- విఎవో నాగలక్ష్మి ఆత్మహత్య ఘటన దారుణం
- దీనికి అధికార పార్టీదే పూర్తి బాధ్యత
- ప్రభుత్వ తీరుపై మండిపడ్డ చంద్రబాబు, లోకేశ్
గుంటూరు, మార్చి 18 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ వర్గానికీ రక్షణ లేదన్న సంగతి నాగలక్ష్మి ఆత్మహత్య ఉదంతంతో మరోసారి రుజువైందని టిడిపి అధినేత చంద్రబాబు అన్నారు. మచిలీపట్నంలో విలేజ్ ఆర్గనైజింగ్ అసిస్టెంట్ (విఒఎ)గా పనిచేస్తున్న నాగలక్ష్మి తనను అధికార పార్టీకి చెందిన వ్యక్తి వేధిస్తున్నాడంటూ ఫిర్యాదు చేసినా పోలీసులు స్పందించకపోవడం దారుణమన్నారు. ఒక మహిళ స్పందన కార్యక్రమంలో స్వయంగా ఎస్పీకి ఫిర్యాదు ఇచ్చినప్పటికీ ఆ ఫిర్యాదుపై ఎలాంటి చర్యలూ తీసుకోని ఈ వ్యవస్థను ఏమనాలని ప్రశ్నించారు. ఈ మేరకు టిడిపి అధినేత చంద్రబాబు ఎపి ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడ్డారు. శుక్రవారం చంద్రబాబు డియాతో మాట్లాడుతూ… ప్రజల ప్రాణాల కంటే, బాధితుల వేదనల కంటే రాజకీయ ప్రయోజనాలే పోలీసులకు ప్రధానాంశంగా మారిపోయాయని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. నాగలక్ష్మి ఆత్మహత్యకు కారణమైన వారందరినీ శిక్షించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.
వీఓఏ నాగలక్ష్మిది ఆత్మహత్య కాదని… జగన్ రెడ్డి పార్టీ నేత చేసిన హత్య అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ఆరోపించారు. శుక్రవారం డియాతో మాట్లాడుత… కృష్ణాజిల్లా మచిలీపట్నం మండలం భోగిరెడ్డిపల్లి వీఓఏ నాగలక్ష్మి తాము చెప్పినట్టు వినడంలేదని వైసీపీ నేత నరసింహారావు వెంటాడి వేధించడంపై ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు చర్యలు తీసుకుని ఉంటే ఆమె బలవన్మరణానికి పాల్పడేది కాదన్నారు. ఎస్పీకి ఫిర్యాదు చేసినా వైసీపీ నేత నుంచి మహిళని రక్షించలేకపోయారంటే రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ ఎంతగా భ్రష్టు పట్టిందో తెలుస్తూనే ఉందని ఆయన మండిపడ్డారు.
ముఖ్యమంత్రి కు ఓట్లేసి గెలిపించింది ప్రజలకి రక్షకులుగా ఉంటారని, ప్రజల్నే భక్షిస్తారని కాదన్నారు. సొంత చెల్లెలిని తెలంగాణకు తరిమేసి, బాబాయ్‌ని చంపేసి ఆయన కుమార్తె ప్రాణాలకు రక్షణలేకుండా చేసిన జగన్‌రెడ్డిని ఆదర్శంగా తీసుకుని గ్రామస్థాయిలో కూడా వైసీపీ నేతలు మహిళల ప్రాణాలు తీసేస్తున్నారని వ్యాఖ్యలు చేశారు. చట్టాన్ని చుట్టంగా చేసుకున్న వైసీపీ నేతల అరాచకాలకు పోలీసులకు అండగా వున్న పరిస్థితుల్లో ప్రజలంతా కలిసి తిరుగుబాటు చేస్తేనే ప్రజల ధనమాన ప్రాణాలకు రక్షణ దొరుకుతుందని లోకేష్ పేర్కొన్నారు.