‘ఆ చూపు మహోజ్వలితం
ఆ రూపు దివ్య ప్రకాశితం
ఆ గళం సింహా గర్జనం
ఆ పిడికిలి విప్లవ సంకేతం
ఆ ఆవేశం ఉత్తుంగ తరంగం
ఆ అడుగు అభ్యుదయ పథం
ఆ సాహసం అద్వితీయం
ఆ సంకల్పం అజరామరం
అతడే అగ్గి పిడుగు
అల్లూరి సీతారామరాజు
దేశమాత స్వేచ్ఛ కోసం
సాయుధ పోరు నడిపినవాడు
ఆదివాసీ హక్కుల సాధనకై
విల్లంబులు ఎక్కుపెట్టినవాడు
చీకటి సామ్రాజ్యం కూల్చ
రణ శంఖం పూరించినవాడు
బ్రిటీష్ సైనిక బలగాలను
హద్దులు దాట తరిమినవాడు
భూస్వాముల గుండెల్లో
సింహాస్వప్నమై నిద్రించినవాదు
మరపిరంగులకు..
ఎదురు నిలిచిన శౌర్యమతడు
తుపాకీ తూటాలకు ..
గుండెలడ్డుపెట్టిన ధీరమతడు
స్వేచ్ఛా నినాదమతడు
వందేమాతర గీతమతడు
భారత త్రివర్ణ పతాకమతడు
అమరుడు అల్లూరికి
అరుణరుణ జోహారులు
అభ్యుదయ సలాములు
( జులై 4 న అల్లూరి సీతారామరాజు జయంతి సందర్బంగా..)
– కోడిగూటి తిరుపతి, 9573929493