ఆదివాసులు అనేక పండు గలు ఉత్సవాలు జరుపుకుని వారి గొప్పదనం ను చాటుతూ వున్నారు.తాము అంతా ఒక్కటే అనే భావన చాటేలా వారి పండుగలు వుంటాయి.కొండ కోనల్లో వుండే గిరిజనుల తీరు ప్రత్యేకం. వారి ఆచార వ్యవహారా లు సంస్కృతీ, సంప్రదాయాలు భిన్నంగా ఉంటాయి. గోండు గూడాల్లో గిరిజనుల జీవనశైలిని ప్రతిభి ంబించే దండారీ, గుస్సాడి ఉత్సవాలు ప్రారంభం అయినాయి. విచిత్ర వేశధారణతో, అంతే అద్భుతమైనా పద్ధతులతో వారు చేసే పూజలు, ఏర్పాట్లు వారి సంప్రదాయాలను సమాజానికి తెలియని విషయాలను పరి చయం చేస్తాయి. దీపావళి పండుగకు ముందు ఆదివాసీల సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక దండారి మొదలవుతుంది.బలిదానంతో దండారి మొదలు అవుతూ వుందని చెప్పుతూ వున్నారు. మన రాష్ట్రము తో పాటు,ఆదివాసులు వుండే వివిధ ప్రాంతాల్లో ఈ పండుగను ఘనంగా నిర్వహించు కుంటారు.వారి ఆచారం ప్రకారం ఆదివాసీలు ఆయా గ్రామముల కూడలిలో నెమలి ఈకలతో ప్రత్యేకం గా తయారు చేసిన టోపీలు, జంతు చర్మంతో తయారు చేసిన డప్పులు, డోలు, గుమేల, ఫరా లాంటి వాయిద్యాలతో పాటు గజ్జెలు, కోలాలు, మంత్రదండం లాంటి రోకలి తది తర సంప్రదాయ వస్తువులను గ్రామ పెద్ద ఇంటి ముందర ఉంచి వాటికి బలిదానం చేసి ప్రత్యేక పూజలతో బోగి పండుగ చేసి ఉత్సవాలను ప్రారంభిస్తారు. గిరిజన గోండు గూడాల్లో పెద్ద మనిషి ది మరియు పటేల్ ది విశిష్ట స్థానం. ఆయన ఊరి పెద్ద గా వ్యవహరిస్తారు.
గిరిజ నులకు పటేల్ మాట వేదవాక్కు. అందుకే దండారి ఉత్సవాలు గ్రామ పటేల్ ఇంటి ముందే నిర్వహించడం ఆనవాయితీ.ప్రత్యేక వేషధార ణలుదండారి ఉత్సవాల్ల్లో భాగంగా తొమ్మిది రోజుల పాటు గుస్సాడి వేషధారణ చేసిన వారు దండారి ముగింపు వరకు స్నానం చేయరు. ఒంటికి బూడిద పూసుకుని దాన్నే స్నానంగా భావించడం వీరి ఆచారం. దీనితో పాటు ముఖా నికి మసి, ఎడమ భుజంపై జింక తోలు, మెడలో రుద్రాక్ష లు, కుడి చేతిలో మంత్రదండం (రోకలి), జంతువుల కొమ్ములు, నెమలి ఈకలతో చేసిన టోపీలు, కాళ్లకు గజ్జెలు, నడుముకు వారి వస్తువుల సంచితో విచిత్ర వేష ధారణతో సంప్రదా యానికి ప్రతీకగా నిలు స్తారు. ఇతర గ్రామాల గు స్సాడీలకు ఆతిథ్యం గుస్సాడి వేష ధారణ వేసిన వారు ఒక సంవత్సరం తమ సొంత గ్రామం నుంచి మరో గ్రా మానికి వెళ్ళి అక్కడి గిరిజ నుల ఆథిత్య విందులో పాల్గొని ఆట పాటలతో, నృత్యాలతో కనువిందు చేయడం ఆనవాయితీ. దీంతో ఇతర గ్రామాల కు వెళ్లిన గుస్సాడిలకు ఘన స్వాగతం పలుకుతారు. మొదట ఆథిత్యం పుచ్చుకున్న వీరు తర్వాతి సంవత్సరం తమ గ్రామానికి ఆహ్వ నిస్తారు. ఇలా ఆ గ్రామాల మధ్య బంధు త్వం పెరుగుతుంది.గుస్సాడి వేషాలలో భాగంగా థింసా నృత్యాలు గిరిజనులు గుస్సాడి వేషాన్ని ధరించేందుకు ఆసక్తి చూ పుతారు.
గుస్సాడి వేషాధారణ వేసిన వారికి వారి దేవతలు ఆవహిస్తారని వారి నమ్మకం.. అతని చేతికి ఉన్న మంత్రదం డం శరీరాన్ని తాకితే ఎలాంటి పెద్ద రోగాలైనా నయమవుతాయ ని వారి నమ్మకం. డప్పులు, బాజాలతో చప్పుల్లకు లయ కలుపుతూ గజ్జెల అడుగులతో లయబద్దంగ నాట్యం చేస్తూ గుస్సాడి నృత్యాలు ప్రదర్శిస్తారు. గోండు గిరిజన మహిళలు కూడా పురుషులతో సమానంగ థింసా నృత్యాలు చేస్తారు.నువ్వుల నూనెతో పూజలు చేసి గిరిజన గ్రామాల్లో ప్రతీ ఇంట్లో దీపావళి సందర్భంగా మహిళలు పవిత్రంగా ఉపవాస దీక్ష చేస్తూ నువ్వులను రోటిలో దంచి నూనెను తీస్తారు. ఆ నూనెతో దండారి ము గింపు వరకు దీపాలను వెలిగించి పూజలు చేస్తారు.నెమలి టోపీలు నెమలి పింఛం లు ధరిస్తారు..కోన్ని గోండు గ్రామాలలో వారే ఇవి తయారు చేస్తూ వున్నారు.ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని గ్రామాలలో ఇవి దొరు కుతాయి.
వీనిని తదితర గ్రామాలకు చెందిన వారు ఇక్కడి నుంచి నెమలి పింఛం టోపీలను కొనుగోలు చేసి తీసుకెళ్తుంటారు. ఒక్క టోపీ ఖరీదు రూ వేల లో వుంటు ందట.కొలబోడితో దండారి ముగింపుదీపావళి మరుసటి రోజు కొలబోడి ఉత్సవాలను దండారి సంబురాలు ముగిస్తారు. దీపావళి అనంతరం గుస్సాడీలు చివరి రోజున నృత్యాలు చేస్తారు. అనంతరం గ్రామ పొలిమేరల్లో ఇప్ప చెట్టు వద్ద భీందేవుని సన్నిధికి చేరుకుం టారు.అక్కడకొలబోడి సంద ర్భంగా నెమలి టోపీలను తొలగించి కోళ్లు, మేకలతో ప్రత్యేక పూజలు నిర్వ హిస్తారు. అనంతరం ఈ తతంగం తో ఈ పండుగ సంబరాలు ముగుస్తాయి.ఈ వారం పాటు ప్రతీ ఆదివాసీ కుటుంబ సభ్యులు సంతోషం తో వుంటారు.
– కామిడి సతీశ్ రెడ్డి
జయశంకర్ భూపాలపల్లి జిల్లా
9848445134.