ఉద్యమాల ముద్దుబిడ్డను ఒకసారి ఆశీర్వదించండి

ఆమనగల్లు, ప్రజాతంత్ర అక్టోబర్ 30 : మీలో ఒకరిగా ఉంటూ కల్వకుర్తి నియోజకవర్గ ప్రజల కోసం ఎన్నో ఉద్యమాలు పోరాటాలు చేసి గత 40 సంవత్సరాలుగా మీతో నడిచిన తనకు ఒకసారి అవకాశం ఇచ్చి ఎమ్మెల్యేగా గెలిపిస్తే నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరుస్తానని బిజెపి అభ్యర్థి తల్లోజు ఆచారి అన్నారు. సోమవారం కల్వకుర్తి పట్టణంలో ఎన్నికల ప్రచారాన్ని మాజీ మంత్రి చిత్తరంజన్ దాస్ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనేక సమస్యలపై పోరాటాలు చేస్తూనే ఉన్నానని ఐదు సార్లు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన అలసిపోయిన గుండె మీతో నడవాలని కోరుకుంటుందని ఈసారైనా తనను గెలిపించాలని ఆచారి ఓటర్లకు ప్రాధేయపడ్డారు. పట్టణంలోని భారీ ర్యాలీ నిర్వహించి ప్రతి షాపు కూరగాయల మార్కెట్లలో తిరుగుతూ ఓటు వేయాలని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు కండె హరిప్రసాద్, దుర్గ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page