ఉద్యమానికి అండగా నిలిచిన గడ్డ… సిద్ధిపేట

ఎమ్మెల్యేగా గెలిపించి సిఎంను చేసిన గడ్డ గజ్వేల్‌
‌దేశానికి ఆదర్శంగా గజ్వేల్‌ను తీర్చిదిద్దాను
•ఇక్కడి అభివృద్ధిని ప్రతి ఒక్కరూ గుర్తిస్తున్నారు
•మరింతగా అభివృద్ద్ధితో ముందుకు…
•ఇందిరమ్మ రాజ్యం తెస్తామంటున్న కాంగ్రెస్‌ ‌గెలిచేది లేదు…సచ్చేది లేదు
•మనకు ఒక్క పని చేయని బిజెపికి వోటేసి తప్పు చేయొద్దు
•గజ్వేల్‌లో చివరి ప్రజా ఆశీర్వాద సభలో సిఎం కెసిఆర్‌

‌గజ్వేల్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 28 : ‌తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించిన తర్వాత ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించేందుకు తనకు బలాన్ని ఇచ్చిన గడ్డ సిద్దిపేట అయితే…ఆ తర్వాత.. సాధించిన తెలంగాణను తీర్చిదిద్దడం కోసం తనను ఎమ్మెల్యేను చేసి, రాష్ట్ర ముఖ్యమంత్రిని చేసిన గడ్డ గజ్వేల్‌ అని సిఎం కెసిఆర్‌ అన్నారు. గజ్వేల్‌ ‌తన గౌరవాన్ని పెంచి తనను ఈ స్థాయికి తెచ్చిందన్నారు. గత తొమ్మిదిన్నర ఏండ్లుగా తాను గజ్వేల్‌ ‌ప్రాంతం అభివృద్ధికి శాయశక్తులా కృషి చేశానని అన్నారు. తనకు ముందు మాట్లాడిన ప్రతాప రెడ్డి అన్ని వివరించాడని, తాను మళ్లా అవన్నీ చెప్పాల్సిన అవసరం లేదని, అయితే గతంలో మంచి నీళ్ల కోసం నానా ఇబ్బందులు పడిన గజ్వేల్‌కు శాశ్వతంగా ఆ బాధ తీరిపోయిందని, సాగు నీటి కోసం ఎన్నో ఇబ్బందులు పడిన గజ్వేల్‌కు ప్రాజెక్టులు, కాలువలు రావడంతో ఆ బాధ కూడా తీరిపోయిందని సీఎం అన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌గజ్వేల్‌ ‌నియోజకవర్గాన్ని పొగడ్తల్లో ముంచెత్తారు.

గజ్వేల్‌ ‌నియోజక వర్గంపై తనకు ఉన్న అభిమానాన్ని, మమకారాన్ని చాటుకున్నారు. గజ్వేల్‌ ‌తన గౌరవాన్ని పెంచిందని, తనను ఈ స్థాయికి తెచ్చిందని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం గజ్వే ల్‌లో జరిగిన చివరి ప్రజా ఆశీర్వాద సభ లో సీఎం ప్రసం గిస్తూ…‘మన గజ్వే ల్‌కు రైలు వొస్తదని ఎన్నడూ అనుకోలేదు, కానీ రైలు కూడా వొచ్చేసింది. గజ్వేల్‌ ఒక గుర్తింపు కలిగిన నియోజకవర్గంగా ఎదిగింది. ఇతర దేశాలు, రాష్ట్రాల నుంచి గజ్వేల్‌ ‌మోడల్‌ అభివృద్ధిని చూడటానికి వొస్తున్నరు. మన ఇంటిగ్రేటెడ్‌ ‌మార్కెట్‌ ‌కావొచ్చు, మన అడవుల పునరుద్ధరణ కావొచ్చు, మన మల్లన్నసాగర్‌ ‌ప్రాజెక్టు కావొచ్చు.. ఇట్ల అనేక రకాల పనులను చూడటానికి ఇయ్యాల గజ్వేల్‌కు వొస్తున్నరు. మిషన్‌ ‌భగీరథ పథకాన్ని గురించి తెలుసుకోవడానికి కోమటి బండకు రాని రాష్ట్రమే భారత దేశంలో లేదు. అన్నింటి కంటే ముఖ్యంగా ఇప్పుడు మనం తాగుతున్నది, సాగుకు వినియోగిస్తున్నది మనందరం ఎంతో పవిత్రంగా భావించే గోదావరి జలాలు. ఇలా ఒక రోల్‌ ‌మోడల్‌గా గజ్వేల్‌ ఎదిగింది. అయితే ఇప్పటికే అయ్యింది చాలా గొప్ప అని మనం సంతోషపడితే కాదు, ఇంకా చాలా అభివృద్ధి కావాల్సి ఉంది’ అని అన్నారు. గత 24 ఏండ్లుగా తెలంగాణ ఆశగా, శ్వాసగా బతుకుతున్నానని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌స్పష్టం చేశారు.

