అన్ని రంగాల్లో ఆదర్శం…

  • ప్రతిపక్షాలకు కనబడదు…వినబడదు
  • ప్రతి ఒక్కరి అభివృద్ధే లక్ష్యంగా పథకాలు
  • ఒక్క మంచి పని కూడా కనబడడడం లేదా
  • బడ్జెట్‌లో సింహభాగం పేదలు, బడుగులకే
  • యథావిధిగా డబుల్‌ ఇళ్ల పథకం…
  • ఉస్మానియాను నిర్మించి తీరుతాం
  • యునానీ హాస్పిటల్‌ని అభివృద్ధి చేస్తాం
  • ఎలాంటి కొత్త పన్నులు వేయం
  • రాజకీయాలు మాకో టాస్క్…‌లక్ష్యం కోసం పట్టుదలతో పనిచేస్తాం
  • అసెంబ్లీలో బడ్జెట్‌పై చర్చ సందర్భంగా ఆర్థిక మంత్రి హరీష్‌ ‌రావు సమాధానం

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 8 : రాష్ట్రంలో అభివృద్ధి కళ్లకు కనపడేలా..దేశం అచ్చెరువొందేలా ఉందని ఆర్థిక మంత్రి హరీష్‌ ‌రావు అన్నారు. అలాగే దేశానికి ఆదర్శంగా పథకాలు సాగుతున్నాయని అన్నారు. సీఎం కేసీఆర్‌ ‌మార్గదర్శకత్వంలో ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో సకల జనుల సంక్షేమం, సవి•కృత సమ్మిళిత సమగ్ర సుస్థిర అభివృద్ధి ఉందని మంత్రి హరీష్‌ ‌రావు అన్నారు. అయితే రాష్ట్రంలో జరిగే అభివృద్ధి, సంక్షేమం ప్రతిపక్ష పార్టీలకు కనబడడం లేదని, వినబడడం లేదని మండిపడ్డారు. బుధవారం అసెంబ్లీలో బడ్జెట్‌పై శాసనసభలో చర్చ సందర్భంగా.. సుదీర్ఘంగా సమాధానం ఇస్తూ..ప్రతిపక్ష సభ్యుల తీరుపైనా, కేంద్రం తీరుపైనా మండిపడ్డారు. తెలంగాణ అభివృద్ధిని ఓర్వలేని విధంగా బిజెపి ప్రవర్తిస్తుందని అన్నారు. కంటివెలుగు, రైతుబంధు, రైతుబీమా అమలు వంటి ఎన్నో మంచి పనులు చేస్తున్నా ప్రతిపక్షాలు ప్రభుత్వం మంచిపని చేసిందని ఒక్క మాటచెప్పలేదు. వారి మాటలు ఎలా ఉన్నాయంటే.. నిండుపున్నమిలో చందమామ వెలుగులు చూడాల్సింది పోయి.. ఆ చందమామ వి•ద ఉన్న మచ్చలు వెతికే ప్రయత్నం చేసినట్టుందని అన్నారు. వెనుకటికి ఏం వంక అంటే.. ఏలువంక అన్న చందంగా బీజేపీ, కాంగ్రెస్‌ ‌తీరుంది.

