ఉ‌ద్రిక్తంగా కాంగ్రెస్‌ ‌చలో రాజ్‌భవన్‌

  • ‌ఖైరతాబాద్‌లో టూ వీలర్‌ ‌దగ్ధం..బస్సు అద్దాలు ధ్వంసం
  • కాంగ్రెస్‌ ‌కార్యకర్తలను ఎక్కడికక్కడే అడ్డుకున్న పోలీసులు
  • రాజ్‌భవన్‌ ‌వెళుతుండగా రేవంత్‌ ‌తదితరుల అరెస్ట్
  • ‌తనను అడ్డుకున్న పోలీస్‌ ‌కాలర్‌ ‌పట్టుకున్న రేణుకా చౌదరి
హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 15 : ‌రాహుల్‌ ‌గాందీపై ఈడీ విచారణకు వ్యతిరేకంగా కాంగ్రెస్‌ ‌చేపట్టిన చలో రాజ్‌భవన్‌లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. గురువారం టీపీసీసీ పిలుపునిచ్చిన ఛలో రాజ్‌ ‌భవన్‌ ‌కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. ఖైరతాబాద్‌  ‌సర్కిల్‌ ‌వద్ద  కాంగ్రెస్‌ ‌శ్రేణులు స్కూటీకి నిప్పుపెట్టడంతో పాటు బస్సుల అద్దాలను ధ్వంసం చేశారు. అంతేగాకుండా బస్‌ ఎక్కి ఆందోళన  చేశారు. రాజ్‌ ‌భవన్‌ ‌వైపు వెళ్లకుండా  పోలీసులు భారీ కేడ్లు ఏర్పాటు చేశారు పోలీసులు. వాటిని తోసుకుని కాంగ్రెస్‌ ‌నేతలు రేవంత్‌ ‌రెడ్డితో పాటు పలువురు నేతలు పరుగెత్తారు. వారిని అడ్డుకునే క్రమంలో పోలీసులకు కాంగ్రెస్‌ ‌శ్రేణులకు మధ్య తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. దీంతో రేవంత్‌ ‌రెడ్డి, జగ్గారెడ్డి, గీతారెడ్డి, శ్రీధర్‌ ‌బాబు, అంజన్‌ ‌కుమార్‌లను పోలీసులు అరెస్ట్ ‌చేసి స్టేషన్‌కు తరలించారు. రేవంత్‌ ‌రెడ్డి అరెస్ట్‌తో పాటు వందలాదిగా తరలి వొచ్చిన కాంగ్రెస్‌ ‌కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. వారిపై పోలీసులు లాఠీ చార్జ్ ‌చేయడంతో పలువురికి గాయలయ్యాయి.