గజ్వేల్‌ ‌నుంచి రు అవకాశం ఇచ్చి రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేసి పంపిస్తే ఈ రాష్ట్రం కోసం కష్టపడ్డాను, కృషి చేశాను. అవన్నీ ప్రజల కండ్ల ముందు కనబడుతున్నాయి…అని కేసీఆర్‌ ‌తెలిపారు. ఈ నియోజకవర్గం నుంచి కేసీఆర్‌ ‌పోటీలో ఉన్నారు. ఈ ఎన్నికల్లో ఇది నా చివరి సభ…ఇది 96వ సభ. తెలంగాణ రాష్ట్రం గురించి కూడా ఒకసారి చెప్పాలి. గజ్వేల్‌ ‌నుంచి రు అవకాశం ఇచ్చి రాష్ట్రాన్రికి ముఖ్యమంత్రిని చేసి పంపిస్తే ఈ రాష్ట్రం కోసం కష్టపడ్డాను. కృషి చేశాను. అవన్నీ ప్రజల కండ్ల ముందు కనబడుతున్నాయి. ఇక్కడ వొచ్చేటటువంటి ట్రిపుల్‌ ఆర్‌ ‌కూడా మన గజ్వేల్‌ ‌దుగానే రాబోతుందని సంతోషంగా తెలియజేస్తున్నా. 24 ఏండ్లుగా తెలంగాణనే ఆశగా, శ్వాసగా బతుకుతున్నాను. ఆ విషయం  అందరికి తెలుసు…అని కేసీఆర్‌ ‌పేర్కొన్నారు. ఉద్యమ సందర్భంలో తెలంగాణ ఎట్ల తేవాలని ఆరాట పడ్డాను. పోరాటం చేశాను.

కాంగ్రెస్‌ ‌పార్టీ మోసం చేసినా తట్టుకుని, నిలబడి, మొండిగా, చివరకి మళ్లీ ధోకా చేశారని గుర్తించి, ఇక తప్పదనే నమ్మకానికి వొచ్చి కేసీఆర్‌ ‌సచ్చుడో.. తెలంగాణ వొచ్చుడో అని ఆమరణ దీక్ష చేస్తే, 33 పార్టీలు మనకు అండగా వొస్తే అప్పుడు దిగొచ్చింది ఈ కాంగ్రెస్‌ ‌పార్టీ. ఇవాళ కాంగ్రెస్‌ ‌పార్టీ అనేక విషయాలు మాట్లాడుతుంది. మేం గెలిస్తే మళ్ల ఇందిరమ్మ రాజ్యం తెస్తమని చెబుతున్నారు. ఇందిరమ్మ రాజ్యం ఎవరికి కావాలి ఇప్పుడు. అసలు నాకర్థం కాదు. ఇందిరమ్మ రాజ్యం సక్కగా ఉంటే ఎన్టీ రామారావు పార్టీ పెట్టి 2 రూపాయాలకే కిలో బియ్యం ఎందుకు ఇయ్యాల్సి వొచ్చింది. అప్పటి వరకు మన రాష్ట్రం ఆకలి కడుపుతోనే ఉన్నది కదా..ఇందిరమ్మ రాజ్యంలో ఎమర్జెన్సీ రోజులు వొచ్చాయి. ఇందిరమ్మ రాజ్యంలోనే కదా ఎన్‌కౌంటర్లు, రక్తపాతం జరిగింది. మన తెలంగాణ ఉద్యమంలో 1969లో 400 మందిని కాల్చి చంపింది. ఇవన్నీ కావాలని మళ్లీ కోరుతున్నారు. ఇది ఎట్ల ఉందంటే తద్దినం ఉందని భోజనానికి పిలిస్తే రోజు  ఇంట్లో ఇట్లనే జరగాలని అన్నడట యెన్కటికి ఒకడు. ఇప్పుడు ఆ కాంగ్రెస్‌ ‌గెలిచేది లేదు సచ్చేది లేదు. కానీ గెలిస్తే మటుకు ఇందిరమ్మ రాజ్యం తెస్తమని మాట్లాడుతున్నానని కేసీఆర్‌ ‌ధ్వజమెత్తారు. బిజెపి ఒక్కటంటే ఒక్క పనిచేయని దానికి ఎందుకు వోటేయాలని అన్నారు. బిజెపికి వోటేసి తప్పు చేయొద్దన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page