తెలంగాణ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ చరిత్ర ఆవిష్కతం అయ్యింది. వైద్య రంగంలో నూతన విప్లవం తీసుకుని వచ్చిన ఘనత కెసిఆర్‌దే. ఇప్పటికే వైద్యరంగాన్ని బలోపేతం చేయడంలో భాగంగా హాస్పిటల్స్ తీర్చిదిద్ది సౌకర్యాలను కల్పిస్తూ వొస్తున్న ప్రభుత్వం ఏకంగా ఎనిమిది కాలేజీలకు జీవం పోసింది. ప్రతి ప్రభుత్వదవాఖానాలో పరీక్షలన్నీ జరిగేలా అధునాతన మిషినరీని ఏర్పాటు చేశారు. అధునాతన సాంకేతికి వ్యవస్థను అందుబాటులోకి తెచ్చారు. ప్రభుత్వదవాఖానాల్లో వైద్య సౌకర్యాలను బాగా మెరుగు పరిచారు. ఈ క్రమంలోనే మన బిడ్డలు ఇక్కడే చదువుకుని వైద్యరంగంలో రాణించాలన్న సంకల్పాన్ని కెసిఆర్ చాటారనడంలో సందేహం మంగళవారం మధ్యాహ్నం సిఎం కెసిఆర్ చేతుల దుగా ఏకంగా 8 ప్రభుత్వ వైద్య కాలేజీలను ప్రారంభించడం అరుదైన చరిత్రగానే చెప్పుకోవాలి. దేశ చరిత్రలోనే ఒక అరుదైన సందర్భం.. ఒకేసారి ఎనిమిది ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రారంభం కాబోతున్న శుభసమయంలో కెసిఆర్ నిజంగానే అభినందనీయుడు. ఎనిమిదేండ్లలో ఎన్నో సంచలనాలు సృష్టించిన తెలంగాణ, మరో చారిత్రక ఘట్టానికి కూడా వేదిక కాబోతున్నదని నిరూపించారు. డబుల్ ఇంజిన్ సర్కార్ పేర ఎన్నో డాంబికాలు పలుకుతున్న బిజెపి నేతలకు ఈ అభివృద్ది నమూనా కనువిప్పు కావాలి.
ఇంతకాలం కెసిఆర్‌ను, ఆయన పాలనను తిట్టిపోయడం తప్ప ఒక్క మంచి పని కూడా చేయని వారికి ఇదో చెంపదెబ్బ. సింగరేణిని ప్రైవేట్ పరం చేసేపని మా చేతుల్లో లేదన్న ప్రధాని..వ్యాఖ్యలను గమనిస్తే వారిచేతుల్లో ఉంటే విశాఖ ఉక్కులాగా ఇప్పటికే అమ్మకానికి పెట్టేవారనడంలో సందేహం లేదు. అందుకే తెలంగాణ వొస్తే ఏమొస్తుందని అనుకున్న వారికి అనేక కార్యక్రమాలను చేసి చూపించిన ఘనత సిఎం కెసిఆర్‌దే. డబుల్ ఇంజిన్ సర్కార్‌తో బురిడీ కొట్టిస్తూ..దేశ ప్రజలను వంచిస్తూ వొచ్చిన బిజెపికి చెంపపెట్టులాంటి మార్పు కళ్లకు సాక్షాత్కారం అయ్యింది. బీబీనగర్ ఎయిమ్స్ కోసం పోరాడితే మంజూరు చేసిన కేంద్రం ఇప్పుడక్కడ కనీస వసతులను కూడా ఏర్పాటు చేయేలదన్న విమర్శలకు సమాధానం చెప్పాలి. కేంద్రం మంచి చేయదల్చుకుంటే ముందు బీబీనగర్ ఎయిమ్స్‌ను బలోపేతం చేసి సమస్యలను దూరం చేయాలి. ఇకపోతే ఉమ్మడి ఎపిలో మెడికల్ సీటు కోసం ఎంతగా తపించి….