ఇంటింటికి ఉద్యోగమని పదేళ్లు బిఆర్‌ఎస్ మోసం
విమర్శలు తిప్పికొట్టిన మంత్రి సీతక్క
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 31 : ఇచ్చిన హావిూలు ఒక్కొకటి నెరవేరుస్తున్నామని..తమ పాలనతో ప్రజలు సంతృప్తిగా ఉన్నారని..తాముసరిjైున పాలన చేయకపోతే ప్రజలు బుద్ది చెబుతారని.. ప్రతిపక్ష నేతలు కొంచం ఓపికగా ఉండండాలని మంత్రి సీతక్క సూచించారు. పదేళ్లగా వారు పాలన సరిగా చేయలేదనే ప్రజలు తమను ఎన్నుకున్నారని, పదినెలలు కూడా కాకుండానే విమర్శలు చేస్తే ఎలా అని సీతక్క నిలదీశారు. ఇంటింటికీ ఉద్యోగం పేరుతో పదేళ్లపాటు బీఆర్‌ఎస్ మోసం చేసిందని.. దీంతో పదేళ్ల పాటు ఓయూకు వెళ్లలేని పరిస్థితి తెచ్చుకున్నారని ప్రభుత్వంపై కెటిఆర్ విమర్శలపై మంత్రి సీతక్క ఎద్దేవా చేశారు. పదేళ్లు అధికారంలో ఉన్నా.. ఎందుకు ఉద్యోగాలు ఇవ్వలేదని మంత్రి ప్రశ్నించారు. వారి ఉద్యోగాల వ్యవహారం కోట శ్రీనివాసరావు కోడి కథలా ఉందన్నారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఏడో రోజూ వాడీ వేడీగానే ప్రారంభమయ్యాయి.
ద్రవ్య వినిమయ బిల్లుకుపై సభలో చర్చ సందర్భంగా కేటీఆర్ వర్సెస్ మంత్రుల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. ఈ సందర్భంగా కేటీఆర్ చేసిన వ్యాఖ్యాలపై మంత్రి సీతక్క మాట్లాడుతూ..అశా వర్కర్లు, అంగన్‌వాడీల తల్లిదండ్రుల పింఛను గత ప్రభుత్వం తొలగించిందని, చిరుద్యోగుల తల్లిదండ్రుల పింఛను తీసేసింది బీఆర్‌ఎస్ ప్రభుత్వమేనని తీవ్రస్థాయిలో ఆరోపించారు. ధరణి పేరుతో పేదలకు పట్టాలు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టారని, ప్రభుత్వ వేధింపులు తట్టుకోలేకే ప్రజలు కాంగ్రెస్ పట్టం కట్టారని అన్నారామె. బీఆర్‌ఎస్ పాలనలో పేదలకు ఇళ్లు కూడా ఇవ్వలేదని, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు నెలలపాటు జీతాలు ఇవ్వలేదని మంత్రి సీతక్క విమర్శించారు.
కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు శ్రీధర్ బాబు కౌంటర్ ఇస్తూ.. కేటీఆర్ సత్యదూరంగా మాట్లాడుతున్నారని.. బీఆర్‌ఎస్ కూడా తమకు పోటీగా హావిూలు ఇచ్చిందన్నారు. కానీ ప్రజలు వారిని నమ్మలేదన్నారు. కాంగ్రెస్‌తోనే మార్పు సాధ్యమని ప్రజలు నమ్మారన్నారు. తమను గెలిపించారని.. వారిని ప్రతిపక్షంలో కూర్చోబెట్టారన్నారు. దళితుడిని సీఎం చేస్తామని చెప్పి ఆ హావిూని తుంగలో తొక్కారన్నారు. వారికి సామాజిక న్యాయం గురించి మాట్లాడే హక్కు ఉందా..అంటూ శ్రీధర్ బాబు ప్రశ్నించారు. మొదటి బడ్జెట్‌కే ఇంత భయపడితే.. మరో నాలుగు బడ్జెట్‌లు ప్రవేశ పెడితే ఎంత భయపడతారని శ్రీధర్ బాబు ప్రశ్నించారు.