ఇక పాలమూరులో పసిడి పంటలు

• పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలతో 12.30 లక్షల ఎకరాలకు సాగు నీరు
• 1220 గ్రాములకు తాగునీరు అందపోతుంది.
• 50 రోజుల్లో నార్లాపూర్‌ ఏదుల వట్టెం కరివేన రిజర్వాయర్‌లు
అందుబాటులోకి.
• పాలమూరు రైతు, ప్రజల కల సాకారం కాబోతుంది.
• పాలమూరు పచ్చబడి, దశ మారబోతుంది.
• ఈనెల 16న నార్లపూర్‌ ‌వద్ద సీఎం చేతులపై వెట్‌ ‌రన్‌  ‌ప్రారంభం.
జాతికి అంకితం.

‌పల్లె పల్లెన పల్లేర్లు మొలిచిన పాల మూరులో ఇకపై పసిడి పంటలతో పచ్చబడ బోతుంది.పాలమూరు పేరు విన గానే ఒకప్పుడు కరువు, కాటకాలతో కొట్టు మిట్టాడేది, సాగు తాగు నీరు లేక ,భూములన్ని బీడు వాడి నెర్రలు బారీ, పంటలు పండక రైతులు ప్రజలు జీవనోపాధి కోసం వలసలు వెళ్లేవారు .తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక టిఆర్‌ఎస్‌ ‌పార్టీ ప్రభుత్వం ఏర్పాటు అనంతరం, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌, ‌ప్రతిష్టాత్మకంగా తీసుకొని పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టారు.జీవో నెంబర్‌ 105 ‌ద్వారా, జూన్‌ 10‌వ తేదీ 2015 సంవత్సరం తాత్కాలిక అంచనా రూ 35 వేల 200 కోట్ల,  పరిపాలన అనుమతులు తో ప్రాజెక్టు నిర్మాణం మొదలుపెట్టారు.పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా, అతి త్వరలో  ఉమ్మడి మహబూబ్నగర్‌ ‌రంగారెడ్డి జిల్లాలకు,  12.30 లక్షల ఎకరాల సాగు, 1226 గ్రామాలకు తాగు నీరు అందబోతుంది.పాలమూరు రంగారెడ్డి ద్వారా వ్యవసాయ భూముల్లో, కృష్ణమ్మ పరవళ్ళు తొక్కనుంది.

దీంతో పాలమూరు జిల్లా  పచ్చదనంతో సస్యశ్యామలం కానుంది.తెలంగాణ రాష్ట్రంలోనే ఉమ్మడి మహబూబ్న గర్‌  అతిపెద్ద జిల్లా ,35 లక్షల ఎకరాలకు పైగా సాగుకు యోగ్యమైన భూములు ఈ జిల్లాలో ఉన్నాయి. ఈ జిల్లా మీదుగానే కృష్ణమ్మ, తుంగభద్ర ఇంకోపక్క దుందుభి నదిలు ప్రవహిస్తాయి, అపారమైనటువంటి నీటి వనరులు ఉన్నా కానీ, ఈ జిల్లాకు పంటలు పండించేందుకు సాగు నీరు అందేది కాదు .గత పాలకుల నిర్లక్ష్యానికి పాలమూరు కరువుకు కాటకాలకు నిలయంగా మారింది .దేశవ్యాప్తంగా  వెనుకబడిన జిల్లాలుగా 9 ఉన్నాయి.అందులో ఉమ్మడి మహబూబ్నగర్‌ ‌జిల్లా ఒకటి ఉందంటే ,ఎంత దుస్థితి దుర్భిక్ష , పరిస్థితి నెలకొన్నదని అర్థం చేసుకోవచ్చు.

