- విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారు
- గ్రూప్-1 పరీక్షపై టిఎస్‌పిఎస్‌సిపై హైకోర్టు ఆగ్రహం…విచారణ నేటికి వాయిదా
హైదరాబాద్, సెప్టెంబర్ 22 : గ్రూప్-1 పరీక్షపై విషయంలో ఎన్నిసార్లు నిర్లక్ష్యం వహిస్తారని టిఎస్‌పిఎస్‌పిపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. జూన్ 11న రెండవ సారి నిర్వహించిన పరీక్షను కూడా ఈ నెల 23న హైకోర్టు సింగిల్ బెంచ్ ధర్మాసనం రద్దు చేయడాన్ని సవాల్ చేస్తూ టిఎస్‌పిఎస్‌సి హైకోర్టు డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించిన విషయం తెలిసిందే.
దీనిపై మంగళవారం విచారణ సందర్భంగా ఒకసారి పేపర్ లీక్, ఇప్పుడేమో బయోమెట్రిక్ సమస్య పేరుతో విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉద్యోగాలు రాక నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. గ్రూప్-1 పరీక్షలో బయోమెట్రిక్ ఎందుకు పెట్టలేదని టిఎస్‌పిఎస్‌సిని హైకోర్టు ప్రశ్నించింది. పరీక్షల నిర్వహణలో టిఎస్‌పిఎస్‌సి విఫలమయిందని, పరీక్షపై పూర్తి వివరాలు సమర్పించాలని ఆదేశిస్తూ విచారణను నేటికి వాయిదా వేసింది.