విదేశాలకు పోతున్న వారికి తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న కానుక కొత్త మెడికల్ కాలేజీలు అని చెప్పక తప్పదు. రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేసిన ఎనిమిది వైద్య కళాశాలల్లో మంగళవారం నుంచి తరగతులు అందుబాటులోకి రావడం అన్నది ఒక అభివృద్ది నమూనాకు సంకేతం. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు మధ్యాహ్నం 12 గంటలకు ప్రగతిభవన్ నుంచి వర్చువల్‌గా ఒకేసారి తరగతులను ప్రారంభించడం ద్వారా విద్యార్థులకు కొత్త ఆశలు కల్పించారు. ఇక్కడే తాము వైద్యవిద్యను అభ్యసించవచ్చన్న భరోసా కల్పించిన ఘనత కూడా కెసిఆర్‌దని చెప్పక తప్పదు. ఈ నిర్ణయంతో సంగారెడ్డి, మహబూబాబాద్, మంచిర్యాల,జగిత్యాల, వనపర్తి, కొత్తగూడెం, నాగర్ కర్నూలు, రామగుండం పట్టణాల్లోని 8 నూతన ప్రభుత్వ వైద్య కళాశాలలు అందుబాటులోకి వొచ్చాయి.
ఎంబీబీఎస్ తొలి విద్యాసంవత్సరం ముఖ్యమంత్రి చేతుల దుగా ప్రారంభం కావడం ద్వారా తెలంగాణ మరో మైలురాయిని చేరుకుంది. జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలన్న సీఎం కేసీఆర్ కలను సాకారం చేసే దిశగా అతిపెద్ద అడుగు పడింది. ఈ 8 కాలేజీలతో అదనంగా 1,150 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి వొచ్చాయి. తెలంగాణ ఏర్పడేనాటికి రాష్ట్రంలోని మెడికల్ కాలేజీల సంఖ్య 5 మాత్రమే. ఇందులో గాంధీ (1954), ఉస్మానియా (1946) ఉమ్మడి ఆంధప్రదేశ్ ఆవిర్భవించేనాటికే ఉన్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో వరంగల్‌లో కాకతీయ మెడికల్ కాలేజీ, ఆదిలాబాద్‌లో రిమ్స్, నిజామాబాద్‌లో మరో వైద్య కళాశాలను మాత్రమే ఏర్పాటుచేశారు. దీంతో గ్రాణ ప్రాంతాలకు మంచి వైద్యం, వైద్య విద్య అందని ద్రాక్షగా మారాయి. ఏదైనా పెద్ద వ్యాధి వొచ్చినా, మెరుగైన వైద్యం పొందాలన్నా హైదరాబాద్‌కు పరిగెత్తాల్సిన దుస్థితి. వందల కిలోటర్ల దూరం.. గంటలపాటు ప్రయాణం చేయాల్సి వొచ్చేది. అంత ప్రయాసపడి వొచ్చినా.. చికిత్స కోసం వారాలు, నెలలపాటు అక్కడే ఉండాల్సిన పరిస్థితి ఉండేది. సరైన వసతులు లేక సహాయకులు అష్టకష్టాలుపడేవారు.