ఈ నేపథ్యంలోనే ప్రత్యేక రాష్ట్ర సాధనలో పాలమూరు ప్రజల గోస అంతా ఇంత కాదు, అది గుర్తించిన రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్‌, ‌పాలమూరు దశ మార్చేందుకు,  పాలమూరులో పసిడి పంటలు పండిం చేందుకు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని  రూపొందించారు.ఈ పథకం ద్వారా శ్రీశైలం రిజర్వాయర్‌ ‌బ్యాక్‌ ‌వాటర్‌ ‌నుండి , నార్లాపూర్‌ ,ఏదుల వట్టెం ,కరువేనా, ఉదండాపూర్‌,  ‌రిజర్వాయర్ల తో  నీటిని ఎత్తిపోసేందుకు ,4 పంపింగ్‌ ‌స్టేషన్లో ప్రభుత్వం, 21 ప్యాకేజీల కింద విభజించారు .అందులో నార్లాపూర్‌ ‌నుండి ఉదండాపూర్‌ ‌వరకు 18 ప్యాకేజీల పనులను చేపట్టడం జరిగింది నార్లాపూర్‌ ఏదుల  పంపు హౌస్‌ ‌పనుల్లో దాదాపు 90 శాతం పైగా పంపుల అమరిక ప్రక్రియ పూర్తి స్థాయిలో పనులు జరిగాయి.. నార్లాపూర్‌ ఏదుల వట్టెం పంప్‌ ‌హౌస్‌ల పనులు తుది దశకు చేరుకున్నాయి.. నార్లాపూర్‌ ‌పంపు హౌస్‌ ‌వద్ద అమర్చినటువంటి మొదటి పంపు ,ఈనెల మూడవ తేదీన సంబంధిత శాఖ అధికారులు ,నిర్వహించిన డ్రై రన్‌ ‌విజయవంతమైంది . ఈ డ్రైవర్‌ ‌కు  రాష్ట్ర సాగునీటి పారుదల శాఖ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌ ‌కుమార్‌ ‌హాజరయ్యారు .

ప్రభుత్వ అధికారుల నివేదిక ప్రకారం.రాబోవు 50 రోజుల సమయంలో, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ద్వారా,  ఉమ్మడి మహబూబ్నగర్‌ ‌రంగారెడ్డి జిల్లాలోని ఆరు జిల్లాలలో, 70 మండలాలు ,1226 గ్రామాలకు తాగునీరు,   12.30 లక్షల ఎకరాలకు ,సాగునీరు  అందించే విధంగా ముమ్మరంగా పనులు చేపడుతున్నట్టు అధికారులు తెలిపారు.ఈనెల 16వ తేదీ శనివారం నాడు, ముఖ్యమంత్రి కెసిఆర్‌ ‌చేతుల మీదుగా, నార్లాపూర్‌ ఇం‌టెక్‌ ‌వద్ద వెట్‌ ‌రన్‌ ‌ప్రారంభిం చబోతున్నారు. అలాగే ప్రాజెక్టు జాతికి అంకితం చేస్తున్నారు. దశాబ్దాల కాలంనాటి  నుండి వేచి చూస్తున్న, దక్షిణ తెలంగాణ వాసులకు, రైతాంగానికి ఇది ఒక గొప్ప పండుగల భావిస్తున్నారు. ప్రపంచంలోనే ఎక్కడ లేని విధంగా ఉన్నటువంటి బాహుబలి 145 మెగా వాట్ల సామర్థ్యం మోటార్ల, ఆసియాలోని అతి పెద్దదైన సర్జి ఫుల్‌ ‌పంపులతో ,కృష్ణమ్మ జలాలను ఎత్తిపోయనున్నారు.

image.png
పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ఏర్పడింది ఇలా…

20 15 సంవత్సరం జూన్‌ 11 ‌న మహబూబ్నగర్‌ ‌జిల్లా భూత్పూర్‌ ‌కర్వేనా  వద్ద, సీఎం కేసీఆర్‌ ‌పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పైలాన్‌ ఆవిష్కరించి శంకుస్థాపన చేశారు . 35200 కోట్లు తాత్కాలిక అంచనా బడ్జెట్‌ ‌తో మొదలుపెట్టారు .ఆరు రిజర్వాయర్లు5 ఎత్తిపోతలతో ప్రణాళికలు రూపొం దించారు. ప్రస్తుతం మాత్రం ఐదు రిజర్వాయర్లతో నాలుగు ఎత్తిపోతల తో  పనులను చేస్తున్నారు.

