ఆలయ భూమికి శఠగోపం

  • కన్నేశాడు కబ్జాకు పూనుకున్నాడు
  • కొత్తగూడెం శ్రీ గణేశా దేవాలయానికి చెందిన లక్షల విలువ చేసే భూమి కబ్జా
  • అడ్డొస్తే అంతు చూస్తానంటు బెదిరింపులు
  • అధికారుల నిర్లక్షమే కారణమంటూ స్థానికుల ఆగ్రహం
image.png
కొత్తగూడెం, ప్రజాతంత్ర, ఆగస్ట్ 18 : ‌కబ్జాకు కాదు ఏది అనర్హం అన్నట్లు కొత్తగూడెం నడి బ•డ్డున ఉన్న ఆలయ భూమి మీద కన్నేశాడు ఓ ప్రభుద్దుడు. ఎలాగైనా కబ్జా చేయాలనుకున్నాడు అంతే అనుకున్నది తడవుగా దైవాన్ని అడ్డుపెట్టి దోచేయాలని పన్నిన పథకం అర్థ రాత్రి అమలు చేసేసాడు కబ్జాదారుడు. కబ్జాకోరుకు కోటి ఉపాయాలు అన్న చందంగా కంచి కామ కోటి పీఠ శ్రీ మఠం సంస్థానముకు చెందిన కొత్తగూడెం పట్టణం రైటర్‌బస్తీలోని శ్రీ గణేశా దేవాలయానికి చెందిన రూ లక్షల్లో విలువ చేసే భూమిపై కన్ను పడింది. దేవాలయ నిర్వహణకు దూప, దీప, నైవేద్యానికి అయ్యే ఖర్చల కోసం  కొత్తగూడెం బస్టాండ్‌ ‌సెంటర్‌లో సుమారు 0.27 ఎకరాల భూమిని సింగరేణి సంస్థ 1981 కేటాయించింది. అయితే ఆ స్థలంలో షాపింగ్‌ ‌కాంప్లెక్స్‌లు నిర్మించగా వాటి వెనక ఉన్న 800గజాల కాళీ స్థలాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నించాడు. దేవుని మాన్యం భూములను సైతం అక్రమార్కులు విడిచిపెట్టలేదు. శ్రీ గణేశా దేవాలయ మాన్యం భూమి అందుకు నిదర్శనం. అన్ని విఘ్ణాలు తొలగించే ఆ ఆది దేవుడి ఆలాయానికి చెందిన భూమిని కాజేసేందుకు అమ్మవారి విగ్రహాన్ని అడ్డు పెట్టి ఆక్రమించేందుకు మధుర బస్తికి చెందిన ప్రేమ్‌ అనే వ్యక్తి పన్నాగం పన్నాడు. గురువారం అర్థరాత్రి గుట్టు చప్పుడు కాకుండా అమ్మవారి విగ్రహాన్ని పెట్టడం పెద్ద వివాదాస్పదంగా మారింది.
దీనితో ఆగ్రహించిన స్థానికులు పోలీసులకు, ఆలయ కమిటీ సభ్యులకు ఫిర్యాదు చేశారు. ఆలయం నిర్మించాలనే సదుద్దేశమే ఉంటే బస్తీలోని ప్రజలను సంప్రదించాలని, కానీ అలా చేయకుండా, ఎవ్వరికీ తెలియకుండా రాత్రికి రాత్రి అమ్మవారి విగ్రం ఎలా ప్రతిష్టిస్తావని ఎదురు తిరిగారు. దీనితో కోపోద్రిక్తు డైన ప్రేమ్‌ ఎవరైనా అడ్డు పడితే అంతు చూస్తానని బెదిరింపులకు పాల్పడుతున్నాడని స్థానికులు వాపోతున్నారు. ఈ కాళీ స్థంలోనే సదరు వ్యక్తి స్క్రాప్‌ ‌దుకాణం పెట్టాడని, నెమ్మదిగా ఆలయ భూమిని ఆక్రమించేందుకు స్వార్థపు ఆలోచనతో పక్కా వ్యూహాత్మకంగా గుడి కట్టాలంటూ ప్రచారం చేస్తున్నాడని వార్డు ప్రజలు ఆరోపిస్తున్నారు. ప్రేమ్‌ ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతుందని మండి పడుతున్నారు.