దీంతో కుటుంబాలు ఆగమయ్యేవి. మరోవైపు.. ఐదు కాలేజీల్లో కలిపి 850 సీట్లు మాత్రమే ఉండేవి. దీంతో మెడిసిన్ చదువాలనుకున్న ఎంతోమంది విద్యార్థులు తమ కలలకు దూరమయ్యేవారు. మరికొందరు విదేశాలకు వెళ్లి రూ.లక్షలు ఖర్చు పెట్టి అప్పులపాలయ్యారు. ఈ క్రమంలో మెడికల్ కాలేజీల కోసం కేంద్రాన్ని అనేకమార్లు అభ్యర్థించారు. ఒక్క కాలేజీ అన్న మంజూరు చేయమని విన్నపాలు సమర్పించారు.. కానీ కేంద్రం కనికరించలేదు. ఈ క్రమంలో స్వరాష్ట్రం ఏర్పడిన వెంటనే సూపర్ స్పెషాలిటీ సేవలను పేదలకు చేరువ చేయాలని నిర్ణయించుకొన్నారు. ఇందుకోసం జిల్లాకు ఒక వైద్య కళాశాలను ఏర్పాటుచేయాలని లక్ష్యంగా నిర్దేశించుకుని కార్యక్రమాన్ని పూర్తి చేశారు. నిజానికి సంకల్పం ఉండడం ఒక ఎత్తయితే..దానిని అమలు చేసి సాకారం చేయడం మరో ఎత్తు. ఇది ఆషామాషీ వ్యవహారం కాదు. మొదటి దశలో నాలుగు మెడికల్ కాలేజీలకు శ్రీకారం చుట్టిన కెసిఆర్ మహబూబ్‌నగర్, సిద్దిపేట, నల్లగొండ, సూర్యాపేటలో మెడికల్ కాలేజీలను ఏర్పాటుచేశారు. రెండోదశలో సంగారెడ్డి, మహబూబాబాద్, మంచిర్యాల, జగిత్యాల, వనపర్తి, భద్రాద్రి కొత్తగూడెం,నాగర్‌కర్నూలు, రామగుండంలో కాలేజీలను ఏర్పాటు చేశారు.
ఎనిమిదేండ్లలోనే కాలేజీల సంఖ్య మూడున్నర రెట్లు పెరిగింది. ఉమ్మడి పాలనలో 57 ఏండ్లలో ప్రభుత్వాలన్నీ కలిపి తెలంగాణలో ఏర్పాటు చేసినవి మూడు కాలేజీలే. అంటే.. సగటున 19 ఏండ్లకు ఒక కాలేజీని ఏర్పాటు చేస్తే.. సీఎం కేసీఆర్ పాలనలో ఎనిమిదేండ్లలోనే 12 కాలేజీలు ఏర్పడ్డాయి. వొచ్చే ఏడాది 9, ఆ పై ఏడాది మరో 8 మెడికల్ కాలేజీలను ప్రభుత్వం ఏర్పాటుచేయనున్నది. దీంతో జిల్లాకో మెడికల్ కాలేజీ కల సాకారం కాబోతున్నది. ఇది నిజంగా ఒక విప్లవాత్మకనిర్ణయంగానే చూడాలి. కాలేజీల ఏర్పాటులో పాటు మెడికల్ కాలేజీలో స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ విభాగాలు, అత్యాధునిక పరికరాలు ఉంటాయి. ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ఎంబీబీఎస్ విద్యార్థులు, సీనియర్ రెసిండెంట్లు.. ఇలా భారీగా సిబ్బంది ఉంటారు. దీంతో ప్రజలకు మంచి వైద్యం అందుబాటులోకి వొస్తుంది. పెద్ద వ్యాధి వొచ్చినా హైదరాబాద్ వరకు పరిగెత్తాల్సిన అవసరం లేకుండా జిల్లా కేంద్రంలోనే చికిత్స లభిస్తుంది. జిల్లాల వికేంద్రీకరణ నేపథ్యంలో మారుమూల గ్రామాలకు సైతం జిల్లా కేంద్రాలు గరిష్ఠంగా 50-70 కిలోటర్ల దూరంలోనే ఉన్నాయి. కాబట్టి అత్యవసర సమయాల్లో తొందరగా హాస్పిటల్ కి• చేరుకోవచ్చు.ఇలా వైద్య రంగంలో ఎనిమిది కాలేజీలను ఏర్పాటు చేసి, వాటికి సొంతంగా భవనాలను,నిర్మించి, సకల సదుపాయా లను కల్పించి ముందుకు వెళ్లడం అభినందనీయం. తెలంగాణ వైద్యారోగ్య రంగంలో ఇదో విప్లవంగా భావిస్తూ..ఇందుకు సంకల్పాన్ని చాటిన సిఎం కెసిఆర్ సర్వదా అభినందనీయుడని చెప్పాలి.
– ప్రజాతంత్ర డెస్క్