ముషీరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 05 : ఛలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయ వంతం చేయాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం కోరారు. కాచిగూడలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు ఆర్.కృష్ణయ్య ఆధ్వర్యంలో గుజ్జ సత్యం జాతీయ ఉపాధ్యక్షులు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షతన బీసీల మహా ధర్నా నిర్వహిస్తున్నట్టు తెలియజేశారు. చట్టసభలో బీసీల రిజర్వేషన్లు 52 శాతం కల్పించాలని, బీసీల హక్కులను ఉద్యోగుల ప్రమోషన్లు అమలు చేయాలని, బీసీ క్రిమిలేయరును ఎత్తి వేయాలని ఆగష్టు 8, 9వ తేదీల్లో ఢిల్లీలో భారీఎత్తున నిరసన చేపట్టనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమానికి పొరుగు రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటక, ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని అన్ని జిల్లాల నుంచి 5000 మందికి పైగా భారీ ఎత్తున తరలివ స్తున్నారని తెలిపారు. ప్రతి ఒక్కరూ హాజరై బీసీ సమస్యలపై కేంద్ర ప్రభుత్వ మొండి వైఖరిపై పోరాటానికి సిద్దం కావాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు చౌటుపల్లి సురేష్, తెలంగాణ రాష్ట్ర మీడియా కో-ఆర్డినేటర్ జలపల్లి కిరణ్, గ్రేటర్ ఉపాధ్యక్షులు పండరినాథ్, జయరాజ్ వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.