అమిత్ షాకే హోమ్..నిర్మలకు ఆర్థిక, రాజ్‌నాథ్‌కు రక్షణ..
గడ్కరీకి రోడ్లు మరియు రహదారులు, జై శంకర్‌కు విదేశాంగ శాఖ
కేంద్రంలో మంత్రులకు శాఖలను కేటాయించిన ప్రధాని
ప్రజాతంత్ర ఇంటర్నెట్ డెస్క్, జూన్ 10 : ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో మంత్రి మండలి ప్రమాణ స్వీకారం చేసిన ఒక రోజు తర్వాత, మంత్రులకు మంగళవారం శాఖలను కేటాయించారు. అత్యంత ప్రాధాన్యత కలిగిన హోమ్, ఆర్థిక, రక్షణ, రోడ్లు మరియు రహదారులు, విదేశాంగ శాఖలు పాతవారికే కేటాయిం చారు. గాంధీనగర్ ఎంపీ అమిత్ షాకు హోమ్ మంత్రిత్వ శాఖను, రాజ్య సభ ఎంపి నిర్మలకు ఆర్థిక శాఖను, లక్నో ఎంపీ రాజ్‌నాథ్ సింగ్‌కు రక్షణ శాఖను, బీజేపీ సీనియర్ నేత మరియు నాగ్‌పూర్ ఎంపీ నితిన్ గడ్కరీకి రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ, జై శంకర్ కు విదేశాంగ శాఖలనే మళ్ళీ కేటాయించారు. మళ్లీ కేటాయించారు. ఇక అశ్విని వైష్ణవ్ రైల్వే మంత్రిత్వ శాఖను కొనసాగించారు మరియు అదనంగా, సమాచార మరియు ప్రసార శాఖ మంత్రిత్వ శాఖను కేటాయించారు. ఈ పదవిని గతంలో హమీర్‌పూర్ ఎంపీ అనురాగ్ సింగ్ టాకూర్ నిర్వహించారు. మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ కొత్త వ్యవసాయ మంత్రిగా, హర్యానా మాజీ సీఎం మనోహర్‌లాల్ ఖట్టర్ ఇప్పుడు విద్యుత్ శాఖకు నేతృత్వం వహిస్తారు.
బిజెపి సీనియర్ నాయకులు సిఆర్ పాటిల్ జలశక్తి, ధర్మేంద్ర ప్రధాన్‌కు విద్యా మంత్రిత్వ శాఖలకు నాయకత్వం వహిస్తారు. లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) అధినేత చిరాగ్ పాశ్వాన్ యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు. జనతాదళ్ (సెక్యులర్) నాయకుడు మరియు కర్ణాటక మాజీ సిఎం హెచ్‌డి కుమారస్వామి, భారీ పరిశ్రమలు మరియు ఉక్కు మంత్రిత్వ శాఖకు నాయకత్వం వహిస్తారు. తెలుగుదేశం పార్టీకి చెందిన కింజరాపు రామ్ మోహన్ నాయుడు కొత్త పౌర విమానయాన మంత్రిగా ఉంటారు, గతంలో జ్యోతిరాదిత్య సింధియా ఈ పదవిలో ఉన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో లూథియానా స్థానం నుంచి ఓడిపోయిన రవ్‌నీత్ సింగ్ బిట్టు మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు నేతృత్వం వహిస్తారు.
మాజీ ఎర్త్ సైన్సెస్ మంత్రి కిరెన్ రిజిజు ఇప్పుడు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు బాధ్యత వహిస్తారు. జోధ్‌పూర్ ఎంపీ గజేంద్ర సింగ్ షెకావత్ ఇప్పుడు సాంస్కృతిక మరియు పర్యాటక శాఖ మంత్రిగా, ఇక బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆరోగ్య మంత్రిత్వ శాఖకు నేతృత్వం వహిస్తారు. ఇద్దరు మహిళా కేబినెట్ మంత్రుల్లో ఒకరైన అన్నపూర్ణా దేవి మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖకు నేతృత్వం వహిస్తారు. ఇక టెలికమ్యూనికేషన్స్ శాఖను జ్యోతిరాధిత్య సింధియా, టెక్స్‌టైల్ శాఖను గిరిజ్ సింగ్‌కు, ప్రహాద్ జోషీకి వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం మరియు పౌర సరఫరాల శాఖను, పీయూష్ గోయల్‌కు వాణిజ్య మరియు పరిశ్రమల శాఖను కేటాయించారు.
కిషన్ రెడ్డికి కీలక బొగ్గు, గనుల శాఖ… బండికి హోమ్ శాఖ సహాయ..
కేంద్రంలో తెలంగాణకు సంబంధించిన ఎంపిలకు మంత్రిత్వ శాఖలు కేటాయింపు
ప్రజాతంత్ర ఇంటర్నెట్ డెస్క్, జూన్ 10 : కేంద్రంలోని ఎన్‌డిఏ కూటమి కొత్త మంత్రివర్గంలో కేంద్ర మంత్రులుగా ఆదివారం ప్రమాణ స్వీకారం చేసిన తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కిషన్ రెడ్డి, బండి సంజయ్‌లకు ప్రధాని మోదీ మంత్రిత్వ శాఖలను కేటాయించారు. సోమవారం కొత్త మంత్రి మండలి భేటీ అనంతరం వివిధ శాఖలకు కేటాయింపులు జరిపారు. ఇక గత ప్రభుత్వంలో పర్యాటక శాఖ మంత్రిగా ఉన్న, సికింద్రాబాద్ లోక్ సభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న కిషన్ రెడ్డికి కొత్త మంత్రి మండలిలో కీలకమైన బొగ్గు, గనుల శాఖను కేటాయించగా, కరీంనగర్ లోక్ సభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న బండి సంజయ్‌కి హోమ్ శాఖ సహాయ మంత్రిత్వ శాఖను కేటాయించారు.