ఆమనగల్లు, ప్రజాతంత్ర నవంబర్ 17 : బిజెపి అభ్యర్థి ఆచారి గెలుపు కోసం బిజెపి నాయకులు గడపగడపకు వెళ్లి ప్రచారం చేశారు. శుక్రవారం పలు వార్డులలో ఆమనగల్ పట్టణ యాదవ సంఘం అధ్యక్షుడు జేనిగల యాదగిరి యాదవ్ ప్రచారం చేసి ఓట్లు అడిగారు. ఒక్క అవకాశం ఇస్తే ఆమనగల్ మండలాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరుస్తారని వారు హామీ ఇచ్చారు. ఈనెల 30న కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి ఆచారిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో చెక్కల లక్ష్మణ్, బైకని అశోక్, నాగిళ్ళ లక్ష్మణ్, వడ్డే రాజు, జనిగేలగిరి, గిరి బాబు తదితరులు పాల్గొన్నారు.