అభిమానంతో అభిమాని

వంద మైళ్ళ వేగంతో లోతైన ఇష్టంతో

సంవత్సరాలుగా వెనుకేసిన
చెద పట్టని మోపుల కొద్ది  మాటల్ని,

రోజూ  పంచుకున్న
తుప్పు పట్టని గంపల కొద్ది ఊహల్ని,

పరోక్షంగా వ్రాసుకున్న కవితలతో
ప్రత్యక్షంగా పంచుకున్న సమయంలో

ఓ ఇష్ట కవిత్వం
మనసారా చేతికి అంది

ఆమెపై మనసు కట్టుబడికి
అందిన గొప్ప లాభం ..

గౌరవం…మర్యాద…అభిమానం
ప్రతి రూపంలో
అభిమానంతో అభిమానిలా
ఆమె శాశ్వతం .

– చందలూరి నారాయణరావు
   9704437247

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page