బడ్జెట్‌లో సింహభాగం నిధులు పేదలు, బడు బలహీన వర్గాల కోసం నిధులు కేటాయించామని, ప్రతిపక్షాల మాటలు బడుగు, బలహీన వర్గాలు, గిరిజనులు, అగ్రవర్ణాల పేదలకు ఏమి చేయొద్దని కాంగ్రెస్‌, ‌బీజేపీ సభ్యుల మాటల్లో తెలుస్తుందని అన్నారు. సకలజనుల సౌభాగ్యం, సవి•కృత సమ్మిళిత సమగ్ర సుస్థిర అభివృద్ధి ఉంది. ఇవి ప్రతిపక్షాలకు కనపడకపోతే మేం ఏం చేయాలని ఘాటుగానే ప్రశ్నించారు. గతంలో రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్నాయంటే ట్యాంక్‌ ‌బండ్‌ ‌దగ్గర అంబేద్కర్‌ ‌విగ్రహం నుంచే.. తెలంగాణ అమరవీరుల స్థూపం నుంచో ఖాళీ బిందెల ప్రదర్శనలతో అసెంబ్లీకి వొచ్చేవాళ్లం. అసెంబ్లీలో మొదటిరోజు రాష్ట్రంలో తాగునీటి ఎద్దడి వి•ద విపక్షాలన్నీ వాయిదా తీర్మానం ఇచ్చేవి. మొదటి వాయిదా తీర్మానం కరెంటు కోతలు, తాగునీటి బాధలపై ఉండేవి. బడ్జెట్‌ ‌సమావేశాల్లో మంచినీటి కొరత గురించి మాట్లాడకుండా సభ జరిగిన సమావేశమే లేదు.

మిషన్‌ ‌భగీరథ వొచ్చిన తర్వాత రాష్ట్రంలో ఏ రోజైనా భట్టీ విక్రమార్క గానీ, ఇతర విపక్ష సభ్యులు రాష్ట్రంలో తాగునీటి ఎద్దడి తీర్మానాలు ఇచ్చారా? వాగ్యుద్ధాలు ఉన్నాయా? ఖాళీ కుండల ప్రదర్శన ఉందా? ఇవన్నీ లేవంటే ప్రతిపక్షాలు కూడా రాష్ట్రంలో మంచినీటి సమస్య లేదని ఒప్పుకున్నట్టే కదా? ఇంత మంచి పని జరిగితే ఒక్కనాడైన మంచి అని చెబుతున్నారా? అంటూ ధ్వజమెత్తారు. ఆ రోజుల్లో బిందెడు నీళ్ల కోసం మైళ్లదూరం నడిపోయిన యాతన ఉండేది. అక్కాచెల్ళెళ్లు బోరింగ్‌లు కొట్టీకొట్టి భుజాలు నొప్పి పెట్టిన రోజులుండేవి. నారాయణఖేడ్‌లో ’హదునూరకు ఎద్దునివ్వదు..బోరంచకు పిల్లనివ్వద్దు’ సామెత ఉండేది. హద్దునూరకు ఎద్దునిస్తే నీళ్ల దొరక్క ఆగమైతదని..ఎద్దనీవ్వద్దని అందురు. బోరంచలో నీళ్లు కావాలంటే నాలుగు కిలోవి•టర్ల దూరంలో పోయి బిందెల్లో మోసుకువచ్చే పరిస్థితి ఉండేది. గతంలో నులకమంచంలో పసిపిల్లలను నిలబెట్టి స్నానం చేయించి.. మంచం కింద తాంబాలం పెట్టి తిరిగి వాడుకునే దుస్థితి నాడు కాంగ్రెస్‌, ‌తెలుగుదేశం పార్టీ పాలనలో ఉండేది. ఇవాళ వీళ్లంతా మాకు సుద్దులు, బుద్ధులు చెబుతున్నరు’ అంటూ హరీశ్‌రావు విమర్శించారు.

యథావిధిగా డబుల్‌ ఇళ్ల పథకం…ఉస్మానియాను నిర్మించి తీరుతాం
రాష్ట్రంలో డబుల్‌ ‌బెడ్రూమ్‌ ఇం‌డ్ల పథకం యథావిధిగా కొనసాగుతుందని ఆర్థిక మంత్రి హరీష్‌ ‌రావు శాసనసభలో స్పష్టం చేశారు. బడ్జెట్‌పై సమాధానం ఇచ్చన  సందర్భంగా విపక్ష సభ్యులు అక్బరుద్దీన్‌ ఓవైసీ, భట్టి విక్రమార్క, రఘునందన్‌ ‌రావు అడిగిన ప్రశ్నలకు మంత్రి హరీశ్‌రావు సమాధానం ఇచ్చారు. ఉద్యోగులకు, పెన్షనర్లకు ఇవ్వాల్సిన మూడు డీఏల్లో మొన్న ఒక డీఏ ఇచ్చామని తెలిపారు. మరో రెండు డీఏలపై కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందన్నారు.

