నెల తప్పింది మొదలు

అంబరమంత

ప్రేమ పంచుతూ,

అష్టకష్టాల పిదప

అమ్మతనం సొంతం కాగా

అవధుల్లేని ఆనందం

పొందుతుంది మాతృమూర్తి.

బిడ్డలకైజి

అహర్నిశలు ఆరాటపడే

అనురాగవల్లి ,

వారి హృదయాలలో వెలిగే

ఆనందజ్యోతి ఆమె.

 

అనురాగాల పందిరికి

లతలా అల్లుకుపోతూ,

క్షణం తీరికలేని

బతుకు గడియారంలో

అందరినీ చదువుతూ,

ఓర్పు,సహనాలతో

బతుకు అర్ధాన్ని లిఖిస్తూ,

అంకితభావమే ఆభరణమై

ఏ భరణాన్నీ కోరక,

అనురాగం పల్లవించే గీతికై

విద్యుక్త ధర్మాన్నాచరించే

విద్యుల్లత తను.

 

జనని జత ఉండే బతుకు

సాగరాన పూలనావే,

లేని ఇల్లు శిథిలాలయం.

మనసా వాచా కర్మణా

ఆమెను

సంతోషంగా ఉంచుదాం

 

అమ్మ లేని మహి

శూన్యమని గుర్తెరుగుదాం

– వేమూరి శ్రీనివాస్‌

9912128967

‌తాడేపల్లిగూడెం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page