ఆచరణలో కానరాని ఉచిత నిర్బంధ విద్య !

‘‘‌పేద విద్యార్థులు, అణచివేతకు గురైన వర్గాల పిల్లలు ప్రభుత్వ పాఠశాలలో ఉండగా, ఆర్థిక సామాజిక స్తోమత కలిగిన వారి పిల్లలు ప్రైవేట్‌, ‌కార్పొరేట్‌ ‌పాఠశాలలో సంస్థలలో చదువుతున్నారు. ప్రైవేట్‌ ‌రంగంలో చదివిద్దామనుకున్న పేద, మధ్య తరగ•తి ప్రజలకు చదువును కొనుక్కునే స్థోమత లేకుండా పోతోంది. సర్కార్‌ ‌విద్య నానాటికి తీసికట్టు నాగంభొట్లు అన్నట్లుగా తయారయ్యింది. ఉపాధ్యాయ నియామకాలు, పాఠశాలల బలోపేతం పేర ప్రచారం తప్ప క్షేత్రస్థాయిలో పరిస్థితులు వేరుగా ఉన్నాయి. ఇది ఎవరిని అడిగి నా చెబుతారు.’’

ప్రజలందరికి విద్య అందు బాటులో ఉండాలి. ఉచిత నిర్బంధ విద్య హక్కుగా సంక్రమించినా అది అమలు చేయడంలో ప్రభుత్వాలు పూర్తిగా  విఫలం అవుతున్నాయి. పాఠశాలలను పఠిష్టపరచి, ఉపాధ్యాయులను అందుకు అనుగుణంగా నియిమించే విధానాలు మర్చిపోయారు. విద్యారంగానికి కేటాయింపులు తగ్గాయి. కేవలం వోట్‌ ‌బ్యాంక్‌ ‌రాజకీయాలతో అనుత్పా దక రంగాలను ప్రాధాన్య రంగాలుగా ఎంచు కుని ముందుకు సాగుతున్నారు. సమాజం చెడుతోవ పట్టకుండా ఉండాలంటే ముందు ఉచిత నిర్బంధవిద్య అమలు కావాలి. భారత రాజ్యాంగంలో 45వ నిబంధన ప్రకారం 14 ఏళ్ల లోపు పిల్లలందరికి ఉచిత,నిర్బంధ విద్య అందించాలి. 2002లో చేసిన 86వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రాథమిక విద్యను ప్రాథమిక హక్కుగా మార్చింది. 2010లో అమలులోకి వచ్చిన జాతీయ విద్యా హక్కు చట్టం కూడా 14 సంవత్సరాల లోపు పిల్లలందరూ బడిలో ఉండాలని చెప్పింది. కానీ, ప్రజలందరికి అందుబాటులో ఉండవలసిన విద్య భారత దేశంలో ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణ చెందింది. ముఖ్యంగా 1991లో ప్రవేశ పెట్టిన ప్రైవేటీకరణ- సరళీకరణ- ప్రపంచీకరణ విధానాల ప్రభావం విద్యారంగంపై పడి రెండు సమాంతర వ్యవస్థలు ఏర్పడ్డాయి.

పేద విద్యార్థులు, అణచివేతకు గురైన వర్గాల పిల్లలు ప్రభుత్వ పాఠశాలలో ఉండగా, ఆర్థిక సామాజిక స్తోమత కలిగిన వారి పిల్లలు ప్రైవేట్‌, ‌కార్పొరేట్‌ ‌పాఠశాలలో సంస్థలలో చదువుతున్నారు. ప్రైవేట్‌ ‌రంగంలో చదివిద్దామనుకున్న పేద, మధ్య తరగ•తి ప్రజలకు చదువును కొనుక్కునే స్థోమత లేకుండా పోతోంది. సర్కార్‌ ‌విద్య నానాటికి తీసికట్టు నాగంభొట్లు అన్నట్లుగా తయారయ్యింది. ఉపాధ్యాయ నియామకాలు, పాఠశాలల బలోపేతం పేర ప్రచారం తప్ప క్షేత్రస్థాయిలో పరిస్థితులు వేరుగా ఉన్నాయి. ఇది ఎవరిని అడిగి నా చెబుతారు. ప్రాచీన కాలం నుండి ఇప్పటిదాకా విద్య నేర్పటంలో ఉపాధ్యాయుడు సమాజహితుడిగా, సమాజంలో మార్పుకు కేంద్ర బిందువుగా ఉన్నాడు. సమాజంలో అతనిదే సృజనాత్మక పాత్ర అనడంలో సందేహం లేదు.  విద్యార్థి సకల రంగాల్లో నిష్ణాతుడుగా ఎదిగిన, సామాజిక విలువలు పెంపొందించడంలో ఉపాధ్యాయుడిదే  ప్రముఖపాత్ర అని చెప్పాలి. తరగతి గదిలోని ప్రతి విద్యార్థిపై ఉపాధ్యాయుడి ప్రభావం ఉంటుంది. విద్యార్థులలో స్ఫూర్తిని కలిగిస్తూ  లక్ష్యాలను నిర్దేశించడంలో వారే ముందుంటున్నారు. ఉపాధ్యాయులు వృత్తిపరమైన నైపుణ్యాలు పెంచుకుంటూ, బోధన పరికరాలు, అవసరమైన టెక్నాలజీ వినియోగించుకునేలా ప్రభుత్వాలు కూడా ఎప్పటికప్పుడు తోడ్పాటును అందివ్వాలి.