న్యూ ఉస్మానియా బిల్డింగ్‌ ‌నిర్మించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. యునాని హాస్పిటల్‌ను కూడా అభివృద్ధి చేస్తాం అని ప్రకటించారు. పన్నులు వేసే ఆలోచన ప్రభుత్వానికి లేదు. ఎలాంటి కొత్త పన్నులు వేయం. సొంత ఆదాయ వనరులపై దృష్టి సారించాం అని తెలిపారు. కాంగ్రెస్‌ ‌ప్రభుత్వ హయాంలో కరెంట్‌ ‌సమస్యలు లేకపోతే.. పవర్‌ ‌హాలిడేలు, క్రాప్‌ ‌హాలిడేలు ఎందుకు ప్రకటించారు. ఇందిరా పార్క్ ‌వద్ద పారిశ్రామికవేత్తలు ఎందుకు ధర్నాలు చేయాల్సి వొచ్చిందని హరీష్‌ ‌రావు భట్టిని అడిగారు.

రాజకీయాలు మాకో టాస్క్…‌లక్ష్యం కోసం పట్టుదలతో పనిచేస్తాం
దేశంలోని కొన్ని రాజకీయ పార్టీలకు రాజకీయాలంటే ఒక గేమ్‌. ‌కానీ, సీఎం కేసీఆర్‌కు, బీఆర్‌ఎస్‌ ‌పార్టీకి పాలిటిక్స్ ఒక టాస్క్. ఏ ‌లక్ష్యాన్ని అయినా పట్టుదలతో దాన్ని పూర్తి చేసేలా ప్రజల కోణంలో, మానవీయ కోణంలో పని చేసే ప్రభుత్వం బీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం అని మంత్రి హరీష్‌ ‌రావు అన్నారు. అసెంబ్లీలో బడ్జెట్‌ ‌సమాధానంలో మాట్లాడుతూ…మిషన్‌ ‌భగీరథలో 1.50లక్షల కిలోవి•టర్ల పైప్‌లైన్‌, 37‌వేల వాటర్‌ ‌ట్యాంక్‌లు, 1804 సర్వీస్‌ ‌రిజర్వాయర్‌లు, 123 వాటర్‌ ‌ట్రీట్‌మెంట్‌ ‌పాంట్లు, 77 ఇంటెక్‌ ‌వెల్స్ ‌వీటన్నింటిని మూడునాలుగేళ్లలో పూర్తి చేయడం ఓ భగీరథ యత్నం. సీఎం కేసీఆర్‌ ఒక టాస్క్‌గా తీసుకోవడంతోనే ఇది సాధ్యమైంది. ఇది మాకు మిగతా పార్టీలకు ఉన్న తేడా అదేనని అన్నారు. రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ ‌పరిపాలన, దేశంలో మోదీ నాయకత్వంలో బీజేపీ పరిపాలన ఒకేసారి ప్రారంభమయ్యాయి. అధికారంలోకి ఆరేడేళ్లలోనే 2020 నాటికి మిషన్‌ ‌భగీరథను పూర్తి చేశాం. కేంద్ర జల్‌జీవన్‌ ‌మిషన్‌ 2022‌లో మిషన్‌ ‌భగీరథలో ఇంటింటికి మంచినీరు ఇచ్చినందుకు రాష్ట్రానికి అవార్డు ఇచ్చింది. మన పథకాన్ని ’హర్‌ఘర్‌కో జల్‌’ ‌పేరుతో కాపీ కొట్టారు కానీ.. స్పీడ్‌గా పనులు చేయడం లేదు.

