కుల్కచర్ల, ప్రజాతంత్ర సెప్టెంబర్13 : అర్హులైన ప్రతి ఒక్కరికి దళిత బంధు, బీసీ బందు అందజేయాలి లెదంటే కొప్పుల మహెష్ రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని పిఎన్ పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు రాఘవేందర్ గౌడ్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు.బుదవారం నాడు మండల కేంద్రంలోని ప్రధాన చౌరస్తాలో పిఎన్ పిఎస్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమానికి మద్దతుగా టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి కాసాని వీరేష్, బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఘనపూర్ వెంకటయ్య గౌడ్, బీజేపీ మండల అధ్యక్షులు గాదె మహిపాల్, కాంగ్రెస్ మండల ఆంజనేయులు, బ్లాక్ బి అధ్యక్షుడు కర్రె భారత్ కుమార్,దళిత ప్రజ సంఘాలతో కలిసి ధర్నా చేపట్టారు.ఈ సందర్భంగా వారు మాట్లాడారు..గతంలో పరిగి నియోజకవర్గంలో పార్టీలకు అతీతంగా అన్ని పార్టీలు ప్రజలుకు సంక్షేమ పథకాలు అందజేశాయి కాని బిఅర్ఎస్ ప్రభుత్వం మాత్రం బిఆర్ఎస్ నాయకులకు మాత్రమే పథకాలు అందజేస్తున్నారని మండిపడ్డారు.బీసీ బందు,దళిత బంధులో కమిషన్లు తీసుకుంటూ ఎమ్మెల్యే తనకు నచ్చిన వారికి పథకాలను ఇస్తూఅవినీతికిపాల్పడుతున్నాడు. .అర్హులైన ప్రతి ఒక్కరికి దళిత బంధు, బీసీ బందు అందజేయాలి లేనిపక్షంలో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.అనంతరం ఆందోళన చేస్తున్న నాయకులని అరెస్టు చేశారు. అనంతరం బాధితులతో కలిసి ఎంపీడీవోకు వినతి పత్రం అందజేశారు.ఈ కార్యక్రమంలో బీజేవైఎం అధ్యక్షులు గడుసుమహిపాల్ ,మహేష్ ,వెంకటేష్ ,పరిగి పరిరక్షణ సమితి సభ్యులు హరికృష్ణ ,బాలకృష్ణ ,ఎంపీటీసీ ఆనందం, యూత్ కాంగ్రెస్ నాయకులు నాగవర్ధన్ ,దగ్గుల సురేష్ ,సంగం శ్రీనివాస్, భాస్కర్ నాగని ఆంజనేయులు ,బాలకృష్ణ, కొండ ఆంజనేయులు, రాజు, ముకుంద, భాను ,పెంటయ్య, దళిత, బీసీ బందుల బాధితులు, ఎంఆర్పిఎస్ నాయకులు, దళిత సంఘాలు ప్రజాసంఘాలు, వివిధ పార్టీల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.