అమీన్ పూర్ కాంగ్రెస్ లో భారీ కుదుపు

బిఆర్ఎస్ లో చేరిన కాటా ప్రధాన అనుచరుడు పట్లోళ్ల భాస్కర్ రెడ్డి
బిఆర్ ఎస్ పార్టీలోకి ఆత్మీయ స్వాగతం పలికిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి
అమీన్ పూర్ లో కాంగ్రెస్ పార్టీ ఇక ఖాళీ
రాబోయే రోజుల్లో మరిన్ని చేరికలు
అభివృద్ధి మా తారక మంత్రం
పటాన్ చెరు,ప్రజాతంత్ర, అక్టోబర్ 30: తెలంగాణ వ్యతిరేకి కాంగ్రెస్ పార్టీని ప్రజలు చీదరించుకుంటున్నారని, రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో ఉనికి కోసం పోరాటం చేయాల్సిన పరిస్థితులు కాంగ్రెస్ పార్టీకి ఏర్పడ్డాయని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి విమర్శించారు. అమీన్ పూర్ మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన సమావేశంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మున్సిపల్ అధ్యక్షులు పట్లోళ్ళ భాస్కర్ రెడ్డి తన అనుచరులతో కలిసి ఎమ్మెల్యే జిఎంఆర్ సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ.. 60 ఏళ్ల పాటు తెలంగాణను పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ ప్రజల సంక్షేమం, అభివృద్ధికి చేసింది ఏమీ లేదని విమర్శించారు. 2009 ఎన్నికల్లో మేనిఫెస్టోను ప్రకటించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలోని ఒక్క హామీని అమలు చేయలేదని అన్నారు. నేడు ఆరు గ్యారెంటీ ల పేరుతో ప్రజలను మరోసారి మోసం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ ముందుకు వస్తోందని అన్నారు. తెలంగాణ ప్రజలు విజ్ఞులని, కాంగ్రెస్ పార్టీ బిజెపి పార్టీలను తరిమికొట్టడం ఖాయమని అన్నారు.రాబోయే రోజుల్లో కాంగ్రెస్, బిజెపి పార్టీల నుండి భారీ సంఖ్యలో చేరికలు ఉండబోతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగా రెడ్డి, బిఆర్ఎస్ పార్టీ మున్సిపల్ అధ్యక్షులు బాల్ రెడ్డి, సీనియర్ నాయకులు ఆదర్శ్ రెడ్డి, ఆయా వార్డుల కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page