అసెంబ్లీ సమావేశాలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు

  • సమావేశాల్లో ఆర్టీసీ ఉద్యోగుల బిలును ఆమోదించే ఛాన్స్
  • ‌పలు కీలక బిల్లులకు అవకాశం

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 2 : అసెంబ్లీ ఎన్నికలకు ముందు నేడు ప్రారంభ కానున్నవే చివరి సమావేశాలు అయ్యే అవకాశం ఉండటంతో ప్రభుత్వం కీలక బిల్లులను ఆమోదించబోతుంది. ఆర్టీసీ ఉద్యోగుల్ని ప్రభుత్వ ఉద్యోగులగా గుర్తిస్తూ నిర్ణయం తీసుకోనున్నారు. దీనికి సంబంధించిన బిల్లును ఈ సమావేశాల్లోనే ఆమోదించనున్నారు. అలాగే వరద సాయం, కేంద్రం తీరు, సహాయక నిరాకరణ తదితర అంశాలు చర్చకు వొచ్చే అవకాశం ఉంది. అలాగే కేబినేట్‌ ‌తీసుకున్న అనేక నిర్ణయాలను చర్చించే అవకాశం ఉంది. ఇక కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర రావుపై రాష్ట్ర హైకోర్టు వేటు వేయడం, జలగం వెంకట్రావును ఎమ్మెల్యేగా పరిగణించాలంటూ తీర్పు వెలువరించడంతో గురువారం నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాలకు ఈ ఇద్దరు నేతల్లో ఎవరు హాజరవుతారనే చర్చ జరుగుతుంది. తన ఎన్నిక చెల్లదంటూ వెలువరించిన తీర్పుపై స్టే కోసం వనమా తిరిగి హైకోర్టును ఆశ్రయించగా..హైకోర్టు తోసిపుచ్చింది.

దీంతో కోర్టు తీర్పును అమలు చేయక తప్పని పరిస్థితి. మరోవైపు, కోర్టు తీర్పు ఆధారంగా తనను ఎమ్మెల్యేగా గుర్తించాలంటూ జలగం వెంకట్రావు అసెంబ్లీ కార్యదర్శిని కలిసి వినతిపత్రం అందచేశారు. కానీ ఎలాంటి నిర్ణయంమ తీసుకోలేదని సమాచారం. సమావేశాలకు హాజరవ్వాలంటే జలగం వెంకట్రావు ఎమ్మెల్యేగా ప్రమాణం చేయాల్సి ఉంటుంది. స్పీకర్‌ అలాంటి నిర్ణయం తీసుకోలేదు. ప్రమాణ స్వీకారం చేయించాలని స్పీకర్‌ ‌నిర్ణయం తీసుకుంటే ఎమ్మెల్యేగా ఆయన అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావొచ్చు. ఈ విషయంపై తన నిర్ణయాన్ని స్పీకర్‌ ‌పెండింగ్‌లో పెడితే మాత్రం ఈసారి అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యే అవకాశం ఇద్దరిలో ఎవరికీ ఉండదని భావిస్తున్నారు. ఇక అసెంబ్లీ సమావేశాలను సందర్భంగా అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. అసెంబ్లీ సమావేశాలు పారదర్శకంగా నిర్వహించి, ప్రజలకు అన్ని విషయాలను తెలియజేయాల్సిన అవసరముందని స్పీకర్‌ ‌పోచారం ప్రకటించారు.

గతంలో లాగానే ఈ సమావేశాలకు కూడా రాష్ట్ర ప్రభుత్వం, అధికారులు సహకారం అందించాలని స్పీకర్‌ ‌పోచారం కోరారు. సభ్యులు అడిగిన సమాచారాన్ని సాధ్యమైనంత త్వరగా అందించాలన్నారు. గత సమావేశాలకు సంబంధించిన ప్రశ్నలకు పెండింగ్‌లో ఉన్న జవాబులను వెంటనే పంపించాలన్నారు. సమాచారాన్ని తెలుగు, ఉర్దూ, ఇంగ్లీష్‌ ‌భాషలలో ముద్రించి ముందస్తుగా సభ్యులకు అందిస్తే వారు సన్నద్ధం కావడానికి ఉపయోగ పడుతుందన్నారు. సమావేశాలు జరిగినన్ని రోజులు ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులు అందుబాటులో ఉండాలని, ప్రతి శాఖ తరపున ఒక నోడల్‌ అధికారిని నియమించాలని పోచారం శ్రీనివాస్‌ ‌రెడ్డి ఆదేశించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page