తప్పుడు రిఫండ్ క్లెయిమ్స్ చేస్తే చట్టపరమైన చర్యలు
•బోగస్ చేయరాదు : ఆదాయపన్ను శాఖ జాయింట్ కమిషనర్ అశిష్ కుమార్ శుక్ల
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 25:పన్ను చెల్లింపు దారులు ఎలాంటి తప్పుడు క్లెయిమ్స్ చేయరాదని, నిబంధనల మేరకు ఐటీఆర్ (ఇన్కమ్ టాక్స్ రిటర్నస్) ఫైలింగ్ చేయాలని ఆదాయపన్ను శాఖ జాయింట్ కమిషనర్ ఆశిష్ కుమార్ శుక్ల సూచించారు.
గురువారం ఆదాయ పన్ను శాఖ అధికారులు జిహెచ్ఎంసి ప్రధాన కార్యాలయంలోని సమావేశ మందిరంలో జిహెచ్ఎంసి లోని వివిధ విభాగాల డ్రాయింగ్ అండ్ డిస్బర్ సింగ్ అధికారులు, జోనల్, సర్కిల్ అధికారులు, ఎస్టాబ్లిష్మెంట్ క్లర్కులకు ఐ టి ఆర్ ఫైలింగ్, టాక్సీ చెల్లింపుదారుల బాధ్యతలు, పన్ను ఎగవేత, తప్పుడు రిఫండ్ క్లెయిమ్స్ పై ఐటీ నిబంధనల మేరకు గల చర్యలు, ఇన్కమ్ ఫైలింగ్ తదితర అంశాలపై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా ఆశిష్ కుమార్ శుక్లా మాట్లాడుతూ… ఇన్కమ్ ఫైలింగ్ లో అన్ని రకాల ఆదాయ వివరాలు ఇవ్వాలని, మినహాయింపులు, డిడక్షన్ కు సంబంధించిన డాక్యుమెంట్లు డి డి ఓ కు సమర్పించాలన్నారు. ఎలాంటి తప్పుడు వివరాలు ఇవ్వకూడదన్నారు. అదేవిధంగా ఐ టి ఆర్ ఫైలింగ్ చేసేటప్పుడు క్రాస్ చెక్ చేసుకోవాలని సూచించారు. కొత్త/పాత రీజిమ్ లో ఆదాయ పన్ను రిటన్ దాఖలు చేసుకోవచ్చని తెలిపారు.
ఐటిఆర్ ను ఈ నెల 31 వ తేదీ లోపు సమర్పించాలని, ఐ టి ఆర్ సమర్పణలో డాక్యుమెంటేషన్ ప్రాపర్ గా సమర్పించాలన్నారు.
ఉద్యోగులకు సంబంధించి టోటల్ ఇన్కమ్, డిడక్షన్స్ తదితరాలను పూర్తిగా ఆయా డి డి ఓ లు పరిశీలించాలన్నారు. ప్రాపర్ గా కరెక్ట్ ఐ.టి.ఆర్ ఫైలింగ్ చేసి సమర్పించాలని సూచించారు. ఏవేని సందేహాలు ఉన్నట్లయితే బషీర్బాగ్ లో గల తమ కార్యాలయానికి నేరుగా వచ్చి తమ సందేహాలు నివృత్తి చేసుకోవచ్చని తెలిపారు. అనంతరం పలువురు అధికారులు, ఉద్యోగులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పి సందేహాలను నివృత్తి చేశారు.
ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసి అడిషనల్ కమిషనర్లు నళిని పద్మావతి, గీతా రాధిక, చీఫ్ ఎగ్జామినర్ ఆఫ్ అకౌంట్స్ ఆఫీసర్ వెంకటేశ్వర రెడ్డి, ఆదాయ పన్ను శాఖ అధికారులు వేణుగోపాల్, వందన, జిహెచ్ఎంసి వివిధ విభాగాల అధికారులు, జోనల్, సర్కిల్ అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.
– సిపిఆర్ఓ జిహెచ్ఎంసి ద్వారా జారీచేయడమైనది.