- రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం…జిఓ జారీ
- దర్యాప్తు చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వ అనుమతి తప్పనిసరి
హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 30 : రాష్ట్రంలో సిబిఐ నేరుగా దర్యాప్తు చేసుకోవడానికి ఇదివరకు ఉన్న అనుమతిని రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకుంటూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆదివారం జీఓ 51ని జారీ చేశారు. గతంలో సిబిఐకి ఇచ్చిన అనుమతిని రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకుంది.
ఇక నుంచి రాష్ట్రంలో ఏ కేసులోనైనా దర్యాప్తు చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వ అనుమతి తీసుకోవాలని జీఓలో పేర్కొంది. ఇటీవల రాష్ట్రంలో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అయితే ఈ నిర్ణయం రెండు నెలల కిందనే తీసుకున్నట్లు తెలుస్తున్నది.