ఆం‌దోళన కలిగిస్తునన నిరుద్యోగ సమస్య

కొరోనా అనంతర పరిస్థితులు,తాజాగా ఉక్రెయిన్‌ ‌యుద్ద పరిణామాలు మన ఆర్థిక వ్యవస్థ పుంజుకునేలా లేదు. ప్రధానంగా నిరుద్యోగ సమస్య తీవ్రం అవుతున్నా దానిని పరిస్కరించే ప్రయత్నాలు సాగడం లేదు. దేశీయంగా ఉపాధి అవకాశాలు పెంచుకుంటూ..ఉత్పత్తి రంగాలకు ఊతమిచ్చేలా నిర్ణయాలు తీసుకోవడం లేదు. కొరోనా కు ముందే మన ఆర్థిక వ్యవస్థ అంతంత మాత్రంగా ఉంది. వస్తూత్పత్తి పెరిగినా..ధరల పోటు తప్పలేదు. దేశంలో ఆటోమొబైల్‌ ‌రంగ క్షీణత అన్నది నిరుద్యోగాన్ని పెంచే చర్యగా చూడాల్సి ఉంది. కంపెనీలు అమ్మకాలు లేకుండా మూతపడితే నష్టమని గుర్తుంచుకోవాలన్నారు. ఆర్థిక పునరుత్తేజానికి, వృద్ధిరేటును పెంచడానికి నవతరం సంస్కరణలు అవసరమని పాలకులు గుర్తించడం లేదు. విద్యుత్తు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ (ఎన్‌బీఎఫ్‌సీ)ల రంగాల సమస్యలు సత్వరం పరిష్కరించాల్సి ఉందని, ప్రైవేటు పెట్టుబడులు పెరిగేందుకు సరికొత్త సంస్కరణలు అవసరమని నిపుణులు సూచిస్తున్నారు.

ప్రైవేటురంగ విశ్లేషకుల నుంచి వృద్ధిరేటు అంచనాలు వేర్వేరుగా ఉంటున్నాయని, వీటిల్లో చాలావరకు ప్రభుత్వ అంచనాల కంటే తక్కువగా ఉంటున్నాయని అప్పట్లో పదేపదే మాజీ ఆర్‌బిఐ గవర్నర్‌ ‌రఘురామరాజన్‌ ‌గుర్తు చేశారు. ఆర్థిక వ్యవస్థ మందగమనం తీవ్ర ఆందోళనకరమని, పరిష్కారానికి నూతన సంస్కరణలు అవసరమని రిజర్వ్ ‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇం‌డియా పూర్వ గవర్నర్‌ ‌రఘురామ్‌ ‌రాజన్‌ అప్పట్లో చేసిన హెచ్చరికలు పట్టించుకోలేదు. మొత్తం ద ఆర్థిక వ్యవస్థ మందగమనం తీవ్ర ఆందోళనకరమని నిపుణులు అంటున్నారు. వివిధ రంగాలు ఇబ్బంది పడుతున్నా, వాహన రంగం మాత్రం రెండు దశాబ్దాల్లోనే ఎన్నడూ లేనంత సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న సంగతి విదితమే. పెట్రో ధరలు దీనిని మరింత కుంగదీస్తోంది. వాహన, అనుబంధ రంగాల్లో వేలసంఖ్యలో ఉద్యోగాలు తొలగిస్తున్నారని, స్థిరాస్తి రంగంలో అమ్ముడుకాకుండా నిర్మాణాలు భారీగా మిగిలిపోతు న్నాయని, ఎఫ్‌ఎం‌సీజీ రంగంలో విక్రయాలు తగ్గుతున్నాయనే ఆందోళనలు పెరుగుతున్నాయి.

ఆయా రంగాల నుంచి ఉద్దీపనల కోసం విజ్ఞప్తులు అధికమవుతున్నాయని రాజన్‌ ‌గుర్తు చేశారు. ప్రస్తుతం కంటే వృద్ధిరేటును మరో 2-3 శాతం పెంచాలంటే, ఏ విధంగా దేశాన్ని ముందుకు నడిపించాలనే విషయంపై అవగాహన ఉండాలి. విద్యుత్తు, ఎన్‌బీఎఫ్‌సీ రంగాల్లో సత్వరం సమస్యలు పరిష్కరించాలి. ప్రైవేటు రంగం నుంచి పెట్టుబడులు వచ్చేలా దీర్ఘకాలిక దృక్పథం కలిగిన సంస్కరణలూ కావాలి. ప్రోత్సాహకాలు, ఉద్దీపనలు తాత్కాలికంగా మాత్రమే ఉపకరిస్తాయి. జీడీపీని మనం ఎలా గణిస్తున్నామో, స్వతంత్ర నిపుణుల పర్యవేక్షణ ఉండాలని రాజన్‌ ‌విశదీకరించారు. గత ఆర్థిక సంక్షోభంతో పోలిస్తే, ప్రస్తుతం అంతర్జాతీయంగా బ్యాంకుల స్థితి బాగానే ఉందని రాజన్‌ ‌తెలిపారు.2008లో పరపతి విధానం కీలకమైంది. ఇప్పుడు మెరుగైన విధానం కాదు, ప్రత్యేక విధానం కావాలి. మరో భారీ ఆర్థిక సంక్షోభం వస్తుందని భావించడం లేదని అయితే మన జాగ్రత్తలో మనం ఉండాలన్నారు. కొరోనా నేపథ్యంలో అన్ని అంచనాలు తలకిందులు అయ్యాయి. వాటిని గమనంలోకి తీసుకుని ముందుకు సాగాల్సిన సమయమిదని ఆర్థిక వేత్తలు సూచిస్తున్నారు. ఈ క్రమంలో దేశంలో విస్తృతంగా చర్చించాల్సి ఉంది.ఉపాధి రంగాలను ప్రోత్సహించాల్సి ఉంది.

ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ ‌డెస్క్ 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page