అవినీతి ఆర్టీవో అధికారులపై ప్రభుత్వం సిబిఐ ఎంక్వైరీ వేయాలి

ముషీరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 26 : అవినీతి ఆర్టీవో అధికారులపై ప్రభుత్వం సిబిఐ ఎంక్వైరీ వేయాలని జై ఇండియన్ లారీ ఓనర్స్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షులు ముస్తఫా అంబేద్కర్ డిమాండ్ చేశారు. శనివారం అసోసియేషన్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ పాల్వంచలో ఉన్న మోటార్ వెహికల్ ఇన్స్ పెక్టర్ చెక్ పోస్టులో ఉంటూ వచ్చే పోయే వాహనాలు చెక్ చేస్తూ విపరీతమైన లంచాలు వసూలు చేస్తూ వాహనదారులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. లంచం ఇవ్వాల్సిందే ఇవ్వకపోతే నీ వాహనానికి ఏదో ఒక కారణం చూపి కేసు రాస్తానంటూ చిత్రహింసలకు గురి చేస్తున్నారని ఆరోపించారు. ఇది నా ఏరియా నా ఇష్టం వచ్చినట్టు నేను చేసుకుంటా అని పాల్వంచ ఆర్టీవో చెక్పోస్ట్ మోటార్ వెహికల్ ఇన్స్ పెక్టర్ బహిరంగంగా బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. భద్రాచలం ఏరియా నుంచి విపరీతమైన ఇసుక ఓవర్ లోడ్ అక్రమంగా వస్తుంటే వాటి వద్ద కూడా నెల మామూలు వసూలు చేస్తూ మోటార్ వెహికల్ ఇన్స్ పెక్టర్ కోట్లు సంపాదిస్తున్నారని ఆరోపించారు. మాకు పై అధికారుల అండదండలు కూడా ఉన్నాయి మీకు ఇష్టం వచ్చింది చేస్కోండి అంటూ బెదిరింపులకు గురి చేశారని ఆరోపించారు. ఇష్టానుసారం చేస్తూ లంచాలు వసూలు చేస్తున్న ఎంవిఐను యూనియన్ తరపున ప్రశ్నించామని అన్నారు. ముస్తఫా అంబేద్కర్ మాట్లాడుతూ లంచం ఎందుకు ఇవ్వాలి మా వాహనాలలో ఇల్లీగల్ ఉంటే కేసులు రాసుకోవచ్చన్నారు. ఓవర్ లోడ్ ఉన్నా, ఓవర్ హైట్ ఉన్నా, డాక్యుమెంట్ సరిగ్గా లేకపోయినా, డ్రైవింగ్ లైసెన్స్ లేకపోయినా, డ్రైవరు మద్యం సేవించి వాహనం నడిపిన కేసులు రాసుకోవచ్చన్నారు. కానీ అన్ని సక్రమంగా ఉంటే లంచం ఎందుకు ఇవ్వాలని ప్రశ్నించగా… నీకు చేతనైంది చేసుకో నాకు అందరి అండదండలు ఉన్నాయని ఎంవిఐ అంత ధీమాగా చెబుతున్నాడని అన్నారు. దీనిపై డిస్ట్రిక్ట్ ట్రాన్స్ పోర్ట్ కమిషనర్ స్పందించడం లేదంటే ఇందులో ఆయనకు కూడా వాటా ఉందా అని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయన్నారు. పాల్వంచ అండర్ లో ఉన్న డిస్టిక్ ట్రాన్స్ పోర్ట్ కమిషనర్ వెంటనే దీనికి స్పందించి తమ యూనియన్ వారికి వివరణ ఇవ్వలన్నారు. లేనిపక్షంలో అధికారులందరిపై లీగల్ గా హైకోర్టులో అప్పీల్ చేయాల్సి వస్తుందని హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page