ఎకో-టూరిజంను ప్రోత్సహించడానికి ప్రభుత్వ భారీ ప్రణాళికలు

  • కాళేశ్వరం టూరిజం సర్క్యూట్‌లో ఎకో-టూరిజాన్ని ప్రోత్సహించేందుకు
  • బడ్జెట్‌లో రూ.750 కోట్లు కేటాయించారు.
  • కేంద్ర ప్రభుత్వానికి రూ.473 కోట్ల విలువైన ప్రతిపాదనలు.

రాష్ట్రంలో నేచర్‌ ‌టూరిజం సర్క్యూట్‌ ‌ప్యాకేజీల అభివృద్ధి దిశగా తెలంగాణ.
రాష్ట్రంలో ఎకో-టూరిజాన్ని భారీ ఎత్తున ప్రోత్సహించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. టూరిజం శాఖకు నోడల్‌ ఏజెన్సీ అయిన తెలంగాణ స్టేట్‌ ‌టూరిజం డెవలప్‌మెంట్‌ ‌కార్పొరేషన్‌ (‌టిఎస్‌టిడిసి) ద్వారా రాష్ట్రంలో టూరిజం కార్యకలాపాలను చేపట్టేందుకు ప్రణాళికలను సిద్దం చేస్తున్నది.ముఖ్యమంత్రి  కె. చంద్రశేఖర్‌ ‌రావు ఆదేశాల మేరకు, టిఎస్‌.‌టి.డి.సి కార్పొరేషన్‌ ‌హోటల్స్, ‌రిసార్ట్ ‌లు, బోట్లు/క్రూజ్‌లు, వే-సైడ్‌ ‌సౌకర్యాలు, రెస్టారెంట్లు, సస్పెన్షన్‌ ‌వంతెనలు, సౌండ్‌ • ‌లైట్‌ ‌షోలు, గ్లో గార్డెన్‌, ‌మ్యూజికల్‌ ‌వంటి పర్యాటక మౌలిక సదుపాయాలను ఆయా ప్రాంతాల్లో గుర్తించి అభివృద్ధి చేయడానికి సంస్థ కృషి చేస్తున్నది.

రాష్ట్రవ్యాప్తంగా పర్యాటక అభివృద్ధికి  ప్యాకేజీ పర్యటనలు, బోటింగ్‌ ‌కార్యకలాపాలను కూడా చేపట్టింది.
‘‘కాళేశ్వరం టూరిజం సర్క్యూట్‌’’ (‌మేడిగడ్డ బ్యారేజ్‌, ‌కన్నెపల్లి పంప్‌ ‌హౌస్‌, ‌కాళేశ్వరం టెంపుల్‌, అన్నారం బ్యారేజీ, అన్నారం వాటర్‌ ‌కెనాల్‌, ‌సుందిళ్ల బ్యారేజీ • ఎల్లంపల్లి రిజర్వాయర్‌) అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం 2022-23 ఆర్థిక సంవత్సరానికి రూ.750 కోట్లను ఇటీవల బడ్జెట్‌లో కేటాయించింది.  పనులు డిజైన్‌ ‌దశలో ఉన్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page