కూకట్ పల్లి, ప్రజాతంత్ర, నవంబర్ 17 : యువతపైనే దేశ భవిష్యత్ ఆధారపడి ఉందని, తెలంగాణ రాష్ట్రంలో అవినీతి పాలనను అంతమొందించేందుకు ఓటు అనే ఆయుధంతో చికిత్స చేసి, అవినీతి రహిత పాలనను తీసుకొచ్చేందుకు యువశక్తితోనే సాధ్యమని ముమ్మారెడ్డి ప్రేమ కుమార్ పేర్కొన్నారు. శుక్రవారం కూకట్పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్ పర్వత్ నగర్ లో వేంచేసి ఉన్న శ్రీ సిద్ధి వినాయక, శ్రీ దుర్గా మల్లేశ్వరి దేవాలయాన్ని బిజెపి బలపరిచిన జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థి ముమ్మారెడ్డి ప్రేమ కుమార్ సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించి, భారీ జన సందోహం మధ్య పాదయాత్రను ప్రారంభించి, మసీద్ గల్లి, గవర్నమెంట్ హాస్పిటల్, గాంధీ విగ్రహం, గాయత్రీ నగర్, లక్ష్మీ నగర్, తులసి నగర్, వివేకానంద నగర్ వరకు పాదయాత్ర కొనసాగించారు. ఆనంతరం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ అల్లాపూర్ డివిజన్లో చుట్టూ ఉన్న చెరువులన్నీ కబ్జా జరిగాయన్నారు. ఈ సారి కబ్జాదారుల ప్రభుత్వాన్ని తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు.ప్రస్తుతం ఉన్న రాజకీయాలలో కొనసాగడం అంటే అంతా సులభమైన విషయం కాదని, ఎందుకంటే ప్రస్తుతం రాజకీయాలు ధన, కుల, మతాల మీద ఆధారపడి నడుస్తున్నాయన్నారు. ఇలాంటి సమయంలో యువత మేలుకోవాలని సూచించారు. యువత రాజకీయాలకు వచ్చినప్పుడే దేశం రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని అన్నారు. కేంద్రంలో నరేంద్ర మోడీ అలాగే ఉభయ తెలుగు రాష్ట్రాలలో పవన్ కళ్యాణ్, ఇరువురు గొప్ప దేశభక్తులని, నిజాయితీ గల నాయకులు. వారి సారథ్యంలో పనిచేయడం నా అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. ఈ కుకట్పల్లి నియోజకవర్గంలో యువతలో చైతన్యం కలిగి ఖచ్చితంగా బిజెపి బలపరిచిన జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా ఉన్న నాకు అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరుతూ, గాజు గ్లాసు మీద ఓటు వేసి మీ దేశ భక్తిని చాటుకుంటారని యువతను ఉద్దేశించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా (అర్బన్) అధ్యక్షులు శ్రీ పన్నాల హరీష్ రెడ్డి, డివిజన్ అధ్యక్షులు విజయ్, పులిగోల్ల శ్రీనివాస్, అల్లాపూర్ డివిజన్ కంటెస్టెడ్ కార్పొరేటర్ లక్ష్మి, డివిజన్ నాయకులు, రాజేష్, కొల్లా శంకర్, బిజెపి నాయకులు, జనసేన నాయకులు, వీరమహిళలు, కార్యకర్తలు,
తదితరులు పాల్గొన్నారు.