విద్యార్థులలో శాస్త్రీయ దృక్పథం, జిజ్ఞాస, ఆలోచనలు పెంపొందించటానికి కృషి జరగడానికి ఉపాధ్యా యుడే అంతిమ నిర్ణేతగా ముందుకు సాగుతున్నాడు. వేగంగా పెరుగుతున్న టెక్నాలజీ, వర్చువల్‌ ‌క్లాస్‌రూం విధానం ఉపాధ్యాయులకు ప్రత్యామ్నాయంగా మారుతుందని కొంతమంది భావించారు. కాని టెక్నాలజీ ఉపాధ్యాయుడిగా సహాయకారిగా ఉపయోగ పడుతుందిగాని, ప్రత్యామ్నాయం కాదని ఆచరణలో రుజువైంది. కొరోనా  వలన గత రెండేళ్లుగా ప్రపంచవ్యాప్తంగా మన దేశంలో ఉపయోగించిన ’ఆన్‌లైన్‌’ ‌టీచింగ్‌ ‌విధానంతో విద్యార్థుల్లో సృజనాత్మకత లోపించింది. తల్లిదండ్రులు ఆన్‌లైన్‌ ‌విధానం కంటే ఉపాధ్యాయుల బోధనే ముఖ్యమని అంగీకరిస్తున్నారు. ఇటీవల జరిగిన అనేక అధ్యయనాలు కూడా ఈ విషయాలను ధృవీకరించాయి. అనేక పాఠశాలల్లో ఏర్పాటు చేసిన ’స్మార్ట్ ‌క్లాస్‌రూం’లు కూడా ఉపాధ్యాయుడు ఉపయో గించిన చోటే విజయవంతంగా కొనసాగుతు న్నాయి. ఇటీవల ప్రపంచబ్యాంక్‌ ‌నివేదికలో విద్యారంగంలో మానవ వనరుల కంటే టెక్నాలజీకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొన్నది. దీని అర్థం ఉపాధ్యాయుల సంఖ్య తగ్గించటమే.

ప్రభుత్వాలు ప్రపంచబ్యాంక్‌ ‌విధానాలను అమలు చేస్తూ ఉపాధ్యాయుల సంఖ్య తగ్గించటానికి భిన్నమైన పద్ధతులలో ప్రయత్నిస్తున్నాయి. అంటే టెక్నాలజీ ఎంతగా పెరిగినా దానిని విద్యార్థి మస్తిష్కానికి చేర్చడంలో ఉపాధ్యాయులదే కీలక భూమిక. కానీ అలాంటి ఉపాధ్యాయుల విషయం లో ప్రభుత్వాలు సక్రమమైన పద్దతి అవలంబించడం లేదు. వారిని బోధనేతర పనులకు వినియోగించు కోవడం, భార్యాభర్తలను వేర్వేరు ప్రాంతాల్లో పెట్టి హింసించడం, వారికి హాజరు విషయంలో నానా ఇబ్బందులు పెట్టడం జరుగుతోంది. ఉపాధ్యాయులకు సరైన వాతావరణాన్ని కల్పించాల్సింది పోయి వారిన వేపుకుతినే వ్యవహారాల్లో ప్రభుత్వాలు ఆలోచన చేస్తున్నాయి. ఇతర ఉద్యోగుల మాదిరిగా వారిని చూడ రాదు. తాజాగా ఎపిలో ఉపాధ్యాయుల సమయమంతా యాప్‌లతోనే గడిచిపోతున్నది. ఇటీవల ఎపి ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫేస్‌ ‌రికగ్నేషన్‌ అటెండెన్స్ ‌విధానాన్ని ఉపాధ్యాయులు తీవ్రంగా వ్యతిరేకిస్తు న్నారు. ఇప్పటికే నాడు-నేడు పనులు, మధ్యాహ్న భోజన పనులతో ఉపాధ్యాయులు బోధనపై దృష్టి పెట్టలేకపోతున్నారు. టెక్నాలజీ వినియోగించాలంటే ఇంటర్నెట్‌తో సహా సౌకర్యాలు సమకూర్చాలి. విద్యా రంగంలో వచ్చిన మార్పులకు ఉపాధ్యాయులు కూడా తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నారు. విద్యారంగంలో ప్రభుత్వాలు అమలుచేస్తున్న సంస్కరణల వలన ఉపాధ్యాయులు తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నారు. బోధన కంటే బోధనేతర పనులకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తున్నది.

ఉపాధ్యాయులు 14 రకాల యాప్‌లు ఉపయోగించవలసిన పరిస్థితి ఏర్పడింది. విద్యా రంగంలో మార్పులు, సంస్కరణలు రాజ్యాంగ లక్ష్యాలు నెరవేర్చేవిగా అందరికీ విద్య అందించేవిగా ఉండాలి. సంస్కరణలు విద్యారంగాన్ని మార్కెట్‌ ‌వస్తువుగా తయారు చేయరాదు. మార్కెట్‌కు అవసరమైన కోర్సులు మాత్రమే ప్రవేశ పెడుతున్న తీరు కూడా ఆందోళన కలిగిస్తోంది. తాను తెలుసుకున్న జ్ఞానాన్ని, సాధించిన నైపుణ్యాలను తరువాత తరాలకు అందించటానికి ఉపాధ్యాయుడు నిరంతరంగా విద్య ద్వారా ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. పాఠశాల స్థాయిలో కూడా మార్కులు, గ్రేడ్‌పాయింట్లకే ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఉపాధ్యాయులు తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నారు. ప్రభుత్వం ఉపాధ్యాయులను బోధన కే పరిమితం చేసి, వారి చేత సృజనాత్మకంగా బోధన చేయించే వాతావరణం నెలకొల్పాలి. పౌరసమాజం కూడా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలి. అందుకు అనుగుణంగా గ్రామస్థాయిలో తల్లిదండ్రులు విద్యాబోధనలపై దృష్టి సారించాలి. అవసరమైతే ప్రభుత్వాలపై ఒత్తిడి తేవాలి.
– ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ ‌డెస్క్ 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page