పెన్షన్లు ఎందుకు ఇవ్వొద్దో ప్రశ్నించండి•
ప్రజలకు సంక్షేమం కోసం పాటు పడడం ఉచితమా?
బిజెపి తీరుపై మండిపడ్డ మంత్రి హరీష్ రావు
మెదక్ జిల్లాలో పెన్షన్ల పంపిణీ
నాణ్యమైన ఆహార పదార్థాలు అందించడమే లక్ష్యం : తూప్రాన్‌లో వెజ్, నాన్‌వెజ్ మార్కెట్ ప్రారంభించిన మంత్రి హరీష్ రావు
మెదక్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 2 : ఉచితాలు వొద్దంటున్న బీజేపీకి బుద్ధి చెప్పాలని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఎందుకు వద్దంటున్నారో కూడా నిలదీయాలన్నారు. పెన్షన్లు తదితరాలను ఉచితాలం టారా అని ఆయన ప్రశ్నించారు. ప్రజలను ఆదుకోవడం ఉచితమెలా అవుతుందో అడగాలన్నారు. మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలంలో నూతన ఆసరా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి బిజెపి తీరును దుయ్యబట్టారు. కొత్తగా ఆసరా పింఛన్లు అందుకుంటున్న 584 మందికి శుభాకాంక్షలు తెలుపుతూ.. ఇక నుంచి వి•కు నెల నెల రూ. 2,016 అందుతాయన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వి•కు పింఛన్ రు. 75 ఉండే. ఎవరైనా చనిపోతేనే తప్ప వారి స్థానంలో నాడు కొత్తవి వొచ్చేవి కావు. ఆ తర్వాత వొచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం 200 చేసింది. కానీ ఒంటరి మహిళలకు, చేనేత, గౌడ పింఛన్లు ఇవ్వలేదన్నారు. కానీ, టీఆర్‌ఎస్ ప్రభుత్వం మాత్రం ఏకంగా 10 ఇంతలు పెంచి, రు. 2,016 చేసిందన్నారు. అర్హులైన ప్రతి పేదవాడికి ఇస్తామని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి స్పష్టం చేశారు. కన్న కొడుకు చీరకొని ఇవ్వకపోయినా పెద్ద కొడుకు సీఎం కేసీఆర్ బతుకమ్మ చీర ఇస్తున్నరని గుర్తు చేశారు. బిడ్డ పెళ్లికి కల్యాణ లక్ష్మి ఇస్తున్నరు. మాకు కులం లేదు, మతం లేదు. పేదలందరికీ భరోసా ఇవ్వడమే మా ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు. దిల్లీలో కూర్చున్న వారు కాళేశ్వరం వి•ద విమర్శలు చేస్తరు. భూమికి బరువయ్యే పంట పండుతుంది.
కేసీఆర్ రైతు పక్షపాతి కాబట్టి ఇది సాధ్యం అయ్యిందన్నారు. కొంత మంది ఉచితాలు వద్దు అంటారు. అలాంటి వారికి వోటుతో గుణపాఠం చెప్పాలన్నారు. కాంగ్రెస్ జమానాలో ఉచిత కరెంట్ కాదుకదా..ఉత్త కరెంట్ కూడా ఉండేది కాదని ఎద్దేవా చేశారు. పేదలకు అన్నివిధాలా అండగా నిలుస్తూ సీఎం కేసీఆర్ పెద్దన్న పాత్ర పోషిస్తున్నారని మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. పేదలకు ఒక్కొక్కరికీ 10 కిలోల రేషన్ బియ్యం, రూ.2016 పింఛన్ ఇస్తూ కడుపు నిండా అన్నం పెడుతున్న మహానుభావుడు కేసీఆర్ అని తెలిపారు. ఆసరా పింఛన్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెలా రూ.1000 కోట్ల చొప్పున యేడాదికి రూ.12 వేల కోట్లు ఖర్చు చేస్తున్నదని గుర్తు చేశారు. ప్రతి నెలా ఒకటో తేదీన ఖాతాల్లో పింఛన్ డబ్బులు జమ అవుతున్నాయన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా రూ.2016 పింఛన్ ఇస్తున్న ఘనత తెలంగాణ ప్రభుత్వానిదన్నారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన హావి• మేరకు 57 యేండ్లు నిండిన వారందరికీ పింఛన్లు ఇచ్చి మాట నిలబెట్టుకున్నారన్నారు. వి•రు కూడా ప్రభుత్వానికి