ఎంపీ ప్రభాకర్ రెడ్డి పై కత్తితో దాడి…కడుపులో గాయాలు
సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం సూరంపల్లి గ్రామంలో ఎన్నికల ప్రచారంలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి పై కత్తితో గుర్తుతెలియని వ్యక్తి దాడి చేసారు.
ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డికి కడుపులో గాయాలు అయ్యాయి..ఆయనను స్థానిక హాస్పిటల్ కు తరలించారు.నారాయణ్ ఖెడ్ సభకు వెళ్తూ విషయం తెలియగానే మంత్రి హరీశ్ రావు గజ్వేల్ హాస్పటల్ కు బయలదేరారు.ఫోన్ లో పరామర్శించి మంత్రి హరీష్ రావు, అరోగ్య పరిస్థితి తెలుసుకున్నారు.
ఫోన్ లో ధైర్యం చెప్పిన మంత్రి హరీశ్ రావు అత్యవసరం అయితే హైదరాబాద్ తరలించేందుకు ఏర్పాటు చేయాలని సూచన చేసారు.ఎంపి ప్రభాకర్ రెడ్డి ని మెరుగైన వైద్యం కోసం గజ్వేల్ హాస్పిటల్ నుండి అంబులెన్స్ లో సికింద్రాబాద్ యశోద కు తరలిస్తున్నారు.