కేసీఆర్‌ ‌తెచ్చిన పథకాన్ని తీసుకువస్తే కేంద్రం దీన్ని దేశమంతా అమలు చేయడం రాష్ట్రానికి గర్వకారణం. దేశ ప్రజలకు సురక్షితమైన తాగునీరు ఇవాళ 49శాతం మందికి మాత్రమే అందుతుంది. స్వాతంత్య్రం వొచ్చిన సందర్భంగా 75 సంవత్సరాలు అమృత్‌కాలమని గొప్ప చెప్పుకుంటున్నారు. ఇంకా 51శాతం మంది ప్రజలు కనీస సౌకర్యమైన తాగునీటికి దూరంగా ఉన్నారు. తెలంగాణ సక్సెన్‌ను కలుపుకొని కేవలం 49శాతం మందికి మాత్రమే స్వచ్ఛమైన తాగునీరు అందిస్తుందన్నారు హరీష్‌ ‌రావు. మిషన్‌ ‌భగీరథ ప్రాజెక్టుకు రూ.44,933.66 కోట్లఅంచనా వ్యయంతో ప్రభుత్వం పరిపాలనా అనుమతులను మంజూరు చేసింది. కానీ, ప్రాజెక్టు పూర్తయ్యే వరకు చేసిన వాస్తవమైన వ్యయం రూ.36,900 కోట్లు మాత్రమే. సీఎం కేసీఆర్‌ ‌మార్గనిర్దేశనరలో ఖచ్చితమైన ప్రణాళికతో పారదర్శకంగా ఆధునిక పద్ధతులను వినియోగించి నిర్ణీత సమయంలో పథకాన్ని పూర్తి చేయడం వల్ల రూ.8,033.66 కోట్ల ప్రజాధనాన్ని ప్రభుత్వం ఆదా చేయగలిగింది’ అని హరీశ్‌రావు వివరించారు. తెలంగాణలో మాత్రం 100శాతం డ్రింకింగ్‌ ‌వాటర్‌ ‌సప్లై అవుతుందని చెప్పారు. రాష్ట్రంలో వేసవి కాలంలోనూ చెరువులు నీటితో కళకళలాడుతున్నాయని మంత్రి హరీష్‌ ‌రావు అన్నారు. 2014 ముందు ఎండిన చెరువులు ఇప్పుడు జలకళ సంతరించుకోవడాన్ని ప్రస్తావించారు. సమైక్య రాష్ట్రంలో చెరువులు శిథిలమయ్యాయని.. అందుకే మిషన్‌ ‌కాకతీయతో చెరువులను పునరుద్దరించామన్నారు.

మిషన్‌ ‌కాకతీయ వల్ల భూగర్భజలాలు ఉబికి వొస్తున్నాయని అన్నారు. ప్రపంచంలో ఎక్కడా కట్టని విధంగా కేవలం మూడున్నరేండ్లలో కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేశామని మంత్రి హరీష్‌ ‌రావు తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టును చూసేందుకు దేశ,  విదేశాల నుంచి వొస్తున్నారని చెప్పారు.  కాళేశ్వరం ప్రాజెక్టును అడ్డుకునేందుకు వందల సంఖ్యలో కేసులు వేశారని..అయినా..చిత్త శుద్ధితో కాళేశ్వరాన్ని నిర్మించినట్ల్లు వెల్లడించారు. పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు పనులు 63 శాతం పూర్తయ్యాయన్నారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులు పూర్తిచేస్తామన్నారు. నిర్ణీత కాలంలో ప్రాజెక్టులు పూర్తి చేయడం వల్ల అనేక కోట్లు ఆదా చేశామని అన్నారు. ఇక బుధవారం శాసన సభలో ఆవరణలో కంటి వెలుగు కార్యక్రమాన్ని స్పీకర్‌ ‌పోచారం, కౌన్సిల్‌ ‌చైర్మన్‌ ‌గుత్తాలతో కలిసి మంత్రి హరీష్‌ ‌రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా కంటివెలుగు సిబ్బందితో మంత్రి సెల్ఫీ దిగారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page