image.png

పోలీసుల తీరుపై కాంగ్రెస్‌ ‌నేతలు మండిపడ్డారు.  రాహుల్‌ ‌గాంధీని ఈడీ విచారణ పేరుతో రాజకీయ కక్ష సాధింపు చర్యలకు గురి చేస్తున్నారంటూ రాజ్‌ ‌భవన్‌ ‌ముట్టడికి పిలుపునిచ్చింది. దీంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రాజ్‌ ‌భవన్‌ ‌ముందు బారికేడ్లు ఏర్పాటు చేసిన పోలీసులు..ఐడీ కార్డు ఉంటేనే రాజ్‌ ‌భవన్‌ ‌సిబ్బందిని కూడా లోపలకి అనుమతించారు. మరో వైపు రాజ్‌ ‌భవన్‌ ‌ముట్టడికి పిలునివ్వడంతో కాంగ్రెస్‌ ‌నేతలను పోలీసులు ముందస్తు అరెస్టులు చేశారు. మాజీ ఎమ్మెల్యే సంపత్‌ ‌కుమార్‌ను పోలీసులు హౌస్‌ అరెస్ట్ ‌చేశారు. రాష్ట్రంలో పోలీసుల రాజ్యం నడుస్తుందని ఫైర్‌ అయ్యారు. పోలీసులు తమని రెచ్చగొట్టం వల్లే వాహనాలను ధ్వంసం చేశారమన్నారు . ఘర్షణలో కొందరు సంఘవిద్రోహా శక్తులు చేరి తమ పార్టీని దెబ్బతీసే కుట్ర చేశారన్నారు. కాంగ్రెస్‌ ‌నేతల ధర్నాతో భారీగా ట్రాఫిక్‌ ‌జామ్‌ అయింది.
image.png
వాహనాలు కిలోవి•టర్‌ ‌కొద్ది నిలిచిపోయాయి. నిరసనలో పాల్గొన్న కాంగ్రెస్‌ ‌మహిళా కార్యకర్తలను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తనను అడ్డుకున్న పోలీసులతో రేణుకా చౌదరి వాగ్వాదానికి దిగింది. ఓ పోలీసు కాలర్‌ ‌ను పట్టుకుంది. దీంతో ఆమెను పోలీస్‌ ‌స్టేషన్‌ ‌కు తరలించారు. ఈ క్రమంలో నగరంలోని ఖైరతాబాద్‌లో కాంగ్రెస్‌ ‌నేతల ఆందోళనలు ఉద్రిక్తతకు దారి తీసింది. రోడ్డుపై యువజన కాంగ్రెస్‌ ‌నేతలు బైక్‌కు నిప్పు పెట్టారు. బస్సులను అడ్డుకుని నిరసనకు దిగారు. ఆర్టీసీ బస్సు అద్దాలను ధ్వంసం చేశారు. యూత్‌ ‌కాంగ్రెస్‌ ‌నేత అనిల్‌ ‌కుమార్‌ ‌యాదవ్‌ ఆర్టీసీ బస్‌ ఎక్కి నిరసన తెలిపారు. కాంగ్రెస్‌ ‌నేతల ఆందోళనలతో ఖైరతాబాద్‌లో భారీగా ట్రాఫిక్‌ ‌జామ్‌ అయ్యింది. ఈ క్రమంలో ఖైరతాబాద్‌ ‌సర్కిల్‌ ‌వద్దకు  కాంగ్రెస్‌ ‌కార్యకర్తలు భారీగా చేరుకుంటున్నారు. దీంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు కాంగ్రెస్‌ ‌కార్యకర్తలు రాజ్‌భవన్‌కు వెళ్ళకుండా బారికేడ్లను అడ్డుపెట్టారు.
నన్నే టచ్‌ ‌చేస్తావా..నీ స్టేషన్‌కొచ్చి కొడతా : పోలీస్‌ అధికారిపై రేణుకాచౌదరి ఆగ్రహం
‘నన్నే పట్టుకుంటావా.. స్టేషన్‌కు వొచ్చి మరీ కొడతా’ అంటూ పోలీసు అధికారిపై మాజీ కేంద్రమంత్రి రేణుకాచౌదరి తీవ్రంగా ఫైర్‌ అయ్యారు. ‘నాపై చేయి వేస్తే పార్లమెంట్‌ ‌వరకు ఈడ్చుకెళ్తా’ అని హెచ్చరించారు. అనంతరం రేణుకా చౌదరిని పోలీసులు వాహనంలో పోలీస్‌ ‌స్టేషన్‌కు తరలించారు. ఈ దృశ్యాలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. ఆమె ఛలో రాజ్‌భవన్‌లో పోలీసులకు చుక్కలు చూపించారు. అరెస్టు చేసేందుకు యత్నించిన ఖాకీలను ఖబడ్దార్‌ అం‌టూ హడలెత్తించారు. మహిళా నేతలతో వొచ్చిన రేణుకను పోలీసులు అడ్డగించారు. అరెస్టు చేసే క్రమంలో ఓ మహిళా పోలీస్‌ ‌రేణుకను పట్టుకునేందుకు యత్నించారు. ఈ క్రమంలో ఆమె పోలీసులపై కన్నెర్ర చేశారు. ‘తనను టచ్‌ ‌చేస్తే ఖబడ్డార్‌’ అం‌టూ వార్నింగ్‌ ఇచ్చారు. అంతటితో ఆగని రేణుకా చౌదరి ఎస్‌ఐ ‌కాలర్‌ ‌పట్టుకున్నారు. నన్నే అరెస్టు చేస్తారా? అంటూ రచ్చ రచ్చ చేశారు. రేణుకా తీరుతో పోలీసులు ఒకింత భయపడ్డారు. భట్టి విక్రమార్క, రేణుకా చౌదరిపై పంజాగుట్ట పోలీస్‌ ‌స్టేషన్‌లో కేసులు నమోదయ్యాయి.
image.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page