దురాలోచనతో అమ్మవారి విగ్రహాన్ని తెరమీదికి తేవడం సరికాదని నిలదీస్తే బెదిరింపులకు పాల్పడుతున్నాడని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి పూజలు లేకుండా స్వార్థ ప్రయోజనానికి అర్థ రాత్రి సమయంలో అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్టించడం వార్డు ప్రజలకు సైతం అరిష్టం అని భయాందోళన చెందుతున్నారు. ఈ వ్యక్తికి గతంలో నేర చరిత్ర ఉండటంతో బస్తీ వాసులు ఎప్పుడు ఏమి జరుగుతుందో అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విషయంపై స్థానికులు శుక్రవారం ఆలయ కమిటీ సభ్యులకు, పోలీసులకు సామాచారం అందిచారు. ఇదిలా ఉండగా దేవాలయ భూమిని కజ్జా చేసేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని ఆలయ కమిటీ సభ్యులు నాలుగు నెలల క్రితం రెవెన్యూ అధికారులకు సైతం ఫిర్యాదు చేశారు. అయినా ఎలాంటి ప్రయోజనం లేకపోయింది. అధికారుల నిర్లక్ష్యానికి తోడు కొందరు స్థానిక ప్రజాప్రతినిధుల అండదండలతోఈ దురాగతానికి పాల్పడుతున్నాడనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దేవాలయ భూమిని ఆక్రమించేందుకు అండగా నిలుస్తున్న తెరవెనక ఉన్న ఆ రాజకీయ నాయకులు ఎవరనేది పట్టణంలో చర్చానీయంగా మారింది.
దేవస్తానం భూమిని పరిరక్షించాలి : ఆలయ కమిటీ కార్యదర్శి ఎ రామ రాజు  
ఆలయ భూమిని ఆక్రమించేందుకు ప్రేమ్‌ అనే వ్యక్తి ప్రయత్నిస్తున్నట్లు తెలియడంతో నాలుగు నెలల క్రితం ఆలయ కమిటీ సభ్యులం కలెక్టర్‌కు ఫిర్యాదు చేశాము. స్థలం చుట్టూ ఉన్న ప్రహరీ గోడను కూల్చి అందులో ఆవును కట్టేసి గుడి కడతాను అంటూ ప్రచారం చేస్తున్నాడు. దీనిపై స్థానిక ప్రజాప్రతినిథి సమక్షంలో ఆలయ భూమిలో ఎలాంటి కట్టాడాలు చేవద్దని తేల్చి చెప్పాము. ఈ విషయంపై పది రోజుల క్రితం వన్‌టౌన్‌ ‌పోలీసులకు ఫిర్యాదు చేశాము. ఆలయ భూమి ఆక్రమించకుండా ప్రహరీ గోడ నిర్మించాలని, ఎవరైనా అడ్డుపడితే చర్యలు తీసుకుంటామని సిఐ కరుణాకర్‌ ‌తెలిపారు.
ప్రహరీ గోడ నిర్మాణానికి చర్యలు చేపడుతున్న నేపధ్యంలో గురువారం అర్థ రాత్రి ప్రేమ్‌ ‌గుట్టు చప్పుడు చేయకుండా ఆలయ భూమిలో చొరబడి అమ్మవారి విగ్రహాని ప్రతిష్టించాడు. ఆక్రమణను అడ్డుకున్నందుకు బెదిరింపులకు పాల్పడుతున్నాడు. ఆక్రమణదారుడితో కమిటీ సభ్యులకు ప్రాణహాని ఉంది. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో తక్షణమే స్పందించిన డిఎస్పి ఎస్‌కె అబ్దుల్‌ ‌రహమాన్‌ ఆలయ భూమిని కబ్జాకు పాల్పడినవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, తగిన రక్షణ కల్పిస్తామని హామీ ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page