ఉద్యమ స్ఫూర్తికి వ్యతిరేకంగా బిఆర్‌ఎస్‌ ‌పాలన

కేసీఆర్‌ ‌కోట్లు ఖర్చుపెట్టి మళ్లీ గెలవాలని చూస్తున్నడు
•ప్రాజెక్టుల పేరిట కోట్లు దండుకున్నడు
•రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు పెరిగినయ్‌….
•‌ధరణి పేరుతో పేదల భూములను గుంజుకున్నరు
•అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిండ్రు
•ప్రజా పాలనకు కాంగ్రెస్‌ను, రేవంత్‌ ‌రెడ్డిని గెలిపించండి
•కొడంగల్‌ ‌ప్రజా ఆశీర్వాద సభలో ప్రియాంకా గాంధీ
•రాష్ట్రంలో గడీల పాలన పోవాలంటే ఇందిరమ్మ రాజ్యం రావాలి
•కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే 6 గ్యారంటీల అమలు
•ఈ కొడంగల్‌ ‌గడ్డ…నా అడ్డా : పిసిసి చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి

ప్రజాతంత్ర, కొడంగల్‌, ‌నవంబర్‌ 27 : అమరుల త్యాగాల పునాదులపై ఏర్పడిన తెలంగాణలో ఉద్యమ స్ఫూర్తికి విరుద్ధంగా రాష్ట్రంలో దొరల పాలన సాగుతుందని కాంగ్రెస్‌ అ‌గ్రనేత ప్రియాంక గాంధీ పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం కొడంగల్‌లో కాంగ్రెస్‌ ‌విజయభేరి సభలో ఆమె మాట్లాడుతూ…రేవంత్‌ ‌రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. టిఆర్‌ఎస్‌, ‌బిజెపి ఒకరికొకరు సహాయం చేసుకుంటున్నారని ప్రియాంక గాంధీ ఆరోపించారు. కేసీఆర్‌ ‌కుటుంబం తెలంగాణ ప్రజల సొమ్మును దోచుకుందని ఆరోపించారు. టిఆర్‌ఎస్‌ ‌హయాంలో పేదలు, నిరుద్యోగుల సమస్యలు తీరలేదని, రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు పెరిగాయని దుయ్యబట్టారు. కెసిఆర్‌ అధికారంలోకి వొచ్చి పదేళ్లు గడిచినా నిరుద్యోగుల సమస్యలు తీరాయా… రైతుల కష్టాలు తీర్చారా…లంటూ ఆమె ప్రజలను ప్రశ్నించారు. సీఎం కేసీఆర్‌ ‌ప్రాజెక్టుల పేరుతో కమిషన్లు దండుకున్నారు తప్ప ప్రజలకు చేసింది.

దొరల పాలన పోవాలి ఇందిరమ్మ రాజ్యం రావాలి
కొడంగల్‌ ‌సభలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ ‌రెడ్డి

రాష్ట్రంలో దొరల, గడీల పాలన పోవాలి… ఇందిరమ్మ రాజ్యం రావాలి అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ ‌రెడ్డి వ్యాఖ్యానించారు. సోమవారం కొడంగల్‌ ‌నియోజకవర్గంలో జరిగిన విజయభేరి సభలో రేవంత్‌ ‌రెడ్డి ప్రసంగించారు. కొడంగల్‌ ‌నాకు అస్థిత్వాన్ని ఇచ్చింది.. పోరాటాన్ని నేర్పింది..20 ఏండ్లు రైతులు, విద్యార్థులు, నిరుద్యోగుల పక్షాన పోరాడే ధైర్యాన్ని ఇచ్చిందన్నారు రేవంత్‌ ‌రెడ్డి. తల తెగి కింద పడ్డా.. ఎవరి ముందు లొంగకుండా ఉండేలా ఈ కొడంగల్‌ ‌గడ్డ నాకు నేర్పింది. మీరు అండగా ఉంటే.. అది నరేంద్ర మోడీ అయినా, కేసీఆర్‌ అయినా కోట్లాడి వాళ్ల మెడలు వంచే బాధ్యత నాదన్నారు. ఈ కొడంగల్‌ ‌గడ్డ… నా అడ్డా..మీ బిడ్డ.. మీరు నాటిన మొక్క… రాష్ట్రానికి నాయకత్వం వహించే స్థాయికి ఎదిగింది. మీరు పెంచిన ఈ చెట్టును నరికెందుకు కేసీఆర్‌, ‌మోదీ భుజాన గొడ్డలి వేసేందుకు బయలుదేరిండ్రు అని వ్యాఖ్యానించారు.

‘‘నేను మీరు నాటిన వృక్షాన్ని.. ఆ వృక్షాన్ని కల్వకుట్ల తారకరామారావు నరకాలని చూస్తున్నాడు. తండ్రికొడుకులు కలిసి మీరు పెంచిన వృక్షాన్ని నరికేస్తామంటున్నరు.. నరకనిస్తరా.. ఎవరొచ్చినా పాతాళానికి తొక్కుతరా?  సిరిసిల్ల నుంచి వచ్చిన దద్దమ్మ కేటీఆర్‌.. ‌కొడంగల్‌ ‌ను దత్తత తీసుకుంటా అన్నడు. నేను చెబుతున్నా.. కొడంగల్‌ ‌నియోజకవర్గమే తెలంగాణను దత్తత తీసుకుంటుంది. నిరుద్యోగ యువకులకు ఉపాధి అవకాశాలు ఇస్తుంది. రైతులు పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధరను ఇస్తుంది’’ అని రేవంత్‌ ‌రెడ్డి వ్యాఖ్యానించారు. మనందరికి డబుల్‌ ‌బెడ్‌ ‌రూమ్‌ ఇం‌డ్లు కట్టిస్తానని కేసీఆర్‌ ‌చెప్పిండు. కానీ ఎవరికీ ఇవ్వలేదు. కొడంగల్‌ ‌సాక్షిగా చెబుతున్నా… లక్ష కోట్ల రూపాయాలు.. పది వేల ఎకరాలు భూమి దోచుకున్న కేసీఆర్‌ ‌కు చర్లపల్లి జైల్లో డబుల్‌ ‌బెడ్రూం ఇల్లు కట్టించడం ఖాయమన్నారు. కాంగ్రెస్‌ ‌పార్టీ అధికారంలోకి రాగానే ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామన్నారు రేవంత్‌ ‌రెడ్డి. కొడంగల్‌ ‌గడ్డపై ఎగిరేది కాంగ్రెస్‌ ‌జెండానే అని ధీమా వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page