అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు

పటాన్ చెరు,ప్రజాతంత్ర, డిసెంబర్ 29: రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారెంటీల పథకాలను పకడ్బందీగా అమలు చేసి అర్హులైన ప్రతి ఒక్కరికి అందించాలని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సూచించారు. శుక్రవారం రామచంద్రాపురం డివిజన్ పరిధిలోని జిహెచ్ఎంసి కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రజాపాలన కార్యక్రమాన్ని ప్రారంభించి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వృద్ధులు, నిరక్షరాస్యులకు అవగాహన కల్పించి దరఖాస్తులు నింపడంలో సహాయం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ పుష్ప నగేష్, మాజీ కార్పొరేటర్ అంజయ్య, సీనియర్ నాయకులు ఆదర్శ్ రెడ్డి, జిహెచ్ఎంసి డిప్యూటీ కమిషనర్ సురేష్, సీనియర్ నాయకులు పరమేష్ యాదవ్, గోవింద్, కుమార్ గౌడ్, ఐలేష్ యాదవ్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page