పథకం ముఖ్య లక్షణాలు
మహబూబ్నగర్‌ ‌జిల్లా తో పాటు, రంగారెడ్డి జిల్లా, పరిశ్రమల సాగు, తాగు నీరు కోసం లక్ష్యంగా చేపట్టారు.శ్రీశైలం రిజర్వాయర్‌ ‌నుండి కృష్ణ నది జలాలను, 60 రోజుల్లో 90 టీఎంసీల వరద నీటిని ఎత్తిపోసేలా పథకం రూపొందించారు.వీటిని ఫేస్‌ ‌వన్‌ ‌ఫేస్‌ ‌టు భాగాలుగా విభజించారు.ఫేస్‌ ‌వన్‌ ‌లో శ్రీశైలం రిజర్వాయర్‌ ‌ముందు భాగం నుండి, కృష్ణ నీటిని ఆరు జిల్లాలోని, 70 మండలాలు, 1226 గ్రామాలకు, తాగు నీరు అందించేందుకు ,ఫేస్‌ ‌టు శ్రీశైలం రిజర్వాయర్‌ ‌బ్యాక్‌ ‌వాటర్‌ ‌నుండి, 12.30 లక్షల ఎకరాలకు, సాగునీరు అందించనున్నారు. ప్రస్తుతం 5 రిజర్వాయర్లతో నాలుగు పంపింగ్‌ ‌హౌసులు పనులు వేగవంతంగా సాగుతున్నాయి .రిజర్వాయర్‌ ‌స్థూల సామర్థ్యం 67.67 టీఎంసీలు. పంపుల గరిష్ట సామర్థ్యం 145  మెగావాట్లు.కాలువల మొత్తం పొడవు 30. 415 కిలోమీటర్లు. టన్నల్‌ ‌సొరంగం పొడవు 95. 7.774 కిలోమీటర్ల.  ప్రతి పంపు కెపాసిటీ 85 క్యూ మ్యాక్స్ ‌లు.నార్లాపూర్‌ ‌మొదటి రిజర్వాయర్‌ అం‌జనగిరి నీటి నిలువ సామ ర్థ్యం 6.40 టీఎంసీలు. కాలువ 8.325 కిలోమీటర్లు.ఏదుల  వీరాంజనేయ రిజర్వాయర్‌ 6.5 5 ‌టీఎంసీల నీటి నిలువ సామర్థ్యం .వట్టెం వెంకటాద్రి రిజర్వాయర్‌ 16.74 ‌టీఎంసీల నీటి నిలువ సామర్థ్యం,12.05 కిలోమీటర్ల కాలువ.కరివేన రిజర్వాయర్‌ 19.0 ‌టిఎంసిల నీటి నిలువ సామర్థ్యం.ఉదండాపూర్‌ ‌రిజర్వాయర్‌ 16.03 ‌టీఎంసీల నీటి నిలువ సామర్థ్యం.ప్రతిరోజు రెండు టీఎంసీల నీటిని ఆరు జిల్లాలకు, పంపిణీ చేసే విధంగా ప్రణాళికను రూపొందించారు.

జిల్లాల వారిగా ఆయకట్టు వివరాలు.
నాగర్‌ ‌కర్నూల్‌ ‌జిల్లా 1.03 లక్షల ఎకరాలు.మహబూబ్నగర్‌ ‌జిల్లా 2.35 లక్షల ఎకరాలు. నారాయణపేట జిల్లా 1.6లక్షల ఎకరాలు. వికారాబాద్‌ ‌జిల్లా 3. 41 లక్షల ఎకరాలు.రంగారెడ్డి జిల్లా 3.59 లక్షల ఎకరాలు.నల్గొండ 0.29 లక్షల ఎకరాలు.
ప్రాజెక్టుకు సంబంధించిన
భూ సేకరణ వివరాలు.
27,047 ఎకరాల భూ సేకరణ  ప్రాజెక్టు నిర్మాణానికి అవసరం.ఇప్పటివరకు 26,872 ఎకరాల భూసేకరణ జరిగింది.175 ఎకరాలు భూసేకరణ జరగాల్సి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page