వికారాబాద్, ఆగస్టు 8: ఉమ్మడి రంగారెడ్డి జిల్లా లో డీఈఈ సెట్ – 2023 లో ఉతీర్ణత సాధించి హాజరు కాని వారికి మరొకసారి అవకాశము కల్పిస్తున్నట్లు ప్రభుత్వ డైట్ కళాశాల ప్రిన్సిపాల్ కే.రామచారి ఒక ప్రకటనలో తెలిపారు. ఆగస్టు 10, 11 రెండు రోజులు కేటాయించిన తేదిలలో కౌన్సిలింగ్ హాజరు కావాల్సిందిగా ఆయన తెలిపారు. మొదటి సంవత్సరం తెలుగు, ఉర్దూ, ఇంగ్లీష్ మీడియం లో 2023-25 ప్రవేశాల నిమిత్తం ఒరిజినల్ ద్రువపత్రాలను పరిశీలించనున్నట్లు ఆయన పేర్కొనారు. ర్యాంక్ కార్డు, హాల్ టికెట్, ఎస్.ఎస్.సీ, ఇంటర్ మెమోలు, 4 నుండి 10వ తరగతి వరకు స్టడీ సర్టిఫికేట్లు, ఆదాయం, కుల తదితర ఒరిజినల్ ధ్రువపత్రాలతో వికారాబాద్ డైట్ కళాశాలకు హాజరుకావలని ఆయన ఆ ప్రకటనలో తెలిపారు.