- మల్టీ స్టేట్ కో ఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్ 2022కు ఆమోదం
- రైల్వే ఉద్యోగులకు 78 రోజుల బోనస్
- కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు
న్యూ దిల్లీ, అక్టోబర్ 12 : ప్రపంచవ్యా ప్తంగా ఎల్‌పీజీ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో సామాన్యులపై ఆ ప్రభా వం పడకుండా పబ్లిక్ సెక్టార్‌లోని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు 22 వేల కోట్ల రూపాయలు వన్ టైమ్ గ్రాంట్‌గా ఇవ్వాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. బుధవారం కేబినెట్ సమావేశం పలు కీలక నిర్ణయాలు తీసుకున్నది. పిఎం డెవెలప్‌మెంట్ ఇనీషియేటివ్ ఫర్ నార్త్ ఈస్ట్ రీజియన్ అనే కొత్త పథకానికి కూడా కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిందని సమాచార ప్రసార శాఖల మంత్రి అనురాగ్ సింగ్ టాకూర్ తెలిపారు.
2022-23 నుంచి 2025-26 వరకూ పదిహేనో ఆర్థిక కమిషన్ ప్రకా రం ఈ కొత్త పథకం అమలౌతుందని తెలిపారు. అలాగే మల్టీ స్టేట్ కో ఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్ 2002ను సవరిస్తూ మల్టీ స్టేట్ కో ఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్ 2022కు కూడా కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. 11.27 లక్షల మంది రైల్వే ఉద్యోగులకు 78 రోజుల బోనస్ ఇవ్వాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించినట్లు, అందుకోసం మొత్తం 1,832 కోట్ల రూపాయలు కేటాయించినట్లు టాకూర్ వివరాలను వెల్లడించారు.