జగదేవపూర్, ప్రజాతంత్ర, డిసెంబర్ 27: జగదేవపూర్ మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ప్రభుత్వం ఆరు గ్యారంటీలను ఎంపీపీ బాలేశం గౌడ్, జడ్పీటీసీ సుధాకర్ రెడ్డి, ఎంపీడీఓ శ్రీనివాస్ వర్మ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమని కి ముఖ్య అతిథిగా మండల స్పెషలాఫీసర్ శివప్రసాద్, యస్ఐ చంద్రమోహన్, ఎమ్మార్వో శ్రావణ్ కుమార్ సమావేశానికి హాజరైనారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు పరుస్తున్న ఆరు గ్యారంటీలను అధికారులు, ప్రజా ప్రతినిధులు సమన్వయoతో పని చేసి ప్రజలకు మరింత చేరువయై విధంగా సమస్యలను పరిష్కారం చేయాలనీ అన్నారు.జవాబుదారితనం ప్రజలకు పరిపాలన మరింత చేరువయై విధంగా అధికారులు కృషి చేయాలని అన్నారు. ప్రతి రోజు రెండు స్టేపులలో ఉదయం 8 నుండి 12గంటల వరకు మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు జరపాలని తెలిపారు. ప్రతి గ్రామ పంచాయతీ లో కౌంటర్లు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తు స్వికరించు పథకాలు 1). మహా లక్ష్మి పథకం
2). రైతు భరోసా పథకం 3).ఇందిరమ్మ ఇండ్ల పథకం
4). చేయూత పథకం
5). యువ వికాసం పథకం
6). గృహ లక్ష్మి పథకo పథకాలు అమలు చేయాలనీ అన్నారు. ఈ కార్యక్రమంలో పాక్స్ చైర్మన్ ఇంద్ర సేనా రెడ్డి, మండల కో ఆప్షన్ సభ్యులు సయ్యద్ ఇక్బాల్, జిల్లా ఎంపీటీసీ ల ఫోరమ్ అధ్యక్షులు కిరణ్ గౌడ్,సర్పంచ్ లు యాదవ రెడ్డి, కరొళ్ల కనకయ్య కొత్త శ్రీనివాస్ రెడ్డి, తీగుల్ సర్పంచ్ కప్పర భాను ప్రకాష్ రావు, వెంకట్ రామ్ రెడ్డి, ఎంపీటీసీ లు మహేందర్ రెడ్డి,మహేందర్,కొత్త కవిత శ్రీనివాస్ రెడ్డి, అధికారులు పంచాయతీ సెక్రటరీ లు ఐసీడీస్ సూపర్ వైజర్ లు సునీత, రజిని హాస్పిటల్ సిబ్బంది జితేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.