషయం, ముఖ్యంగా కవిత దిల్లీ లిక్కర్‌ ‌స్క్యామ్‌ ‌వ్యవహారాలు పార్టీ కొంపముంచాయి. ఆ ఎన్నికల్లో కూడా ప్రజలు తమ వెంట ఉంటారని, ఈసారి హ్యాట్రిక్‌ ‌తప్పనిసరి అనుకున్న బిఆర్‌ఎస్‌కు ఆ ఎన్నికలు గట్టిదెబ్బ కొట్టాయి. రెండు ప్రధాన ఎన్నికల్లో ప్రతిష్ట కోల్పోవడంతో పార్టీకి వెన్నుదన్నుగా నిలువాల్సిన నాయకులంతా పలాయనం చిత్తగించారు. ఒకరు ఇద్దరు అంటూ ఇప్పటి వరకు పది మంది ఎంఎల్‌ఏలు, ఆరుగురు ఎంఎల్‌సీలు పార్టీ వీడిన వారిలో ఉన్నారు. వీరిలో చాలా మంది పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మంత్రి పదవులు, ఇతర ఉన్నత పదవులను అనుభవించిన వారు కావడం విశేషం. ఉద్యమంతో అనుబంధమున్నవారే ఇంకా పార్టీలో కొనసాగుతున్నారు. ఇంతకాలం కేవలం బిఆర్‌ఎస్‌కే ఉద్యమ పార్టీగా పేరుండేది, కాని ఇప్పుడు అన్ని పార్టీల్లోకి ఉద్యమకారులు వెళ్ళడంతో ఏపార్టీని పక్కకు పెట్టే పరిస్థితి లేదు. మొదటి నుండీ ఉద్యమ పార్టీగా బిఆర్‌ఎస్‌కు ప్రత్యేక గుర్తుంపు ఉంది. గడచిన 24 ఏళ్ళుగా ఆ పార్టీ ప్రస్థానం కొనసాగుతూ వొస్తున్నది.

 

కాని, ఇప్పుడు ఆపార్టీ ఉనికి ప్రశ్నార్థకంగా మారింది. దీంతో పార్టీని బలోపేతం చేసే ఆలోచనలో అధినాయకత్వం పడింది. పక్కనున్న తమిళనాడులోని ద్రవిడ మున్నెట్ర ఖజగం(డిఎంకె) అక్కడి రాజకీయాల్లో ఎంతటి తుఫాన్‌ ‌వొచ్చినా తట్టుకుని నిలబడుతూ వొస్తున్నదంటే గ్రామీణ ప్రాంతం నుండి ఆ పార్టీ పునాదులను పటిష్టం చేసుకున్న తీరే కారణం. అందుకే ఆపార్టీని ఆదర్శంగా తీసుకోవాలని బిఆర్‌ఎస్‌ అధినాయత్వం ఆలోచిస్తున్నట్లు తెలుస్తున్నది. డిఎంకె పార్టీ నిర్మాణ విధానం, చేపడుతున్న కార్యక్రమాలపై సమగ్ర అద్యయనం చేసేందుకు బిఆర్‌ఎస్‌ ఒక ప్రత్యేక టీమ్‌ను వొచ్చేనెలలో తమిళనాడుకు పంపనున్నట్లు తెలుస్తున్నది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాడ్డాక రాష్ట్రాన్ని పునర్‌ ‌నిర్మిస్తామని ఆనాడు ప్రకటించిన బిఆర్‌ఎస్‌, ఆమేరకు ఎంతవరకు విజయవంతం అయిందోగాని, 24 ఏళ్ళ తర్వాత ఇప్పుడు బిఆర్‌ఎస్‌ను పునర్‌ ‌నిర్మించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page