అండగా నిలువాలన్నారు. టీడీపీ, కాంగ్రెస్ హయాంలలో రాష్ట్ర వ్యాప్తంగా కేవలం 25 వేల పింఛన్లు ఉంటే, తెలంగాణ ప్రభుత్వం వొచ్చాక 45 లక్షల మందికి ఇస్తున్నామని అన్నారు. పింఛన్లు రాని అర్హులు ఎవరైనా ఉంటే, వారికీ మంజూరు చేస్తామని హావి• ఇచ్చారు. ఇంటి జాగ ఉన్న నిరుపేదలు ఇల్లు నిర్మించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం దసరా నుంచి ఆర్థిక సాయం అంజేస్తుందని మంత్రి వెల్లడించారు. ఈ పథకాన్ని సీఎం కేసీఆర్ ఇప్పటికే ప్రకటించారని, దసరా నుంచి అమలు చేస్తారని అన్నారు. ఇప్పటికే ఇల్లులేని పేదల కోసం డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మించామన్నారు. దేశం గర్వించేలా ముఖ్యమంత్రి కేసీఆర్ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని మంత్రి హరీష్ రావు అన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ పేదల సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తున్నారన్నారు. కొత్త పింఛన్లతో వృద్ధుల ఆత్మగౌరవాన్ని పెంచిన ఘనత సీఎంకే దక్కిందన్నారు. ఉత్తమ పంచాయతీల్లో తెలంగాణ రాష్ట్రం ముందున్న సంగతి గుర్తుంచుకోవాలని సూచించారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఇలాంటి సంక్షేమ కార్యక్రమాలు లేవన్నారు. కార్యక్రమంలో ఎంపి కొత్త ప్రభాకర్ రెడ్డి, వంటేరు ప్రతాపరెడ్డి, ఎలక్షన్ రెడ్డి, ఇతర నాయకులు, అధికారులు పాల్గొన్నారు.
నాణ్యమైన ఆహార పదార్థాలు అందించడమే లక్ష్యం : వెజ్, నాన్‌వెజ్ మార్కెట్ ప్రారంభించిన మంత్రి హరీష్ రావు
ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరిచి, నాణ్యమైన ఆహార పదార్థాలను అందించాలనే ఉద్దేశంతో ప్రతి మున్సిపల్ కేంద్రంలో వెజ్, నాన్ వెజ్ మార్కెట్లను ఏర్పాటు చేస్తున్నామని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. శుక్రవారం తూప్రాన్ మున్సిపాలిటీలో రూ.11 కోట్ల వ్యయంతో నిర్మించిన వెజ్, నాన్ వెజ్ మార్కెట్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం రూ.500 కోట్ల వ్యయంతో రాష్ట్రంలోని ప్రతి మున్సిపాలిటీలో వెజ్, నాన్ వెజ్ మార్కెట్లను నిర్మిస్తున్నదని అన్నారు. ఇక్కడ ఏర్పాటు చేసిన మార్కెట్లో దుమ్ము, ధూళి వంటివి ఆహార పదార్థాలపై పడకుండా నాలుగు ఫీట్ల ఎత్తున స్టాల్స్ ను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. త్వరలో సూపర్ మార్కెట్ ఏర్పాటు చేస్తామని మంత్రి హావి•నిచ్చారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని, కోల్డ్ స్టోరేజీలు కూడ ఏర్పాటు చేశామని విక్రయ దారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి సూచించారు. పాలు, పండ్లు, కూరగాయలు, మాంసం, చికెన్, చేపల విక్రయాలు ఈ మార్కెట్ పరిధిలోనే జరగాలన్నారు. బయట విక్రయించరాదని, ప్రజలు కూడా ఇందుకు సహకరించాలని ఆయన కోరారు. త్వరలో ఇక్కడ బ్యాంకు, ఏటీఏం సౌకర్యం కూడా కల్పిస్తామన్నారు. మార్కెట్ ప్రాంగణాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆయన హితవు పలికారు. ఈ కార్యక్రమంలో ఎంపి కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎలోన్ రెడ్డి, వంటేరు ప్రతాప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.