కందుకూరు,ప్రజాతంత్ర,నవంబర్ 7: అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కందుకూరు నగర కార్యదర్శిగా కందుకూరు మండలం అన్నోజిగుడ గ్రామానికి చెందిన డిల్లి భాను ప్రసాద్ నియమితులైనారు.కందుకూరు నగర ముఖ్య కార్యకర్తల సమావేశం మండల కేంద్రంలో నిర్వహించడం నిర్వహించినట్లు భానుప్రసాద్ ఒక ప్రకటనలో తెలియజేశారు.అనంతరం నగర నూతన కమిటిని ప్రకటించడం జరిగిందన్నారు.ఈ సంధర్బంగా ఎబివిపి రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు కందడి శ్రీరామ్ మాట్లాడుతూ,జాతీయ పునర్నిర్మాణమే లక్ష్యంగా జ్ఞానం,శీలం,ఏకత,సిద్ధాంతాలతో జాతీయ భావాలు నింపుతున్న అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ 1949 జూలై 9న ఏర్పడి 75సంవత్సరాలకాలంగా దేశంలో విద్యార్థుల మధ్య ఉందన్నారు. విద్యారంగ సమస్యల పరిష్కారమే కాకుండా దేశభక్తిని పెంచే మరెన్నో ఉద్యమాలు చేస్తూ ప్రపంచంలోనే అతిపెద్ద విద్యార్ధి సంస్థగా నిలిచిందని అన్నారు.అనంతరం నూతన మల్ నగర కమిటీ ప్రకటించడం జరిగింది. ఇందులో భాగంగా నగర కార్యదర్శిగా ఢిల్లీ భాను ప్రసాద్,నగరఉపాధ్యక్షులుగా,క్రాంతి,సుదర్శన్,అమరేందర్, ,నగర సంయుక్త కార్యదర్శులుగా రాజేష్,జగదీశ్, వంశీ,సిద్దు,నగర ఎస్ ఎఫ్ డి కన్వీనర్ గా బాను చారి,సోషల్ మీడియా కన్వీనర్ గా ప్రశాంత్,ఖేల్ కన్వినర్ గా శ్రీనివాస్,నగర కార్యవర్గ సభ్యులుగా రాజేష్,సిద్దు,ప్రసాద్, రాహుల్,నూతన భాద్యతలు ఇవ్వడం జరిగిందని తెలిపారు.ఈ కార్యక్రమంలో తదితర పాల్గొన్నారు.