ఆమనగల్ పట్టణంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రి 30 పడకల నుంచి 150 పడకల స్థాయికి పెంచాలని కోరుతూ ఈనెల 14న (శుక్రవారం) బిజెపి ఆమనగల్ మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో ఒకరోజు రిలే నిరాహార దీక్షలు చేపడుతున్నట్లు మున్సిపాలిటీ బీజేపీ అధ్యక్షుడు మండన్ శ్రీకాంత్ సింగ్ తెలిపారు. గురువారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆమనగల్లు పట్టణంలో నిర్వహించిన ఎన్నికల బహిరంగ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమనగల్లు ప్రభుత్వ ఆసుపత్రిని 150 పడకల ఆసుపత్రిగా మారుస్తానని హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీని ఇంతవరకు నెరవేర్చలేదని శ్రీకాంత్ సింగ్ ఆరోపించారు.. దీనికి నిరసనగా రేపు శుక్రవారం ఆమ నగల్లు బస్టాండ్ సమీపంలో ఒకరోజు రిలే నిరాహార దీక్ష చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. ఆమనగల్లు మున్సిపాలిటీ బిజెపి శాఖ ఆధ్వర్యంలో చేపట్టే దీక్షకు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, నాయకులు ప్రజాప్రతినిధులు, కౌన్సిలర్లు, మండల, మున్సిపాలిటీ ప్రజలు ఒకరోజు చేపట్టే రిలే నిరాహార దీక్షకు సంఘీభావం తెలుపాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ బిజెపి ప్రధాన కార్యదర్శి గోజె నందు, మాజీ ఎంపిటిసి గుంపెని శ్రీను, బీజేవైఎం మండల అధ్యక్షులు వరికుప్పల శ్రీను, ఓబీసీ మండల అధ్యక్షులు వరికుప్పల శ్రీనివాస్, బూత్ అధ్యక్షులు వరికుప్పల జంగయ్య, బీజేవైఎం ప్రధాన కార్యదర్శి రాఘవ తదితరులు పాల్గొన్నారు.